బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలో సోమవారం పెట్రోల్ బంకుల మూసివేతతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్‌పై పన్నులు తగ్గించాలంటూ పెట్రోల్ బంకుల డీలర్లు ఒకరోజు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలోని బంక్‌లు మూతపడ్డాయి. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారస్తులు లీటర్ పెట్రోల్‌ను రెండింతలు చేసి రూ.120 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు.