‘టెక్నాలజీ వినియోగంలో అగ్రస్థానంలో తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించుకోవడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో ప్రణాళిక శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగమే మన ఊరు–మన ప్రణాళికన్నారు. ప్రతి గ్రామాన్ని జియో ట్యాగింగ్ చేస్తామని, దీంతో మెరుగైన ఫలితాలు వస్తా యన్నారు.
వాతావరణ పరిస్థితులను వివరించడం లో ఆయా శాఖలు విఫలమవుతున్నాయని, రాష్ట్ర డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ద్వారా రైతులకు ఖచ్చితమైన సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవా లన్నారు. బీమా పథకాలపై రైతులు విశ్వాసం కోల్పోతున్నారని, ఈ భావన పోగొట్టి ప్రతి రైతుకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంటకోత ప్రయోగాలు జరిగేలా చూడాలని, క్షేత్రస్థాయిలో స్థితిగతులు మార్చడంలో ప్రణాళిక శాఖ ప్రాధాన్యత ఎంతో ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్ తదితరులు పాల్గొన్నారు.