top position
-
దొంగదెబ్బ తీసిన కమాండర్లకు ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం!
బీజింగ్: పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత సైనికులపై దొంగదెబ్బ తీయటంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ కమాండ్ జనరల్స్‌పై ప్రశంసలు కురిపించింది. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండ్ జనరల్స్‌కు ప్రమోషన్ కల్పిస్తూ.. టాప్ పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం భారత సరిహద్దులోని వెస్టర్న్ థియోటర్ కమాండ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► జనరల్ హీ వెయిడాంగ్(65)ను సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) కొత్త వైస్ ఛైర్మన్‌గా నియమించారు జిన్‌పింగ్. సీఎంసీకు అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తారు. మరోవైపు.. సీఎంసీలో ఎలాంటి పదవులు చేపట్టకుండానే వైస్ ఛైర్మన్ పోస్టులోకి జనరల్ హీ వెయిడాంగ్ను నియమించటం గమనార్హం. ► జనరల్ ఝాంగ్ యూక్సియా(72).. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. పదవీ విరమణ వయసు దాటినప్పటికీ ఆయనను ఫస్ట్ ర్యాంకింగ్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. పీఎల్ఏలో జిన్‌పింగ్‌కు కుడిభుజంగా ఝాంగ్‌ను చెప్పుకుంటారు. ► జనరల్ జు క్విలింగ్(60)ను 205 మంది సభ్యులుగా ఉన్న పార్టీ కొత్త సెంట్రల్ కమిటీలో నియమించారు జిన్‌పింగ్. మరోవైపు.. నియంత్రణ రేఖ వద్ద సంక్షోభం తలెత్తిన క్రమంలో జనరల్ జు క్విలింగ్ ఇంఛార్జిగా ఉన్నారు. దీంతో 2021 జులైలో డబ్ల్యూటీసీ హెడ్‌గా , లెఫ్టినెంట్ జనరల్ నుంచి జనరల్‌గా పదోన్నతి పొందారు. మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(69)కి సైతం పదవీ విరమణ వయసు దాటినప్పటికీ తనతోనే అట్టిపెట్టుకున్నారు జిన్‌పింగ్. పొలిట్ బ్యూరోలోకి వాంగ్ యీని తీసుకున్నారు. పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా.. -
పుర రాబడి రూ.1,123 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఆదాయం లెక్క తేలింది. కొత్తగా కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటైన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అదనపు సిబ్బంది ని యామక ప్రక్రియలో భాగంగా ఆయా పట్టణ సంస్థల కాసుల లెక్కను కూడా పురపాలక శా ఖ అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. ఆ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని (140) పురపాలికల్లో కలిపి ప్రభుత్వ ఖజానాకు రూ.1,123.87 కోట్లకు పైగా ఆదా యం సమకూరుతోంది. ఇందులో ఆస్తి పన్ను కింద రూ.671.33 కోట్లు.. ఇతర ఆదాయం రూ. 452.53 కోట్లు ఉంది. అయితే ఆస్తి పన్ను హే తుబద్ధీకరణ, ఇతర పన్నుల విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తే ఈ ఆదా యం మరో 20 శాతమైనా పెరుగుతుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అగ్రభాగాన నార్సింగి.. అట్టడుగున అమరచింత మున్సిపాలిటీల ఆదాయంలో నార్సింగి అగ్రభాగాన ఉంది. రాజధానిని ఆనుకొని ఉన్న ఈ పురపాలిక వార్షికాదాయం రూ.26.12 కోట్లు, ద్వితీయ స్థానంలో మణికొండ రూ.20.11 కోట్లు, జగిత్యాల రూ.15.28 కోట్లుండగా.. అట్టడుగున అమరచింత మున్సిపాలిటీ ఉంది. ఇంకా పల్లె వాసనలు పోనీ ఈ పురపాలిక వార్షికాదాయం కేవలం రూ.13.92 లక్షలు మాత్రమే. ఆ తర్వాత స్థానం వడ్డేపల్లి రూ.16.80 లక్షలు, అలంపూర్ రూ.29.40 లక్షలు, చండూరు రూ.31.55 లక్షలు, భూత్పూర్ రూ.34.11 లక్షలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంభన సాధించాలంటే పన్నులు పెంచుకోవడమో, ఆర్థిక వనరులు సమీకరించుకుంటే తప్ప అభివృద్ధి సాధ్యపడదు. లేదంటే ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. అదనంగా 2,521 పోస్టులకు ప్రతిపాదన.. ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు పురపాల క శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రస్తుతం రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 నగర, పురపాలక సంస్థ (జీహెచ్ఎంసీ మినహా)ల్లో 3 వేల మందికిపైగా ఉద్యోగులు ప ని చేస్తున్నారు. కొత్త పురపాలికలు పెరగడం, పరిధి వి స్తృతి కావడం, పనిభారం పెరగటంతో దానికి తగ్గట్టు గా సిబ్బంది అవసరమని మున్సిపల్ శాఖ అంచనా వే సింది. మున్సిపల్ కార్యకలాపాల నిర్వహణకు ప్రతి మున్సిపాలిటీకి 36 మంది అవసరం. ఇందులో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్–3, అసిస్టెంట్ ఇంజనీర్–3, టౌన్‌ప్లానిం గ్ అబ్జర్వర్ (టీపీబీఓ), జూనియర్ అకౌంటెంట్, హెల్త్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టు లుంటాయి. వీటికి అదనంగా ఇతర సిబ్బంది ఉంటారు. అయితే, చాలా చోట్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో సి బ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పోస్టులు మంజూరు చేయాలని పురపాలకశాఖ ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొత్తగా 2,521 పోస్టులు మంజూరుకు అనుమతివ్వాలని కోరింది. ఓరుగల్లు టాప్! ఇక ఆదాయంలో ఓరుగల్లు టాప్‌లో నిలిచింది. హైదరాబాద్ నగర పాలక సంస్థ తర్వాతి స్థానం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌దే.. ఈ నగర పాలక సంస్థ వార్షికాదాయం రూ.121.65 కోట్లు. ఇందులో ఆస్తి పన్ను రూపంలో రూ.80.65 కోట్లు సమకూర్చుకుంటుండగా, రూ.40.99 కోట్లు ఇతర పద్దుల కింద సమీకరిస్తోంది. ఓరుగల్లు తర్వాత రాబడిలో ఇందూరు ద్వితీయ స్థానంలో ఉంది. ఈ నగర పాలక సంస్థ వార్షికాదాయం రూ.58.86 కోట్లు. ఇక మూడో స్థానంలో ఖమ్మం రూ.44.08 కోట్లు, నాలుగో స్థానంలో కరీంనగర్ రూ.41.57 కోట్లు ఉంది. ఇక అత్యల్ప రాబడి ఉన్న నగర పాలక సంస్థ జవహర్‌నగర్. దీని వార్షికాదాయం రూ.5.97 కోట్లే.. ఆ తర్వాత స్థానంలో మీర్‌పేట రూ.10.60 కోట్లతో కొనసాగుతోంది. రాష్ట్రంలో రూ.కోటి కన్నా తక్కువ ఆదాయమున్న మున్సిపాలిటీలివే -
ఉపాధి కల్పనలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రం ముందంజలో నిలుస్తోంది. కూలీలకు పనికల్పనతో పాటు ఉపాధి హామీ పథకం నిర్వహణలో మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు పదికోట్ల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అందులో ఇప్పటికే 9.85 కోట్ల పనిదినాలను పూర్తిచేసింది. ఈ ఏడాది కేటాయించిన పనుల లక్ష్యాలను చేరుకుంటుండడం తో పాటు పనుల కల్పనలో పురోగతిని అంచనా వేసి, దాదాపు రెండు నెలల క్రితమే మరో రెండుకోట్ల పనిదినాలని అదనంగా కల్పించాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈమేరకు రాష్ట్రానికి మరో రెండుకోట్ల పనిదినాలకు అదనంగా అనుమతినిచ్చింది. 14 రాష్ట్రాలు 50 శాతం లోపే.. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాలు ఉపాధి పనుల కల్పనలో 50% లోపే లక్ష్యాలను చేరుకోగా, 9.85 కోట్ల పని దినాలతో 87.38% ప్రగతితో తెలంగాణ ముందు వరుసలో నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 23.61 లక్షల కుటుంబాల్లోని 38.97 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. రోజుకు రూ. 150 చొప్పున ఒక్కో కూలీకి సగటున వేతనం అందింది. ఇప్పటివరకు రోజువారీ వేతనాలుగా కూలీలకు రూ. 1,477 కోట్ల మేర వారి ఖాతాల్లో డిపాజిట్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది వందరోజుల పనిదినాలు పూర్తిచేసుకున్నారు. పనుల కల్పనలో జోగుళాంబ గద్వాల జిల్లా 77%తో అట్టడుగున నిలవగా.. నిర్మల్ జిల్లా 92%తో, ఆదిలాబాద్ జిల్లా 90%తో అగ్రభాగాన నిలిచాయి. -
అవినీతిలో ‘రెవెన్యూ’ టాప్: రూపానీ
అహ్మదాబాద్: గుజరాత్లో అవినీతిలో రెవెన్యూ విభాగం తొలిస్థానంలో, పోలీస్ డిపార్ట్మెంట్ రెండో స్థానంలో ఉన్నాయని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంగీకరించారు. ప్రభుత్వ సంస్థల్లో అవినీతి జాఢ్యాన్ని అరికట్టడం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. అహ్మదాబాద్‌లో బుధవారం వేయి మంది భూ యజమానులకు ఆన్లైన్ ధ్రువీకరణ పత్రాలు ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో భయం వల్లో, నైతిక కారణాలతోనో ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు పుచ్చుకునేందుకు సందేహించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల ఎలాంటి సంకోచం లేకుండా వారు లంచాలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. -
స్మార్ట్‌ఫోన్స్‌లో మళ్లీ శాంసంగ్ టాప్
న్యూఢిల్లీ: కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో పోటీ సంస్థ షావోమీని వెనక్కి నెట్టి.. మళ్లీ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 29 శాతం మార్కెట్ వాటాను సాధించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం జూన్ క్వార్టర్లో షావోమీ 28 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానానికి పరిమితమైంది. కొన్నాళ్లుగా దేశీ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్న శాంసంగ్ 2018 అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో రెండో స్థానానికి పడిపోగా.. షావోమీ నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుంది. మళ్లీ రెండు క్వార్టర్ల తర్వాత ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో శాంసంగ్ మరోసారి అగ్రస్థానానికి చేరినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనలిస్టు కరణ్ చౌహాన్ తెలియజేశారు. జే సిరీస్ ఫోన్స్, పెద్ద సంఖ్యలో కొత్త మోడల్స్ ప్రవేశపెట్టడం తదితర అంశాలు శాంసంగ్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి తోడ్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో... ముఖ్యంగా రాబోయే పండుగల సీజన్లో రెండు సంస్థల మధ్య పోరు పోటాపోటీగా ఉండవచ్చని తెలిపారు. జూన్ క్వార్టర్లో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో వివో 12 శాతం, ఒప్పో 10 శాతం, ఆనర్ 3 శాతం వాటాలను నమోదు చేశాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో (రూ.30,000 పైబడి ధర ఉన్న ఫోన్స్) వన్‌ప్లస్ సంస్థ తొలిసారిగా నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుంది. పంపిణీ వ్యూహాల్లో మార్పుల కారణంగా టెక్ దిగ్గజం యాపిల్ మార్కెట్ 1 శాతానికి పరిమితమైంది. ఇటీవలి కాలంలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. మరోవైపు ఫీచర్ ఫోన్ మార్కెట్లో రిలయన్స్ జియో (47 శాతం వాటా), శాంసంగ్ (9 శాతం), నోకియా (8%), ఐటెల్ (6%), లావా (5% వాటా) టాప్ అయిదు స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 18 శాతం మేర, ఫీచర్ ఫోన్ మార్కెట్ 21 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. -
ఎస్కేయూను అగ్రగామిగా నిలిపేందుకు కృషి
►వీసీ ఆచార్య కె. రాజగోపాల్ ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వీసీ ఆచార్య కె.రాజగోపాల్ పేర్కొన్నారు. ఎస్కేయూ వీసీ కాన్ఫరెన్స్ హాలులో అకడమిక్ సెనెట్ కమిటీ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. వీసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. గత పాలక మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అకడమిక్ సెనెట్ సమ్మతించింది.రూ.57.7 కోట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు, రూ.20 కోట్లు రూసా నిధులు ఉండటంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఏర్పడిందని వీసీ పేర్కొన్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణం, వర్సిటీ ప్రహరీ మరమ్మతు, నూతన పరీక్షల విభాగం నిర్మాణం తదితర అభివృద్ధిపనుల చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్ ఆచార్య హెచ్.లజపతి రాయ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.సుధాకర్ బాబు, పాలకమండలి సభ్యులు రామయ్య, విజయారావు, నాగ జ్యోతిర్మయి, డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, డాక్టర్ ముచ్చుకోట బాబు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీఎన్ కృష్ణానాయక్, ఎస్వీ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య కొలకలూరి ఇనాక్, పీవీ రమణా రెడ్డి, అకడమిక్ సెనెట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
