
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
అహ్మదాబాద్: గుజరాత్‌లో అవినీతిలో రెవెన్యూ విభాగం తొలిస్థానంలో, పోలీస్ డిపార్ట్‌మెంట్ రెండో స్థానంలో ఉన్నాయని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంగీకరించారు. ప్రభుత్వ సంస్థల్లో అవినీతి జాఢ్యాన్ని అరికట్టడం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. అహ్మదాబాద్‌లో బుధవారం వేయి మంది భూ యజమానులకు ఆన్‌లైన్ ధ్రువీకరణ పత్రాలు ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో భయం వల్లో, నైతిక కారణాలతోనో ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు పుచ్చుకునేందుకు సందేహించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల ఎలాంటి సంకోచం లేకుండా వారు లంచాలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment