బంద్‌ ప్రశాంతం | bundh success | Sakshi
Sakshi News home page

బంద్‌ ప్రశాంతం

Published Fri, Dec 2 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

bundh success

అమలాపురం టౌన్‌ : 
పట్టణంలో రౌడీల బీభత్సానికి నిరసనగా రెండు  చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లు శుక్రవారం చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ముమ్మిడివరం గేటు, బులియ¯ŒS మార్కెట్‌లో బంద్‌ ప్రభావం బాగా కనిపించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేసి బంద్‌కు సహకరించారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ, గోకరకొండ హరిబాబు, కిరాణా మర్చంట్స్‌ అసోసియేష¯ŒS అధ్యక్షుడు సలాది నాగేశ్వరరావు, బులియ¯ŒS అసోసియేష¯ŒS అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు యెండూరి నాగేశ్వరరావు, కోశాధికారి వరదా సూరిబాబు, యక్కల వీరభద్రకుమార్‌ తదితరుల ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. గురువారం రాత్రి విజయవాడలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్థానిక వైశ్య సంఘం నాయకులకు ఫో¯ŒS చేసి ‘రౌడీలను తక్షణమే అరెస్ట్‌ చేసి పోలీసులు చర్యలు తీసుకున్న దృష్ట్యా మీరు బంద్‌ చేయటం వల్ల ఉపయోగం ఏమిటని..? బంద్‌ను విరమించుకోవాలని సూచించారు. అయితే అప్పటికే బంద్‌ పిలుపు అన్ని వ్యాపార వర్గాలకు వెళ్లిపోవటంతో ఆ రాత్రి సమయంలో వైశ్య సంఘం నాయకులు మిన్నకున్నా రు. అయినప్పటికీ వ్యాపారులు శుక్రవారం ఉదయం బంద్‌ పాటించారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా స్థానిక వైశ్య నాయకులకు గురువారం రాత్రి ఫో¯ŒS చేసి ఈ సమస్య పరిష్కరించే ప్రయత్నం జరుగుతుండగా వారు అలా చేయటం బాధాకరమని అన్నట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. సకాలంలో రౌడీ మూకలను అరెస్ట్‌ చేసినందుకు పట్టణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లు, పట్టణ వైశ్య సంఘం ప్రతినిధులు పోలీసులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. బంద్‌కు వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్‌ నాయకులు కూడా మద్దతు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement