సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సమ్మర్ క్యాంపులో భాగంగా నిర్వహించిన ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో సీసీఓబీ విజేతగా నిలిచింది. విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన అండర్-14 ఫైనల్లో సీసీఓబీ జట్టు పది వికెట్ల తేడాతో ఖిల్వత్ సీసీపై గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఖిల్వత్ క్రికెట్ క్లబ్ నిర్ణీత 6 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సీసీఓబీ 4.4 ఓవర్లలోనే వికెట్లేమీ నష్టపోకుండా 42 పరుగులు చేసి గెలిచింది. అర్బాజ్ 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. కోచ్ మక్బూల్ బేగ్, జగన్నాథ్ స్వామి, సయ్యద్ షహీన్, మీర్ దావూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ క్రికెట్ విజేత సీసీఓబీ
Published Sun, Jun 8 2014 1:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement