రాష్ట్ర బంద్ నేపథ్యంలో శనివారం ఉదయం ఇటుకలపల్లి పోలీసులు విద్యార్థి నా యకులను ముందస్తుగా అదుపులోకి తీసుకొన్నారు.
ఎస్కేయూ : రాష్ట్ర బంద్ నేపథ్యంలో శనివారం ఉదయం ఇటుకలపల్లి పోలీసులు విద్యార్థి నా యకులను ముందస్తుగా అదుపులోకి తీసుకొన్నారు. బంద్ నిర్వహించకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొన్నారు. ఈ నేపథ్యం లో విద్యార్థులు వ్యూహాత్మకంగా ఆందోళనలు నిర్వహించారు. వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో వేరువేరుగా విడిపోయి నిరసనలు చేపట్టారు. ఎట్టకేలకు పరిపాలన స్తంభించేలా బంద్ నిర్వహించడంలో విద్యార్థి నాయకులు సఫలీకృతులయ్యా రు. రాప్తాడులో జెడ్పీపో్లర్ లీడర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెన్నపూస రవీంద్రరెడ్డిని, ఎస్కేయూ జేఏసీ నాయకుడు డాక్టర్ సదాశివారెడ్డి, విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి ఇటుకలపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
రోడ్డెక్కిన రెండు నిమిషాల్లోనే.. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు గెలివి నారాయణ రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నా చేయడానికి వచ్చారు. రెండు నిమిషాల్లోనే పోలీసులు వచ్చి బలవంతంగా జీపుల్లోకి ఎక్కించారు. అనంతరం వారు పోలీసు స్టేషన్ ఆవరణంలో ఆందోళనలు నిర్వహించా రు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నరసింహా రెడ్డి, క్రాంతికిరణ్, శ్రీనివాస రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ పులిరాజు, ఏఐఎస్‌ఎఫ్ విశ్వవిద్యాలయాల కన్వీనర్ రామాంజినేయులు, వెంకటేశులు , బీసీ విద్యార్థి సంఘం జయపాల్ యాదవ్, మల్లిఖార్జున, లక్ష్మీనారాయణ , ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్ర శేఖర్, ముస్తఫాను అరెస్ట్ చేశారు.