హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించడంతోపాటు 75% పెంచిన కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాన్ని అమలు చేయాలని కోరుతూ బుధవారం అధ్యాపక సంఘాలు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా ముగిసింది.
ఓయూ క్యాంపస్‌లోని కళాశాలలు, కార్యాలయాలతో పాటు నిజాం, సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, కోఠి మహిళా కళాశాలలో బంద్ పాటించినట్లు తెలంగాణ విశ్వవిద్యాలయాల టీచర్స్ అసోసియేషన్ (తూటా) అధ్యక్షుడు డాక్టర్ వేల్పుల కుమార్ తెలిపారు. వర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాన్ని 75% పెంచారని అయితే, ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు.
25 నుంచి అధ్యాపకుల నిరవధిక సమ్మె
ఓయూలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మెను చేయనున్నట్లు తెలిపారు. వీసీ ప్రొ.రాంచంద్రంతో అధ్యాపకుల సంఘాలు జరిపిన చర్చలు విఫలమైనట్లు వేల్పుల కుమార్ తెలిపారు. సమస్యలను పరిష్కరించే వరకు తరగతులను, పీజీ, ఇతర కోర్సుల పరీక్షలను బహిష్కరించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఓయూ నాన్‌టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె 10వ రోజుకు, పార్టుటైం అధ్యాపకుల దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment