bundh
-
అయ్యన్న వ్యాఖ్యలతో స్తంభించిన మన్యం
సాక్షి, పాడేరు/బుట్టాయగూడెం: గిరిజనుల ప్రధాన చట్టం 1/70ని సవరించి టూరిజం అభివృద్ధి చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో తలపెట్టిన 48 గంటల రాష్ట్ర మన్యం బంద్ తొలిరోజు విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీతో పాటు అఖిలపక్షాల నేతలు ఈ బంద్‌లో పాల్గొన్నారు. పాడేరు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా బంద్ జరిగింది. పాడేరు, అరకు, రంపచోడవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి తదితర ప్రాంతాల్లో గిరిజనులంతా ఏకమై సంపూర్ణ బంద్ చేశారు. మన్యం మొత్తం స్తంభించడంతో సీఎం చంద్రబాబు దిగి వచ్చారు. 1/70 చట్టాన్ని సవరించబోమని స్వయంగా ‘ఎక్స్’లో ప్రకటించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అఖిలపక్ష నాయకులతో మంగళవారం సమావేశమై గిరిజన చట్టాలు, హక్కులను పరిరక్షిస్తామని సీఎం ప్రకటించారని, 1/70 చట్టం రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. దీంతో మంగళవారం సాయంత్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. బంద్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించారు.గిరిజన చట్టాల జోలికి వస్తే ఖబడ్దార్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకూటమి ప్రభుత్వ పెద్దలు గిరిజన హక్కులు, చట్టాల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు హెచ్చరించారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ బాధ్యత పాలకులపై ఉందన్నారు. 1/70 చట్టాన్ని సవరించి గిరిజనుల సంపదను దోచుకునేలా స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలిరోజు బంద్ విజయవంతం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చిందని, ప్రభుత్వం గిరిజనులకు నష్టం చేసే ఏ కార్యక్రమం తలపెట్టినా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎమ్మెల్యే› విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు.అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే బాలరాజుగిరిజన చట్టాలను సవరించాలంటూ వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు గిరిజనులకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ 1/70 చట్టం సవరణ చేయాలని చూస్తే సహించేది లేదన్నారు.స్పీకర్ అయ్యన్నపై జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదురాజవొమ్మంగి: గిరిజనుల చట్టం 1/70పై వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకా యల అయ్యన్నపాత్రుడుపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయ కులు జడ్డంగి పోలీస్ స్టేషన్లో మంగళవా రం ఫిర్యాదు చేశారు. టూరిజంతో పాటు ఇతరత్రా మన్యం అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలన్న అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం నాయకులు తెడ్ల రాంబాబు, సత్యన్నారాయణ, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, సవిరెల చంద్రుడు, పలువురు మహిళా నాయకులు చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉన్న అయ్యన్న ఇలా మాట్లాడటం చట్ట వ్యతిరేకమని అన్నారు.వేకువజాము నుంచే బంద్మంగళవారం వేకువజాము పాడేరులో వైఎస్సార్ïÜపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సీపీఎం, సీపీఐతో పాటు గిరిజన, ప్రజా సంఘాలన్నీ మంగళవారం బంద్ చేపట్టాయి. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, సీపీఎం రాష్ట్ర నేతలు పి.అప్పలనరస, కిల్లో సురేంద్రతో పాటు నేతలంతా గిరిజనులకు అయ్యన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.పెదబయలులో మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో నేతలంతా రోడ్లపై బైఠాయించారు. అరకు లోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు ఘాట్‌లో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జీసీసీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ స్వాతిరాణి, వైఎస్సార్సీపీ నేతలంతా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలు, పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగానే మూసివేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వారపు సంతలు రద్దయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షను వాయిదా వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగానే పనిచేశాయి. బ్యాంకులు తెరచుకోలేదు. అకిలపక్ష నేతలు రోడ్లపైనే భోజనాలు చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసివే యించారు. స్థానిక బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాల నాయకులు బైఠాయించారు. -
సికింద్రాబాద్ లో కొనసాగుతున్న బంద్
-
బెంగాల్ బంద్ - దీదీ సీరియస్.. రేపిస్టులందరికి ఉరిశిక్ష
-
బంద్ పేరుతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
-
చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న బంద్
-
సినిమా VS సినిమా
-
రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్ లు బంద్
-
ఇండస్ట్రీకి శాపంగా మారిన ఓటీటీ
-
ఏపీలో టీడీపీ చేపట్టిన బంద్ అట్టర్ ప్లాప్
-
బయటికి వస్తే అరెస్ట్ చేస్తాం
-
టీడీపీ బంద్ కు సహకరించని ప్రజలు
-
జోన్ల లొల్లి.. వికారాబాద్ బంద్
సాక్షి, వికారాబాద్ : తమ జిల్లాను జోగులాంబ జోన్లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బంద్ చేపట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి బస్ డిపో ముందు బైఠాయించడంతో బస్సులు డిపొకే పరిమితమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు జిల్లా బంద్‌లో పాల్గొన్నాయి. కాగా, జోన్ల విషయంలో సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, దీనిపై కాంగ్రెస్ తరపున కేంద్రానికి లేఖ రాస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వికారాబాద్ జిల్లాను పక్కనే ఉన్నచార్మినార్ జోన్లో కాకుండా ఎక్కడో సుదూరంలో ఉన్న జోగులాంబలో కలపడంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఎక్కడో దూరంలో ఉన్న జహీరాబాద్ ప్రాంతాన్నే చార్మినార్ జోన్లో కలపగా, పక్కనే ఉన్న వికారాబాద్‌ను మాత్రం జోగులాంబ జోన్ల కలపడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇక్కడి వారు అక్కడికెళ్లి ఉద్యోగాలు చేయడమంటే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలైన యాదయ్య, సంజీవరావు తదితర నేతలు సైతం సీఎం కేసీఆర్‌ను ఒప్పించే విషయంలో విఫలమయ్యారని జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయం టీఆర్ఎస్కు జిల్లాలో సెల్ఫ్‌గోల్‌గా మారింది. -
బంద్‌లతో ఏం సాధిస్తారు?: బాబు
సాక్షి, అమరావతి, మంగళగిరి టౌన్: ప్రత్యేక హోదా కోసం బంద్‌లు చేసి ఏం సాధిస్తారని సీఎం చంద్రబాబునాయుడు విపక్షాలను ప్రశ్నించారు. ఆందోళనలు చేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. ప్రత్యేక హోదా సాంకేతిక అంశం కాదని, రాజకీయ అంశమని చెప్పారు. హోదా విషయంలో కేంద్రం వక్రీకరించి మాట్లాడిందని ఆరోపించారు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. తాను తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వ వాహనాలను రాష్ట్రంలో తిరగనివ్వబోనని చంద్రబాబు హెచ్చరించారు. బీజేపీకి ఏపీలో అడ్రస్ లేకుండా చేస్తానన్నారు. నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ (ఎన్ఇఆర్ఎస్) కింద రూ.18 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం ఆవరణలో అధునాతనంగా నిర్మించిన పోలీస్ టెక్ భవనాన్ని చంద్రబాబు గురువారం ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాను ఒక్క పిలుపు ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ఏ ఒక్కటీ రాష్ట్రంలో తిరగవని, అది తనకు ఒక్క నిమిషం పని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ దానివల్ల జాతి ఎంతో నష్టపోతుందని, రాష్ట్రం డైవర్ట్ అయిపోతుందన్నారు. టీడీపీ ఎంపీలతో ప్రతిపాదించి మోదీని ప్రధానిగా నిలబెట్టింది తానేనని చెప్పారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలనూ ఏకం చేసి మోదీని ప్రధానిని చేశామని చెప్పారు. ఏ రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇచ్చారో చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని అడిగితే తనపై ఎదురుదాడి చేస్తూ తిడుతున్నారని, అసమర్థ నాయకుడినని అంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. భయపడటం తన చరిత్రలోనే లేదన్నారు. నరేంద్ర మోదీపై రాజీలేని పోరాటం చేస్తామని, ఆయనపై దేశం మొత్తం తిరుగుబాటు చేసే పరిస్థితిని తెచ్చామన్నారు. కాగా, చంద్రబాబు గురువారం రాత్రి సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లిన ఆయన అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. 14న సింగపూర్ నుంచి విశాఖపట్నం రానున్నారు. -
రాముని విగ్రహం ధ్వంసం.. నిర్మల్ బంద్
సాక్షి, నిర్మల్: శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాముని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాముని విగ్రహాన్ని పగలగొట్టడాన్ని నిరసిస్తూ హిందూవాహిని నాయకులు, కార్యకర్తలు నిర్మల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో నిర్మల్, ఖానాపూర్, భైంసాలో బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వినోదానికి తెర
పాత గుంటూరు: సామాన్యుడికి వినోదం పంచే సినిమాకు తెర పడింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు థియేటర్ యజమానులు, పంపిణీదారులు, నిర్మాతలు ఉద్యమబాట పట్టి బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా హాళ్లు మూతబడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాదిమంది ఉపాధి దెబ్బతింది. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు వసూలు చేసే ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు థియేటర్ యాజమాన్యాలు బంద్‌ను పాటిస్తున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి జిల్లాలోని 200 థియేటర్లు మూతబడ్డాయి. ఈనెల 9 వరకు బంద్ కొనసాగనుందని తెలిసింది. బంద్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో సినిమాలను మనందరికీ తెలిసిన రీల్ ఫార్మెట్లో ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శించేవారు. 12 ఏళ్ల కిందట డిజిటల్ సినిమా రంగప్రవేశం చేసింది. ల్యాబ్ నుంచి ప్రింట్ తెచ్చుకునే అవసరం లేకుండా హార్డ్ డిస్క్‌ను తెచ్చుకుని డిజిటల్ ప్రొజెక్టర్‌లో పెట్టి సినిమా వేసుకునే పరిజ్ఞానం వచ్చింది. ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన వారిని డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు(డీఎస్పీ)లుగా వ్యవహరిస్తున్నారు. వీరు దేశమంతటా తమ టెక్నాలజీని దశల వారీగా అమర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా రీల్ ఫార్మెట్ లేదు. డిజిటల్ టెక్నాలజీ వచ్చిందని థియేటర్ యజమానులు ప్రొజెక్టర్లను తీసి పక్కన పడేశారు. ఇదే డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లకు వరంగా మారింది. ఏకస్వామ్య విధానం అమలుచేయడానికి అవకాశం లభించింది. థియేటర్లలో అమర్చిన డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దెను క్రమంగా కంపెనీలు పెంచుకుంటూ వెళ్లిపోయాయి. ఈ ఫీజు థియేటర్ యాజమాన్యాలకు భారంగా మారింది. దేశంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు అయిన యూఎఫ్ఓ, క్యూబ్ కంపెనీలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. అంతా వారి చేతుల్లోనే ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా మౌనంగా ఉండిపోయారు. డీఎస్పీలు అద్దెలు, చార్జీలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో చోట ఒకలా వున్నాయి. ఇంగ్లిష్ సినిమాలకు ఎక్కడా వర్చువల్ ప్రింటింగ్ ఫీజు లేదు.. మనకు కూడా లేదు. ఉత్తరాదిలో హిందీ సినిమాలపై మన దగ్గర వసూలు చేస్తున్న ఫీజులో 50 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే సినిమా మన వద్ద వేస్తే వంద శాతం వీపీఎఫ్ చెల్లించాలి. ఉత్తరాదిలో అన్నీ హిందీ సినిమాలే కాబట్టి ఫీజు తక్కువగా వుంది. మన తెలుగు చిత్రాలకు పూర్తి ఫీజు చెల్లించాలి. ఈ ద్వంద్వ వైఖరిని దక్షిణాది నిర్మాతలు, పంపిణీదారులు వ్యతిరేకించారు. జేఎసీగా ఏర్పడి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె, వీపీఎఫ్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకటనల ఆదాయంపై బాదుడే ఈ డీఎస్పీలు నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వసూలు చేసే వీపీఎఫ్ కాకుండా థియేటర్ యజమానుల నుంచి రెండురకాలుగా లబ్ధి పొందుతున్నాయి. అందులో ఒకటి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె కాగా, మరొకటి ప్రకటనల ఆదాయం. సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు, ఇంటర్వెల్ తర్వాత వేసే ప్రకటనల ఆదాయం మొత్తం డీఎస్పీలే తీసుకుంటున్నాయి.అందులో నామమాత్రంగా 10 నుంచి 15 శాతం మాత్రమే యాజమాన్యాలకు ఇస్తున్నారు. ప్రకటన సైజు తెలుపకుండానే నచ్చినంత సేపు వేసుకుంటూ యాజమాన్యాలకు నష్టాలు కలిగించడంతో పాటు ప్రేక్షకులను ఇబ్బందిపెడుతున్నారు. డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దె ఇలా... నగరంలోని 4కె థియేటర్లు డిజిటల్ ప్రొజెక్టర్లకు వారానికి రూ.13,600 చెల్లిస్తున్నాయి. సాధారణ థియేటర్లు వారానికి రూ.10,300 చెల్లిస్తున్నాయి.వీటితో పాటు వీపీఎఫ్ నెలకు రూ.15 నుంచి రూ. 20 వేలకు వరకు చెల్లిస్తున్నాయి. -
మార్చి 2 నుంచి థియేటర్ల బంద్
సాక్షి, హైదరాబాద్ : మార్చి 2 నుంచి థియేటర్లు నిరవధికంగా బంద్ నిర్వహించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలితోపాటు దక్షిణాది నిర్మాతల సంఘం తీర్మానించింది. సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వచ్చే నెల 2నుంచి సినిమాలను ఆ సర్వీస్‌లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ఈకారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో వేలాది సినిమా ధియేటర్లు బంద్ కానున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 2వేల ధియేటర్లు మేర మూత పడనున్నాయి. వివాదం ఏంటి? ప్రింట్ వ్యవస్థ స్థానంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వచ్చారు. అంటే ఫిల్మ్‌ను ప్రింట్ల రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో ధియేటర్లలో ప్రదేశిండం. క్యూబ్, యుఎఫ్ఓ, పిఎక్స్‌డీ వంటి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక వ్యవస్థ ద్వారా సినిమాను థియేటర్లలో ప్రదర్శించేవారు. వాటికి నిర్మాతలు కొంత మొత్తాన్ని సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించాల్సి ఉండేది. కాల క్రమేణా ఈ సర్వీస్ చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అంత మొత్తంలో చార్జీలను నిర్మాతలు చెల్లించలేక రేట్లను తగ్గించమని కోరారు. అయితే వారి విన్నపాన్ని సర్వీస్ ప్రొవైడర్లను పట్టించుకోలేదు. దీనికారణంగా దక్షిణాది రాష్ట్రాల నిర్మాతల మండలి క్యూబ్, యూఎఫ్ఓ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే ఇరువురి మధ్య చర్చలు విఫలం కావడంతో ఆ సంస్థలకు సినిమాలను ఇవ్వరాదని నిర్మాత ఐకాస నిర్ణయం తీసుకుంది. -
నేడు కర్ణాటక బంద్
సాక్షి, బెంగళూరు: కళసా బండూరి, మహదాయి నదీ జలాల వివాదంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారాన్ని చూపాలంటూ పలు కన్నడ పోరాట సంఘాలు నేడు (గురువారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో అంతటా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. వాటాళ్ చళువళి పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజు, కన్నడ పోరాట సంఘాల సమాఖ్య ముఖ్య నేత సా.రా.గోవిందులు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడువేల కన్నడ పోరాట సంఘాలు మద్దతు తెలిపినట్లు వాటాళ్ నాగరాజు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక బంద్ ఎట్టిపరిస్థితుల్లోనూ జరిగి తీరుతుందని బీదర్ నుంచి చామరాజనగర వరకు మైసూరు నుంచి కోలారు వరకు బంద్‌ను సంపూర్ణం చేయడానికి సకల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉత్తర కర్ణాటక రైతుల సాగు, తాగునీటి అవసరాల కోసం అతిముఖ్యమైన కళసా బండూరీ, మహదాయి నదీ జలాల పంపిణీలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు కూడా మహదాయి,కళసా బండూరీపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో రాష్ట్ర రైతుల కోసం తామే ఉద్యమాల బాట పట్టినట్లు చెప్పారు. కర్ణాటక బంద్ సందర్భంగా నేడు ఉదయం పది గంటలకు బెంగళూరు టౌన్‌హాల్ నుంచి ఫ్రీడంపార్క్ వరకు కన్నడ పోరాట సంఘాల నేతలు, వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ జరుపుతామని చెప్పారు. డిగ్రీ పరీక్షల వాయిదా బంద్ సందర్భంగా విద్యార్థులు, తమ ఆస్తుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర‡వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కర్ణాటక ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి శశికుమార్ తెలిపారు. నేడు జరగాల్సిన మొదటి,మూడవ సంవత్సరం బీ.ఏ, బీఎస్సీ, బీబీఎం తదితర అన్ని పరీక్షలను బెంగళూరు యూనివర్శిటీ అధికారులు వాయిదా వేశారు. ఫిబ్రవరి 8వ తేదీన మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనుండగా, ఫిబ్రవరి 5వ తేదీన బీఎస్సీ,బీ.ఏ. మూడవ సంవత్సరం పరీక్షలు జరుపుతారు. ఆసుపత్రులు తెరిచే ఉంటాయి బంద్‌కు కేవలం నైతిక మద్దతు మాత్రమే తెలుపుతామని ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు రోజువారీలానే తెరచే ఉంటాయంటూ ఐఎంఏ నాయకుడు డా.రవీంద్రనాథ్ తెలిపారు. నైతిక మద్దతుగా నల్లటి రిబ్బన్లతో విధులకు హాజరవుతామంటూ తెలిపారు. బీఎంటీసీ, ఆర్టీసీ సేవలు యథాతథం రాష్ట్ర బంద్ సందర్భంగా బీఎంటీసీ సేవలు యథావిధిగా ఉంటాయని సంస్థ ఎండీ పొన్నురాజ్ తెలిపారు. అయితే బంద్ తీవ్రరూపం దాలిస్తే పరిస్థితిని బట్టి బస్సులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేఎస్ఆర్టీసీ సేవలకు కూడా ఢోకా ఉండదని చెప్పారు. షూటింగ్‌లు, సినిమా థియేటర్లు బంద్ గురువారం సినిమా షూటింగ్‌లను నిలిపివేయనున్నట్లు కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. అయితే పెట్రోలు బంకులు యథావిధిగా పనిచేస్తాయని ఆ యజమానుల సంఘం తెలిపింది. కన్నడ పోరాట సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు ఆటో సంఘాలు,లారీ యజమాన్య సంఘాలు మద్దతు తెలుపగా ప్రైవేటు టాక్సీలు, మెట్రోరైళ్లు మాత్రం ఎప్పటిలానే సంచరించనున్నాయి.. సంయమనం పాటించండి: సీఎం నేడు (గురువారం)రాష్ట్ర బంద్ సందర్భంగా ప్రజలు,విద్యార్థులు సంయమనం పాటించాలంటూ సీఎం సిద్ధరామయ్య కోరారు. చట్ట అతిక్రమణ చర్యలకు పాల్పడరాదని కోరారు. ఈ బంద్‌తో తమకు సంబంధం లేదని ఆయన చెప్పారు. బంద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బెంగళూరులో 15వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. -
ఈ నెల 25న వైఎస్ఆర్ జిల్లా బంద్
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 25న జిల్లా బంద్‌కు స్టీల్‌ప్లాంట్ సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సాధన సమితి తలపెట్టిన బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. వైఎస్ఆర్పీపీ శ్రేణులంతా బంద్‌లో పాల్గొనాలని పార్టీ నేతలు అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్‌బాబులు తెలిపారు. -
ఓయూ బంద్ సంపూర్ణం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించడంతోపాటు 75% పెంచిన కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాన్ని అమలు చేయాలని కోరుతూ బుధవారం అధ్యాపక సంఘాలు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా ముగిసింది. ఓయూ క్యాంపస్‌లోని కళాశాలలు, కార్యాలయాలతో పాటు నిజాం, సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, కోఠి మహిళా కళాశాలలో బంద్ పాటించినట్లు తెలంగాణ విశ్వవిద్యాలయాల టీచర్స్ అసోసియేషన్ (తూటా) అధ్యక్షుడు డాక్టర్ వేల్పుల కుమార్ తెలిపారు. వర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాన్ని 75% పెంచారని అయితే, ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. 25 నుంచి అధ్యాపకుల నిరవధిక సమ్మె ఓయూలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మెను చేయనున్నట్లు తెలిపారు. వీసీ ప్రొ.రాంచంద్రంతో అధ్యాపకుల సంఘాలు జరిపిన చర్చలు విఫలమైనట్లు వేల్పుల కుమార్ తెలిపారు. సమస్యలను పరిష్కరించే వరకు తరగతులను, పీజీ, ఇతర కోర్సుల పరీక్షలను బహిష్కరించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఓయూ నాన్‌టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె 10వ రోజుకు, పార్టుటైం అధ్యాపకుల దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. -
సనపలో మధ్యాహ్న భోజనం బంద్
ఆత్మకూరు: మండల పరిధిలోని సనప ప్రాథమిక పాఠశాలలో వారం రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వాపోతున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు వారం రోజులగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చెయ్యలేదు. దీంతో విద్యార్థులు నిత్యం ఇళ్ల దగ్గర నుంచి భోజనం తెచ్చుకోవడమో లేక ఇళ్లకు వెళ్లి తిని రావడమో చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు పలు సార్లు తెలిపినా ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గిట్టుబాటు కాలేదని వదిలేశారు : ఈ విషయంపై ఎంఈఓ నరసింహారెడ్డిని వివరణ కోరగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు గిట్టుబాటు కాకపోవడంతో వదిలేశారన్నారు. మధ్యలో రెండు రోజులపాటు ఇతరులచే భోజనాలు వడ్డించి విద్యార్థులకు అందచేశామని, ప్రస్తుతం మళ్లీ అదే సమస్య ఏర్పడిందన్నారు. సోమవారం ఈ సమస్యను పూర్తి పరిష్కారం కల్పిస్తామని ఎంపీడీఓ తెలిపారు. కాగా సనప ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఆదినారాయణను కలిసి తమ సమస్యను తెలియజేసినట్లు తెలిపారు. -
పరకాలలో ఉద్రిక్తత
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం చేపడుతున్న పరకాల బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. పరకాలను జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉదయం నుంచి ర్యాలీ సాగుతుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసు వాహనాలను అడ్డుకోవడానికి యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. ఒక సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరస్థితి నెలకొంది. -
రేపు జూనియర్ కళాశాలల బంద్
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ అడ్మిషన్లు అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వెనుకడుగు వేయటం కార్పొరేట్ కళాశాలలకు రెడ్ కార్పెట్ పరచటమే అని ఏబీవీపీ ఆరోపించింది. కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలు, విద్యార్థుల మిస్సింగ్ లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అంతేకాక, కార్పొరేట్ కళాశాలకు అమ్ముడు పోయిన ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ అశోక్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరింది. తమ డిమాండ్ల సాధనకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతానికి ఈనెల 14వ తేదీన జూనియర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చింది. -
వచ్చే నెల నుంచి కిరోసిన్ నిలిపివేత
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడి కోరుకొండ : వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కిరోసిన్‌ను సరఫరా నిలివేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలిన విజ్ఞప్తి చేశారు. కోరుకొండలోని సివిల్ సప్లయ్స్ గోడౌన్‌ను ఆయన, రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి కొల్లు రవీంద్రలు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ సరుకులను లబ్ధిదారులకు సక్రమంగా సరఫరా చేయకపోతే డీలర్లపై కఠిన చర్యలు తీసుకొంటామని, రేషన్ డీలర్లు తమ పనితీరును మార్చుకోవాలని, అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ షాపులను నిర్ణీత సమయాల్లో తెరచి ఉంచాలని, సరకుల తూకాలు సక్రమంగా ఉండాలని అన్నారు. గోడౌన్ నుంచి రేషన్ షాపులకు సరకులను తరలించే సమయంలో తరుగు వస్తే రవాణా చేసే వ్యక్తులనే బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీలపై రేషన్ షాపుల వద్ద ఒత్తిడి లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే వీవీ శివరామరాజు, జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎం ఎ.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
బంద్ ప్రశాంతం
అమలాపురం టౌన్ : పట్టణంలో రౌడీల బీభత్సానికి నిరసనగా రెండు చాంబర్ ఆఫ్ కామర్స్‌లు శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ముమ్మిడివరం గేటు, బులియ¯ŒS మార్కెట్లో బంద్ ప్రభావం బాగా కనిపించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేసి బంద్‌కు సహకరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ, గోకరకొండ హరిబాబు, కిరాణా మర్చంట్స్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు సలాది నాగేశ్వరరావు, బులియ¯ŒS అసోసియేష¯ŒS అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు యెండూరి నాగేశ్వరరావు, కోశాధికారి వరదా సూరిబాబు, యక్కల వీరభద్రకుమార్ తదితరుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. గురువారం రాత్రి విజయవాడలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్థానిక వైశ్య సంఘం నాయకులకు ఫో¯ŒS చేసి ‘రౌడీలను తక్షణమే అరెస్ట్ చేసి పోలీసులు చర్యలు తీసుకున్న దృష్ట్యా మీరు బంద్ చేయటం వల్ల ఉపయోగం ఏమిటని..? బంద్‌ను విరమించుకోవాలని సూచించారు. అయితే అప్పటికే బంద్ పిలుపు అన్ని వ్యాపార వర్గాలకు వెళ్లిపోవటంతో ఆ రాత్రి సమయంలో వైశ్య సంఘం నాయకులు మిన్నకున్నా రు. అయినప్పటికీ వ్యాపారులు శుక్రవారం ఉదయం బంద్ పాటించారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా స్థానిక వైశ్య నాయకులకు గురువారం రాత్రి ఫో¯ŒS చేసి ఈ సమస్య పరిష్కరించే ప్రయత్నం జరుగుతుండగా వారు అలా చేయటం బాధాకరమని అన్నట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. సకాలంలో రౌడీ మూకలను అరెస్ట్ చేసినందుకు పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్‌లు, పట్టణ వైశ్య సంఘం ప్రతినిధులు పోలీసులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. బంద్‌కు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు తెలిపారు. -
రేపటి పరీక్షలు వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్ : భారత్ బంద్ నేపథ్యంలో ఈ నెల 28న నిర్వహించాల్సిన పరీక్షలన్నింటినీ రద్దు చేసినట్లు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా రోజుల్లో జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. -
మన్యం బంద్ పాక్షికం
రవాణా వాహనాల లేక ప్రయాణికుల ఇక్కట్లు వైరామవరంలో దుకాణాల బంద్ రంపచోడవరం : ఆంధ్రా, ఒడిషా బోర్డర్ (ఏఓబీ) పరిధిలోని మల్కనగిరి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన పోలీసు ఎదురు కాల్పులకు నిరసనగా మావోయిస్టులు గురువారం తలపెట్టిన బంద్ జిల్లా ఏజెన్సీలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 11 ఏజెన్సీ మండలాల నుంచి సాయంత్రానికి అందిన సమాచారం ప్రకారం ఎక్కడా ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మండల కేంద్రమైన వై రామవరంలో దుకాణాల మూసివేత, ఏజెన్సీ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సర్వీసుల నిలిపివేతతో బంద్ పాక్షికంగా ముగిసింది.వై రామవరం మండలంలో ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా తిరగలేదు. నిర్మానుష్యంగా ఆంధ్రా–చత్తీస్‌గఢ్ రహదారి మావోయిస్టుల బంద్ పిలుపుతో గురువారం ఆర్టీసీ సర్వీసులు, ప్రయివేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆంధ్రా–చత్తీస్‌గఢ్‌లోని జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. దీంతో ఆంధ్రా, చత్తీస్‌గఢ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రజారవాణాకు ఆటంకం కలిగింది. రాజమండ్రి, విశాఖ, విజయవాడ, కాకినాడ ,గోకవరం , రావులపాలెం ఆర్టీసీ డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంతానికి బస్సు సర్వీసులను నిలిపివేశారు. విలీన మండలమైన ఎటపాక నుంచి డొంకరాయి వరకూ పోలీసులు ఆటోలు ఏర్పాటు చేయడంతో కొంత ఇబ్బంది పడ్డా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోగలిగారు. చత్తీస్‌గఢ్ , ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.గోకవరం –రంపచోడవరంల మధ్య మాత్రం ఆర్టీసీ బస్సు సర్వీసులు యథావిధిగా నడిచాయి. రాజవొమ్మంగి, గంగవరం, మారేడుమిల్లి, అడ్డతీగల మండల కేంద్రాలతో పాటు లోతట్టు ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. సరిహద్దులో అదనపు బలగాలు బంద్ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రంపచోడవరం –భద్రాచలం మార్గంలోని రంపచోడవరం, మారేడుమిల్లి , చింతూరు పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.అలాగే భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఎస్పీ రవిప్రకాశ్ ఏజెన్సీలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. 54 ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత రాజమహేంద్రవరం సిటీ : ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ నేపథ్యంలో గురువారం రాజమహేంద్రవరం, కాకినాడ డిపోల నుంచి ఏజెన్సీకి వెళ్లే బస్సులను రద్దు చేసినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. అలాగే గోకవరం, ఏలేశ్వరం డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంత బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేశామన్నారు. వివిధ డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మొత్తం 54 సర్వీసులను నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. బంద్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం కూడా ఈ డిపోలకు చెందిన బస్సులను అధికారులు నిలిపి వేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. -
నేడు మాంసం విక్రయాలు బంద్
మెదక్ మున్సిపాలిటీ: గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మెదక్ పట్టణంలో మాంసం, మద్యం విక్రయాలు నిషేధమని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ఎవరైన మటన్, చికెన్, చేపలు, మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రెండోరోజు ఆత్మకూర్ బంద్ విజయవంతం
– జేఏసీ నాయకుల అరెస్టు, సెల్‌టవర్ ఎక్కి నిరసన ఆత్మకూర్ : పాలమూరు జిల్లాలోనే ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట మండలాలు కొనసాగించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గంగాధర్‌గౌడ్, గాడి కృష్ణమూర్తి, రామలక్ష్మారెడ్డి, తిప్పారెడ్డి, పురం సుదర్శన్‌రెడ్డి, రవికుమార్‌యాదవ్ మాట్లాడుతూ మూడు మండలాలు పాలమూరులోనే కొనసాగితే డివిజన్, నియోజకవర్గకేంద్రంగా ఏర్పడుతుందని అన్నారు. తమను బలవంతంగా వనపర్తిలో కలిపితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. గాం«ధీచౌక్లో నిరసన తెలుపుతున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి చిన్నచింతకుంట పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. బంద్ సందర్భంగా ఆందోళనకారులు స్థానిక రేయిన్బో బేకరిపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రాకపోకలు స్థంభించిపోయాయి. దుకానాలు మూతపడడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టవర్‌ఎక్కి నిరసన.. జేఏసీ నాయకుల అరెస్టును నిరసిస్తు ఆత్మకూర్‌కు చెందిన అజ్జపాగ లక్ష్మణ్, కర్రెశ్రీను, మొగిలన్న స్థానిక ఎయిర్టెల్ టవర్‌ఎక్కి నిరసన తెలిపారు. పాలమూరులోనే తాము కొనసాగుతామని తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. తహసీల్దార్ ప్రేమ్‌రాజు, ఎస్ఐ సీహెచ్ రాజు టవర్ వద్దకు వెళ్లి కిందికి దిగాలని ఫోన్‌ద్వారా కోరారు. తమ నాయకులను విడుదల చేస్తేనే దిగుతామని తేల్చి చెప్పారు. సుమారు నాలుగుగంటల పాటు టవర్‌పైనే ఉండి నినాదాలు చేశారు. జేఏసీ నాయకుల విడుదల అనంతరం వారు కిందికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పుట్నాల రమేష్, అశ్విన్‌కుమార్, అబ్దుల్జలీల్, అశోక్‌కుమార్, రత్నం, రాములు, బంగారు శ్రీను, చెన్నయ్య, ఎస్టీడీ శ్రీనివాసులు, రహమతుల్లా, ప్రతాప్‌రెడ్డి, బంగారు భాస్కర్, లింగయ్య, వెంకటేష్, మాసన్న, గడ్డంశ్రీనివాస్యాదవ్, తుకారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బంద్ విజయవంతం
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్బంగా ప్రత్యేక హోదా చట్టంలో రూపొందించిన అమలు చేయకపోవకపోవడం...కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ప్రకటించపోవడం....చంద్రబాబు ప్యాకేజీని ఆహ్వానించడానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగానూ, విజయవంతంగానూ ముగిసింది. ప్రత్యేకంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పోలీసులు అణిచివేత చర్యలకు ఉపక్రమించినా ఏమాత్రం జంకకుండా బంద్‌ను పార్టీ శ్రేణులు విజయవంతం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాను ప్రజలకు వివరించడంతోపాటు ప్రత్యేక హోదా రాకపోతే జరిగే నష్టాన్ని కూడా ర్యాలీలలో నేతలు వివరించారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యబద్దంగా బంద్ నిర్వహిస్తున్నా.....రాజ్యాంగ విరుద్దంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని పార్టీ నేతలు తప్పుబట్టారు. ఎక్కడికక్కడ దుకాణాలు, సినిమా థియేటర్లు, ప్రై వేటు పాఠశాలలు, హోటళ్లు, కళాశాలలు మూసివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, వామపక్షాలతోపాటు టీడీపీ, బీజేపీ మినహా ఇతర అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బంద్ సందర్బంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్, వైఎస్ వివేకాల ఆధ్వర్యంలో బంద్ జిల్లాలోని పులివెందులలో తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఆర్టీసీ బస్టాండు, డిపో వద్ద కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉదయం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసినంతరం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డిల ఆధ్వర్యంలో మెయిన్ బజారు మీదుగా పూల అంగళ్ల వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కడపలో మేయర్, ఇతర నేతల అరెస్టు జిల్లా కేంద్రమైన కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద తెల్లవారుజామునే మేయర్ సురేష్‌బాబుతోపాటు మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, యువజన విభాగం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చల్లా రాజశేఖర్, పులి సునీల్‌కుమార్, నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ తదితరులు బైఠాయించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు బస్టాండు ఔట్‌గేట్ ఎదురుగా బైఠాయించి నినాదాలు చేశారు. తర్వాత పోలీసులు వచ్చి అరెస్టు చేసి బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తరలించారు. నగరంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, జిల్లా అ«ధ్యక్షుడు ఖాజా రహమతుల్లా, వైఎస్సార్సీపీ గల్ఫ్వైడ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, రాష్ట్ర కార్యదర్శి నారు మాధవరెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్‌లలో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఐటీఐ సర్కిల్లో ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులను పోలీసులు గహ నిర్బంధం చేశారు. ఆందోళన నిర్వహిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాజంపేటలో ఆకేపాటి ఆధ్వర్యంలో బంద్ రాజంపేట పట్టణంలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంద్ విజయవంతమైంది. శనివారం తెల్లవారుజాము నుంచే ఆకేపాటి రోడ్డుపైకి వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. స్వచ్చందంగా షాపులు, ఇతర దుకాణాలు మూసి వేసి మద్దతు తెలిపారు. శనివారం ఉదయం బంద్‌లో పాల్గొంటున్న అమర్‌నాథరెడ్డితోపాటు పోలా శ్రీనివాసులురెడ్డి, చొప్పా యల్లారెడ్డి, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అన్నిచోట్ల ప్రశాంతంగా బంద్ జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల, జమ్మలమడుగులలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శులు హనుమంతరెడ్డి, గౌసులాజం, జిల్లా ప్రధాన కార్యదర్శి దన్నవాడ మహేశ్వరరెడ్డిలతోపాటు కార్యకర్తలు తెల్లవారుజామున ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించారు. బస్సులు బయటికి రాకుండా అడ్డుకోవడంతో నేతలంతా బంద్‌ను పర్యవేక్షించారు. నాలుగురోడ్ల కూడలి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాయచోటిలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డిలు బంద్‌లో చేపట్టగా, రామాపురంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మైదుకూరు నాలుగురోడ్ల కూడలిలో నేతలంతా రోడ్లపై కూర్చొని ఆందోళన చేయగా, ప్రొద్దుటూరులో కూడా వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించి బంద్‌ను సక్సెస్ చేశారు. బద్వేలులో పార్టీ సమన్వయకర్త వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వామపక్షాలతో కలిసి బంద్‌లో పాల్గొన్నాయి. పోరుమామిళ్లలో వైఎస్సార్ సీపీ నేతలు చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి, నాగార్జునరెడ్డిల ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. కమలాపురంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, నాయకులు సీఎస్ నారాయణరెడ్డి, చెన్నకేశవరెడ్డి, సుమిత్ర రాజశేఖర్‌రెడ్డి, వీర ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. రైల్వేకోడూరులో జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్రెడ్డితోపాటు మరికొందరిని గహ నిర్బంధం చేయగా, మిగతా నాయకులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన భారతి సిమెంటు ఉద్యోగులు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గుచూపుతున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ కడప–ఎర్రగుంట్ల ప్రధాన రహదారిలోని పందిళ్లపల్లె వద్ద భారతి సిమెంటు పరిశ్రమకు చెందిన ఉద్యోగులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై దిష్టిబొమ్మను తగులబెట్టారు. జిల్లా వ్యాప్తంగా 800మందికి పైగా అరెస్టు జిల్లా వ్యాప్తంగా శనివారం వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ సందర్బంగా పోలీసులు పలువురు నేతలు, నాయకులను అరెస్టు చేశారు. కొందరినీ ఏకంగా గహ నిర్బంధం కూడా చేశారు. జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో సుమారు 800 మందికి పైగా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం స్టేషన్ బెయిలుపై వారిని విడుదల చేశారు. -
బంద్ విజయవంతం
-
హోదా కోసం ఎస్కేయూ బంద్
ఎస్కేయూ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్కేయూలో బంద్ నిర్వహించారు. వర్సిటీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు డాక్టర్ సదాశివారెడ్డి, వైఎస్సార్ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, నాయకులు క్రాంతికిరణ్, వై. భానుప్రకాష్‌రెడ్డి, జ్ఞానానందరెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, అంకే శ్రీనివాసులు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్‌యాదవ్, కే.మల్లిఖార్జున, లక్ష్మీనారాయణ , ఏఐఎస్ఎఫ్ నాయకులు రామాంజినేయులు, వెంకటేశులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
2న ఆటోల బంద్
సుల్తాన్‌బజార్: ఆటో డ్రైవర్లకు నష్టపరిచే విధంగా ఉన్న రోడ్డు రవాణా, భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో సంఘాల జేఏసీ నాయకులు బి.వెంకటేశం (ఏఐటీయూసీ), మహ్మద్ అమానుల్లాఖాన్ తెలిపారు. బుధవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రవాణా రంగాన్ని ప్రైవేటీకరించి, విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సెప్టెంబర్ 2న ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు జరిగే ర్యాలీలో ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు మహ్మద్ ఫారుఖ్, వి.కిరణ్, ఎంఎ.సలీం, సత్తిరెడ్డి పాల్గొన్నారు. -
బంద్ సంపూర్ణం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి పిలుపుమేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా బంద్ జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాల్గొని ఏపీ ప్రత్యేకల హోదా ఇవ్వాల్సిందేనంటూ నినదించారు. స్కూళ్లు, పాఠశాలలు, సినిమాహాళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడడంతో జిల్లాలోని వివిధ పట్టణాలతో పాటు అనంతపురంలోని ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. బంద్‌కు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కూడా మద్దతు తెలపడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన నేతలను స్టేషన్లకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన బంద్ సంపూర్ణంగా ముగిసింది. -
హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
– బంద్‌ను జయప్రదం చేయండి – నగరంలో వామపక్ష పార్టీల విస్త్రత ప్రచారం కర్నూలు సిటీ: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీపీఐ నగర కార్యదర్శి రసూల్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం అన్నారు. హోదా విషయంలో మాట తప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ, వామపక్ష పార్టీలు మంగళవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం నగరంలో వామపక్ష పార్టీలో స్కూటర్ ర్యాలీ, ఆటోల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ ఇచ్చిన హామీలను రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం ప్రజలను మోసగించడమేనన్నారు. ఏపీలోని దుస్థితిని చూసి పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదన్నారు. విభజనతో కాంగ్రెస్‌కు పట్టిన గతే తెలుగుదేశం, బిజేపీలకు పడుతుందన్నారు. హోదా సంజీవని కాదన్న సీఎం చంద్రబాబు నాయుడు అసమర్థ నాయకత్వం వల్లే కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ నేపథ్యంలో చేపడుతున్న నగర బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ బంద్‌కు సహకరించండి కర్నూలు(రాజ్‌విహార్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం చేపట్టనున్న బంద్‌కు మద్దతివ్వాలని వైఎస్ఆర్ ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి.కుమార్ కోరారు. సోమవారం ఆయనతో పాటు నాయకులు నాగన్న, ప్రభుదాస్ తదితరులు రీజినల్ మేనేజర్, డీసీటీఎం, కర్నూలు 1, 2 డిపో మేనేజర్ల కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందజేశారు. -
వైఎస్సార్సీపీ బంద్‌కు సహకరించండి
ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరురూరల్ : ఈనెల 2వ తేదీన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు నిర్వహించే బంద్‌కు అందరూ సహకరించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. రాష్ట్ర విభజనను చాలా దారుణంగా చేశారని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. టీడీపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తేకపోవడంతో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ హోదా సాధించేందుకు ప్రజలతో కలిసిపోరాడుతోందన్నారు. బంద్‌కు విద్యార్థి సంఘాలు, వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ సిబ్బంది తదితరులందరూ సంపూర్ణంగా సహకరించి నిరసన గళాన్ని వినిపించాలని ఆయన కోరారు. -
ఏబీవీపీ బంద్ ఉద్రిక్తం
– ప్రియదర్శిని కళాశాలలో కరస్పాండెంట్, ఏబీవీపీ నాయకుల ఘర్షణ –హుజూర్‌నగర్‌లో ఘటన హుజూర్నగర్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ పట్టణంలో ఉద్రిక్తంగా మారింది. ఏబీవీపీ నాయకులు కళాశాలలను బంద్ చేయించే క్రమంలో స్థానిక ప్రియదర్శినీ జూనియర్ కళాశాలలో కరస్పాండెంట్ పశ్య శ్రీనివాసరెడ్డి, ఏబీవీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.కళాశాలను బంద్ చేయాలని ఏబీవీపీ నాయకులు కరస్పాండెంట్‌ను కోరగా అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన ఏబీవీపీ నాయకులు కళాశాలలోకి ప్రవేశించి బంద్‌కు సహకరించాలని విద్యార్థులను కోరారు. దీంతో విద్యార్థులు బయటకు వస్తున్న విషయం తెలుసుకున్న కరస్పాండెంట్ అక్కడకు వచ్చి విద్యార్థులను తరగతి గదుల్లోకి వెళ్లాలని ఆదేశించారు. అంతేగాక ఏబీవీపీ నాయకులను కళాశాల నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అధ్యాపకులు ఘర్షణను నివారించగా ఏబీవీపీ నాయకులు కళాశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కోకన్వీనర్ అనంతు కరుణాకర్ మాట్లాడుతూ విద్యా సంస్థల బంద్‌కు సహకరించాలని తాము కోరగా కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి మాపై కర్రలతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కరస్పాండెంట్ వివరణ కళాశాలలు బంద్ చేయాలంటూ పదే పదే రావద్దని, ఈ ఒక్కసారి మాత్రమే బంద్ చేస్తామని అందుకు అంగీకరిస్తూ హామీ పత్రం రాసిస్తే వారికి సహకరిస్తానని చెప్పాను. అందుకు వారు నిరాకరిస్తూ కళాశాలలోకి వెళ్లి విద్యార్థులను బయటకు పంపించారు. దీంతో పాటు తాగునీటి కుండను పగులకొట్టడంతోనే వారిని కళాశాల నుంచి బయటకు పంపాన్నారు. ఏబీవీపీ నాయకులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
పశ్చిమగోదావరిలో బంద్ పాక్షికం
ఏలూరు: దళిత సంఘాల జేఏసీ పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. దళిత సంఘాల జేఏసీ నాయకులు ఏలూరు బస్టాండ్‌లో బస్సులను అడ్డుకున్నారు. అయితే, దుకాణాలు యథావిధిగానే తెరచుకుంటున్నాయి. బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. తణుకు పట్టణం సహా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
ఏయూలో కొనసాగుతున్న బంద్
ఏయూ క్యాంపస్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా ఆంధ్రా యూనివర్సిటీ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్ నిర్వహిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ, మహిళా చేతన, సీఐటీయూ సహా వివిధ సంఘాలు, ప్రొఫెసర్లు, స్కాలర్లు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి ఆందోళన చేపట్టారు. వర్సిటీలో మతోన్మాద శక్తులను తరిమికొట్టాలంటూ బీజేపీ, ఏబీవీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
రాజమండ్రిలో నగల దుకాణాల బంద్
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం స్వర్ణ వర్తకులు బంద్ పాటించారు. వినోద్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి కిందికి దూకేశాడు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీనిపై స్వర్ణ వర్తకులు కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అక్కడ మానవహారంగా ఏర్పడి పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల వేధింపుల వల్లే కదం వినోద్ చనిపోయాడంటూ బంద్ పాటించారు. -
నేడు సుల్తాన్‌బజార్ బంద్
సాక్షి, హైదరాబాద్ : సుల్తాన్‌బజార్ మధ్య నుంచి మెట్రో పనులు కొనసాగిస్తామని ఎల్అండ్టీ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ వీబీగాడ్గిల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బంద్ పాటించాలని స్థానిక ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ అధ్యక్షులు సురేంద్రమాల్ లూనియా, ప్రధాన కార్యదర్శి సి.మధుసూదన్‌లు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రోను రానివ్వనుని ఇచ్చిన హామీ మేరకు మెట్రో రైలు కారిడార్-2ను రద్దు చేయాలని వారు కోరారు. మెట్రో వస్తే తన మెడకాయ నుంచి పోతుందని గతంలో సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. గత కొన్నేళ్లుగా మెట్రోకు వ్యతిరేకంగా వ్యాపారులు ఉద్యమాలు చేస్తున్నారని, దీనిని గుర్తించి ప్రభుత్వం వెంటనే సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో వచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు హరీష్ జ్ఞాని, ఖలీల్ అహ్మద్, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. -
సుల్తాన్‌బజార్‌లో వ్యాపారుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని కోఠి, సుల్తాన్ బజార్ ప్రాంతాలలో వ్యాపారులు ఆందోళన చేపట్టారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను నిరసిస్తూ వ్యాపారులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. నేడు సుల్తాన్ బజార్ బంద్ కు వ్యాపారులు పిలుపునిచ్చారు. మెట్రో ప్రాజెక్టు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు. -
పాలమూరు బంద్
మహబూబ్‌నగర్: జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై దాడిని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే.. పార్టీ కార్యకర్తలు బస్సుల రాక పోకలను అడ్డుకుంటున్నారు. దీంతో పలు బస్‌డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. జిల్లాలోని గద్వాల, అచ్చంపేట, షాద్‌నగర్, వనపర్తి, మహబూబ్‌నగర్ డిపోల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో జిల్లాలోని 9 డిపోలకు చెందిన 894 బస్సులు రోడ్డెక్కలేదు. -
మాలి కులస్తుల ఆందోళన
ఆదిలాబాద్: తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మాలి కులస్తులు ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు పిలుపిచ్చారు. ప్రస్తుతం మాలి కులస్తులు బీసీ జాబితాలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 10 వేల మందితో జిల్లాలో ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో ఈ రోజు బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రధాన కూడళ్ల వద్ద జిల్లా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. -
బంక్‌ల బంద్ : లీటర్ పెట్రోల్ రూ.120
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలో సోమవారం పెట్రోల్ బంకుల మూసివేతతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్‌పై పన్నులు తగ్గించాలంటూ పెట్రోల్ బంకుల డీలర్లు ఒకరోజు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలోని బంక్‌లు మూతపడ్డాయి. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారస్తులు లీటర్ పెట్రోల్‌ను రెండింతలు చేసి రూ.120 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. -
కడపలో సీపీఎం నేతల అరెస్ట్
కడప: కడపలోని నారాయణ కళాశాలలో విద్యార్థినుల మృతికి నిరసనగా వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం నగరంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. బంద్ కు మద్దతుగా కడప కోటిరెడ్డి సర్కిల్లో బైఠాయించి ఆందోళన చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేత రవీంద్రనాథరెడ్డి సహా వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ నేతలందర్నీ పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెల్లవారుజాము నుంచే ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి వారిని బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నారు. -
సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బంద్
అనంతపురం: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో శుక్రవారం సీపీఎం, సీపీఐ లు బంద్ నిర్వహించాయి. ఈ మేరకు పట్టణంలో రాకపోకలన్నీ నిలిపి పోయాయి. ఉరవకొండలో కోదండరామిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. నేడు అతడి మృతదేహాన్ని పోస్టు మార్టం పూర్తి చేశారు. కోదండ రామిరెడ్డి పేరిట ఉన్న రుణాలు మాఫీ చేసేందుకు బ్యాంకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు సిండికేట్ బ్యాంక్ మేనేజర్ శివశంకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
27న జూనియర్ కళాశాలల బంద్
ఒంగోలు : విద్యా వ్యాపారాన్ని అరికట్టాలనే డిమాండ్‌తో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన జూనియర్ కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంశీకృష్ణ తెలిపారు. అనుమతి లేని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల అనుబంధ హాస్టళ్లను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నిర్దిష్ట ఫీజుల విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు బంద్‌ను చేపడుతున్నట్లు వివరించారు. -
నేటి అర్ధరాత్రి నుంచి లారీల బంద్
హైదరాబాద్: నేటి (మంగళవారం) అర్ధరాత్రినుంచి తెలంగాణ వ్యాప్తంగా లారీలు ఎక్కడివక్కడే నలిపివేయనున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రకటించింది. పన్ను తగ్గింపు, పర్మిట్లు ఇతర డిమాండ్లపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంవల్లే అనివార్యంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు తెలిపింది. లారీల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల లారీలు నిలిచిపోనున్నాయి. ఇది సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. తెలంగాణ లారీ యజమానుల సంఘం చేపట్టిన సమ్మెకు ఇతర రాష్ట్రాల లారీ యజమానుల సంఘాలు మద్దతు పలికాయి. కాగా, కరీంనగర్ లారీ యజమానుల సంఘం మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. -
అనంతపురంలో అఖిలపక్షం బంద్
అనంతపురం అర్బన్: ప్రభుత్వం ఇసుక రవాణాపై విధించిన ఆంక్షలను ఎత్తి వేయాలని నిరసిస్తూ అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. శనివారం జరిగిన ఈ బంద్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న అఖిలపక్షం నేతలుర్యాలీగా వెళ్లిన అనంతపురం అర్బన్‌లోని పలు దుకాణాలను మూసివేశారు. ఈ బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎమ్, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, భవన నిర్మాణ సంఘం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, సీపీఐ నేత నారాయణరావు, సీపీఎమ్ నేత మల్లికార్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.