రెండోరోజు ఆత్మకూర్ బంద్ విజయవంతం
Published Tue, Sep 20 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
– జేఏసీ నాయకుల అరెస్టు, సెల్‌టవర్ ఎక్కి నిరసన
ఆత్మకూర్ : పాలమూరు జిల్లాలోనే ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట మండలాలు కొనసాగించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గంగాధర్‌గౌడ్, గాడి కృష్ణమూర్తి, రామలక్ష్మారెడ్డి, తిప్పారెడ్డి, పురం సుదర్శన్‌రెడ్డి, రవికుమార్‌యాదవ్ మాట్లాడుతూ మూడు మండలాలు పాలమూరులోనే కొనసాగితే డివిజన్, నియోజకవర్గకేంద్రంగా ఏర్పడుతుందని అన్నారు. తమను బలవంతంగా వనపర్తిలో కలిపితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. గాం«ధీచౌక్‌లో నిరసన తెలుపుతున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి చిన్నచింతకుంట పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు. బంద్ సందర్భంగా ఆందోళనకారులు స్థానిక రేయిన్‌బో బేకరిపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రాకపోకలు స్థంభించిపోయాయి. దుకానాలు మూతపడడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
టవర్‌ఎక్కి నిరసన..
జేఏసీ నాయకుల అరెస్టును నిరసిస్తు ఆత్మకూర్‌కు చెందిన అజ్జపాగ లక్ష్మణ్, కర్రెశ్రీను, మొగిలన్న స్థానిక ఎయిర్‌టెల్ టవర్‌ఎక్కి నిరసన తెలిపారు. పాలమూరులోనే తాము కొనసాగుతామని తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. తహసీల్దార్ ప్రేమ్‌రాజు, ఎస్‌ఐ సీహెచ్ రాజు టవర్ వద్దకు వెళ్లి కిందికి దిగాలని ఫోన్‌ద్వారా కోరారు. తమ నాయకులను విడుదల చేస్తేనే దిగుతామని తేల్చి చెప్పారు. సుమారు నాలుగుగంటల పాటు టవర్‌పైనే ఉండి నినాదాలు చేశారు. జేఏసీ నాయకుల విడుదల అనంతరం వారు కిందికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పుట్నాల రమేష్, అశ్విన్‌కుమార్, అబ్దుల్‌జలీల్, అశోక్‌కుమార్, రత్నం, రాములు, బంగారు శ్రీను, చెన్నయ్య, ఎస్టీడీ శ్రీనివాసులు, రహమతుల్లా, ప్రతాప్‌రెడ్డి, బంగారు భాస్కర్, లింగయ్య, వెంకటేష్, మాసన్న, గడ్డంశ్రీనివాస్‌యాదవ్, తుకారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement