
నేటి అర్ధరాత్రి నుంచి లారీల బంద్
నేటి (మంగళవారం) అర్ధరాత్రినుంచి తెలంగాణ వ్యాప్తంగా లారీలు ఎక్కడివక్కడే నలిపివేయనున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రకటించింది.
హైదరాబాద్: నేటి (మంగళవారం) అర్ధరాత్రినుంచి తెలంగాణ వ్యాప్తంగా లారీలు ఎక్కడివక్కడే నలిపివేయనున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రకటించింది. పన్ను తగ్గింపు, పర్మిట్లు ఇతర డిమాండ్లపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంవల్లే అనివార్యంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు తెలిపింది.
లారీల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల లారీలు నిలిచిపోనున్నాయి. ఇది సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. తెలంగాణ లారీ యజమానుల సంఘం చేపట్టిన సమ్మెకు ఇతర రాష్ట్రాల లారీ యజమానుల సంఘాలు మద్దతు పలికాయి. కాగా, కరీంనగర్ లారీ యజమానుల సంఘం మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది.