ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్కేయూలో బంద్ నిర్వహించారు.
ఎస్కేయూ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్కేయూలో బంద్ నిర్వహించారు. వర్సిటీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు డాక్టర్ సదాశివారెడ్డి, వైఎస్సార్ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, నాయకులు క్రాంతికిరణ్, వై. భానుప్రకాష్‌రెడ్డి, జ్ఞానానందరెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పులిరాజు, అంకే శ్రీనివాసులు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్‌యాదవ్, కే.మల్లిఖార్జున, లక్ష్మీనారాయణ , ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రామాంజినేయులు, వెంకటేశులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.