‘డబుల్’పై రెవెన్యూ సర్వే!
మురికివాడల్లో స్థలాల గుర్తింపే లక్ష్యం
బిజీగా మారిన అధికారులు
త్వరలో సర్కారుకు సమగ్ర నివేదిక
సిటీబ్యూరో: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంపై దృష్టి సారించిన ప్రభుత్వం స్థలాల ఎంపికపై మురికివాడల్లో సర్వే నిర్వహిస్తున్నది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 1476 మురికివాడల్లో రెవెన్యూ శాఖ అధ్వర్యంలో తహాశీల్దార్లు, సిబ్బంది మూడు రోజులుగా సర్వే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ప్రకటించటంతోపాటు నగరంలో ఒక మోడల్ కాలనీ కూడా నిర్మించారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి ఆదరణ పెరిగింది. ఫలితంగా హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లతో సహా జీహెచ్‌ఎంసీ చుట్టూ ప్రజలు, మహిళలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొవటానికి పరుగులు తీస్తున్నారు. గ్రేటర్ లో మొదటి విడతలో 11,500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 46 బస్తీలను గుర్తించిన అధికార యంత్రాంగం...ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నగరంలో లక్ష ఇళ్ల కోసం మరి కొన్ని బస్తీలను గుర్తించాల్సిన అవసరం నెలకొంది. ఈ నేపథ్యంలోనే మురికివాడల్లో స్థలాల గుర్తింపు తదితర అం శాలను పరిశీలించేందుకు సర్వే కార్యక్రమా న్ని రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్నది. ఈ సర్వేలో భాగంగా మురికి వాడ ల్లో నివాసముంటున్న కుటుంబాల సంఖ్యతోపాటు స్థల వైశాల్యం, భూమి వివరాలు, సర్వే నంబర్లు సేకరిస్తున్నా రు.
ఈ వాడల్లో గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారా లేదానన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. స్లమ్‌లో డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి ఇక్కడి ప్రజలు సానుకూలంగా ఉన్నారా..? లేక భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారా...అన్న విషయాలను సర్వే సందర్భంగా సిబ్బం ది సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది. మురికి వాడల్లో సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని సమగ్ర నివేదిక రూపంలో రెండు రోజుల్లోగా రెవెన్యూ శాఖ జిల్లా అధికారయంత్రాంగానికి నివేదించనుంది. ఇదే నివేదికను మరో మారు జిల్లా స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తున్నది.