నంబర్‌వన్ వార్నర్
► ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ► మూడో స్థానానికి కోహ్లి దుబాయ్: ఆస్ట్రేలియా సంచలన బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు నంబర్‌వన్ గా ఉన్న ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా–861 పాయింట్లు)ను వెనక్కి నెట్టి వార్నర్ (880) టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. 2016 ఆరంభం నుంచి అత్యద్భుత ఫామ్‌లో ఉన్న వార్నర్... ఈ సమయంలో 28 వన్డేల్లో 65 సగటుతో 1,755 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారి మూడో ర్యాంక్ (852)కు పడిపోయాడు. బ్యాట్స్‌మెన్ జాబితాలో టాప్–20లో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు ధోని (13వ), శిఖర్ ధావన్ (15వ) ఉన్నారు. వన్డే బౌలర్ల జాబితాలో ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ నుంచి అత్యుత్తమంగా అక్షర్ పటేల్ 12వ స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్లలో షకీబ్ అల్ హసన్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. -
‘టెక్నాలజీ వినియోగంలో అగ్రస్థానంలో తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించుకోవడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో ప్రణాళిక శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగమే మన ఊరు–మన ప్రణాళికన్నారు. ప్రతి గ్రామాన్ని జియో ట్యాగింగ్ చేస్తామని, దీంతో మెరుగైన ఫలితాలు వస్తా యన్నారు. వాతావరణ పరిస్థితులను వివరించడం లో ఆయా శాఖలు విఫలమవుతున్నాయని, రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ద్వారా రైతులకు ఖచ్చితమైన సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవా లన్నారు. బీమా పథకాలపై రైతులు విశ్వాసం కోల్పోతున్నారని, ఈ భావన పోగొట్టి ప్రతి రైతుకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంటకోత ప్రయోగాలు జరిగేలా చూడాలని, క్షేత్రస్థాయిలో స్థితిగతులు మార్చడంలో ప్రణాళిక శాఖ ప్రాధాన్యత ఎంతో ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రస్థానంలోకి భారత్
బాకు (అజర్బైజాన్): చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలి సారి పురుషుల విభాగంలో భారత జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఆరో రౌండ్ పోటీల్లో భారత్ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ పోరులో భారత్ 2.5-1.5 పాయింట్ల తేడాతో నెదర్లాండ్సను ఓడించింది. ఆదిబన్ విజయం సాధించగా... హరికృష్ణ, విదిత్ గుజరాతీ, ఎస్పీ సేతురామన్ తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. మహిళలు కూడా... మహిళల విభాగంలోనూ భారత్ 2.5-1.5 తేడాతో లాత్వియాపై గెలుపొందింది. ద్రోణవల్లి హారిక 26 ఎత్తుల్లో డానా ఒజోలాపై... సౌమ్య స్వామినాథన్, ఇంగునాపై విజయం సాధించారు. బెర్జినా ఇల్జే చేతిలో తాన్యా సచ్దేవ్ పరాజయం పాలు కాగా... పద్మినీ రౌత్, లౌరా రోగులే మధ్య 140 ఎత్తుల పాటు హోరాహోరీగా సాగిన గేమ్ డ్రాగా ముగిసింది. -
భారత్ అగ్రరాజ్యంగా ఎదగడం ఖాయం
నూజివీడు : మన దేశంలో ప్రపంచంలోఎక్కడా లేని విధంగా యువశక్తి ఉందని, ఈ శక్తిని సమర్థంతంగా ఉపయోగించుకుంటే కొద్దికాలంలోనే భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగడం ఖాయమని ఆర్జీయూకేటీ చాన్సలర్ రాజ్‌రెడ్డి అన్నారు. రూ.14 కోట్లతో నిర్మించిన స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌ను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్న సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. సమాచార సాంకేతికను ఉపయోగించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ముందస్తు మార్పులను గమనిస్తూ వాటిని ఆకళింపు చేసుకుంటూ తదనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ట్రిపుల్ఐటీ విద్యార్థులంటే దేశంలోనే రోల్‌మోడల్‌గా ఉండాలన్నారు. అనంతరం ఫ్లిప్డ్ క్లాస్ రూమ్‌లను ప్రారంభించారు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వద్ద ఛాన్సలర్ రాజ్‌రెడ్డి మొక్కలు నాటారు. ఆకట్టుకున్న యోగా ప్రదర్శన.. ట్రిపుల్ ఐటీ యోగా విద్యార్థులు చేసిన ప్రదర్శన చాన్సలర్‌తో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. వందేమాతరం గీతానికి అనుగుణంగా రూపొందించిన ఈ యోగాసనాలను చూసి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి వీసీ పీ విజయప్రకాష్, డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు, ఈసీ సభ్యుడు ఉన్నం వెంకయ్య, ఏవో పీ అప్పలనాయుడు, డీన్ అకడమిక్ కోసూరి హనుమంతరావు, ఇడుపులపాయ డీన్ అకడమిక్ వేణుగోపాలరెడ్డి, ఫైనాన్స్ అధికారి అరుణకుమారి, ఏపీఆర్వో కిరణ్మయి పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
ఈ నెలాఖరు వరకు మరో రెండు కోట్ల మొక్కలు నాటాలి ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తిమ్మాపూర్/బెజ్జంకి : హరితహారం కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నాలుగో స్థానంలో ఉందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లక్ష్యం మేరకు నాలుగు కోట్ల మెుక్కలు నాటి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని ఎల్ఎండీ హెడ్ రెగ్యులేటర్ సమీపంలోగల ఎస్సారెస్పీ స్థలంలో మెుక్కలు నాటారు. బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని బుడిగజంగాలకు చెందిన 16 ఎకరాల భూముల్లో 50 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరితహారంలో ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల తరువాత కరీంనగర్ నాలుగో స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని సగం మంది ఎమ్మెల్యేలు అమెరికాలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు వెళ్లడంతో ఆయా నియోజకవర్గాలు హరితహారంలో వెనుకబడ్డాయని అన్నారు. జిల్లాలో నాలుగు కోట్ల మెుక్కలు నాటడం లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 2.45కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. మిగతా రెండు కోట్ల మెుక్కలు నాటే లక్ష్యాన్ని ఈ నెలలో పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే నుంచి వార్డు మెంబరు దాకా.. కలెక్టర్ నుంచి అటెండర్ దాకా ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమాల్లో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెమిటెన్సుల్లో మనమే టాప్
2015లో 69 బిలియన్ డాలర్లు వాషింగ్టన్: విదేశాల నుంచి వస్తున్న రెమిటెన్స్‌ల స్వీకరణలో భారత్.. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రెమిటెన్స్‌ల రూపంలో భారత్‌కు గతేడాది 69 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం 2014తో (70 బిలియన్ డాలర్లు) పోలిస్తే 1 బిలియన్ డాలర్లమేర తక్కువ (2.1 శాతం క్షీణత). రెమిటెన్స్‌లు తగ్గడం 2009 నుంచి చూస్తే ఇదే తొలిసారి. ఈ విషయాలను వరల్డ్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇక భారత్ తర్వాతి స్థానాల్లో చైనా (64 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (28 బిలియన్ డాలర్లు), మెక్సికో (25 బిలియన్ డాలర్లు), నైజీరియా (21 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. విదేశాల్లో వృత్తి,ఉద్యోగాలు చేస్తున్న వారు అక్కడ సంపాదించిన డబ్బును స్వదేశానికి పంపే నగదును రెమిటెన్స్‌లుగా వ్యవహరిస్తారు. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం.. మొత్తంగా చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలకు రెమిటెన్స్‌లు పెరిగాయి. 2014లో 430 బిలియన్ డాలర్లుగా రెమిటెన్స్‌లు గతేడాది 0.4 శాతం వృద్ధితో 431.6 బిలియన్ డాలర్లకు ఎగశాయి. -
సిటీ నెం.1
♦ ‘దుమ్ము’ దులిపిన నివేదిక ♦ ధూళిలో గ్రేటర్‌దే అగ్రస్థానం ♦ కాలుష్య నియంత్రణ మండలి ♦ అధ్యయనంలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: అభివృద్ధి మాట ఏమోగానీ... దుమ్ము, ధూళి కాలుష్యంలో గ్రేటర్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. నగర వాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అనేకమంది ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతినడం... ఎడతెరిపి లేని దగ్గు... గుండె జబ్బులకు ధూళి కాలుష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మహా నగరంలో రోజుకు 11.9 టన్నుల ధూళి కాలుష్యం వెలువడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా ఆరు మహా నగరాలు... హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, పాట్నా, షోలాపూర్‌లలో కాలుష్యంపై సీపీసీబీ ఇటీవల అధ్యయనం చేసింది. దీనిలో గ్రేటర్ సిటీఅగ్రస్థానంలో ఉంది. ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీనగరంలోని చాలా ప్రాంతాల్లో 100 మైక్రోగ్రాములకు మించుతోందని కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి. కారణాలివే... ♦గ్రేటర్లో మొత్తం 43 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పదిహేనేళ్లకు పైబడినవి సిటీ నెం.1 ఆరు లక్షలు. వీటిలో ఆటోలు, బస్సులు, కార్లు, జీపులు, ఇతర రవాణా వాహనాల పొగతో ధూళి కాలుష్యం(ఆర్‌ఎస్‌పీఎం) అనూహ్యంగా పెరుగుతోంది. ♦ మెట్రో పనుల నేపథ్యంలో కాంక్రీటు, సిమెంటు మిశ్రమం నుంచి వెలువడే ధూళికణాలు, పిల్లర్ల కోసం తవ్వినపుడు వెలువడే దుమ్ము రేణువులు గాలిలో కలుస్తున్నాయి. ♦నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం, తరచూ రహదారుల మరమ్మతులు, విద్యుత్, టెలిఫోన్, మంచినీరు, మురుగునీటి పైపులైన్ల కోసం తవ్వకాలతో కాలుష్యం పెరుగుతోంది. ♦జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో ఒకరు పనులు పూర్తి చేసిన తరవాత మరో శాఖ పనులు చేపట్టి రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీంతో తరచూ ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ♦పనులు ముగిసిన తరువాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు వదిలేయడంతో ఆర్‌ఎస్‌పీఎం శాతం పెరుగుతోందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ♦వాహనాల వేగానికి రహదారులపై లేచే దుమ్ము, ధూళి, ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగతోనూ ధూళి కాలుష్యం పెరుగుతోందని పీసీబీ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోనే కాలుష్యం అధికం ♦పంజగుట్ట, జేఎన్టీయూ, జీడిమెట్ల, జూపార్కు, ప్యారడైజ్, చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో అధికంగా ధూళి కాలుష్యం (ఆర్‌ఎస్‌పీఎం-రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులార్ మ్యాటర్) ప్రమాణాలు నమోదయ్యాయి. ♦కొన్నిచోట్ల నెలకు సగటున క్యూబిక్ మీటర్‌కు 150 మైక్రోగ్రాముల ఆర్‌ఎస్‌పీఎం చేరుతోంది. ♦కొన్ని సందర్భాల్లో ఘనపు మీటరు గాలిలో 250- 300 మైక్రోగ్రాములకు ఆర్‌ఎస్‌పీఎం చేరుకుంటోంది. అనర్థాలివీ... ♦ధూళి కాలుష్యం భారీగా పెరుగుతుండడంతో నగరంలో శ్వాస కోస సంబంధ వ్యాధులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ♦ఆస్తమా, బ్రాంకైటీస్, హై బీపీ, ఊపిరితిత్తుల వృద్ధి రేటు తగ్గిపోవడం వంటివ్యాధులతో జనం సతమతమవుతున్నారు. ♦నగరంలోని వివిధ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో 90 శాతానికి పైగా ధూళి కాలుష్యం బారిన పడుతున్న వారేనని వైద్యులు చెబుతున్నారు. -
ఐఎస్ఎల్లో గోవాకు అగ్రస్థానం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్ లీగ్ దశను ఎఫ్‌సీ గోవా జట్టు 25 పాయింట్లతో అగ్రస్థానంతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గోవా 3-2తో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీని ఓడించింది. గోవా తరఫున ఫెర్నాండెజ్ (68, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా జోఫ్రే (90) గెలుపు గోల్ అందించాడు. అటు ఢిల్లీ తరఫున గ్రీనే (31), నబీ (40) గోల్స్ చేశారు. ఈనెల 11 నుంచి సెమీఫైనల్స్ జరుగుతాయి. -
ఐటీలో ఏపీని అగ్రగామిగా చేస్తాం
-
కోటి కావాలంటున్న రకుల్
-
అవయవ దానంలో అగ్రస్థానం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అవయవదానం చేయడం ద్వారా పునర్జన్మను ప్రసాదించిన దయార్ద్ర హృదయులు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. గత ఆరేళ్లలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన 620 మంది తమ అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి ప్రాణం పోసిన ఘనతను చాటుకున్నారు. 2008లో తిరుక్రున్రంకు చెందిన హితేంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్ స్థితికి వెళ్లా డు. అతని అవయవాలను దానం చేసేం దుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. హితేంద్రన్ గుండె 9 ఏళ్ల చిన్నారికి అమర్చారు. ఈ సంఘటన తమిళనాడులో అవయవదానంపై చైతన్యాన్ని రగిల్చింది. ఈ సంఘటన తరువాతనే ఆవయవదాన పథకం అదే ఏడాది అక్టోబరులో అవిర్భవించింది. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదానికి గురైనా వారి కళ్లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు వంటివి దానం చేయడంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో అవయవదానాలు చేసేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అవయవదానంలో దేశంలోనే తమిళనాడు ప్రథమస్థానంలో నిలిచినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 2008 అక్టోబరు నుంచి గత ఏడాది మార్చి 31వ తేదీ వరకు అంటే ఈ 78 నెలల్లో 620 మంది అవయవదానం చేసి రికార్డు సృష్టించారు. వారి నుంచి 125 మంది గుండె, 60 మంది ఊపిరితిత్తులు, 573 మంది కాలేయం,1113 మంది మూత్రపిండాలు, నలుగురు ప్యాంక్రియాస్, ఇద్దరు చిన్నప్రేవులు, 590 మంది హృదయకవాటాలు, 938 మంది నేత్రాలు, ఒక రక్తకుళాయి, 13 మంది చర్మాన్ని మొత్తం 3,464 మందికి అమర్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించారు. -
స్ట్రీట్ ఫైటర్‌గా..
తెరపై అందాలు ఒలకబోయడమేకాదు అవసరమొస్తే అడ్డు వచ్చిన వారిని కుళ్ల పొడవటానికైనా సిద్ధమేనంటోంది నటి లక్ష్మీ మీనన్. ఈ తరం హీరోయిన్లలో టాప్ పొజిషన్లో దూసుకుపోతున్న అమ్మడు ఈమేనని చెప్పక తప్పదు. అపజయం ఎరుగని హీరోయిన్గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ తాజాగా సిద్దార్ధ్‌తో నటించిన జిగర్ తండా చిత్రం కూడా హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. యువ హీరోలతో జమాయిస్తున్న ఈ కేరళ కుట్టి తాజాగా నటుడు శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. విజయపరంపర కొనసాగిస్తున్న నటుల్లో శివకార్తికేయన్ ఒకరు. ఈయనతో లక్ష్మీమీనన్ జత కట్టనున్న చిత్రానికి రజని మురుగన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. శివకార్తికేయన్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభంకానుంది. ఇందులో లక్ష్మీమీనన్ది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని, ఆమె ఈ చిత్రంలో స్ట్రీట్ ఫైట్ కూడా చెయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ, శివకార్తికేయన్‌తో జత కట్టనున్న విషయం నిజమేనని స్పష్టం చేసింది. ఈ చిత్రంలో తన పాత్ర తన గత చిత్రాల పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. చిత్ర కథ దక్షిణ తమిళనాడు నేపథ్యంలో సాగుతోందని తెలిపింది. అక్టోబర్‌లో తానీ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు వెల్లడించింది. వరుత్తపడాదవాలిబర్ సంఘం ఫేమ్ పొన్రామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత, లింగుసామి సంస్థ తిరుపతి బ్రదర్స్ నిర్మించనుంది.