రాముని విగ్రహం ధ్వంసం.. నిర్మల్‌ బంద్‌ | The statue of Rama is destroyed. Nirmal bandh | Sakshi
Sakshi News home page

రాముని విగ్రహం ధ్వంసం.. నిర్మల్‌ బంద్‌

Published Tue, Mar 27 2018 9:47 AM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM

The statue of Rama is destroyed. Nirmal bandh

సాక్షి, నిర్మల్: శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాముని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాముని విగ్రహాన్ని పగలగొట్టడాన్ని నిరసిస్తూ హిందూవాహిని నాయకులు, కార్యకర్తలు నిర్మల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో నిర్మల్, ఖానాపూర్, భైంసాలో బంద్‌ కొనసాగుతోంది. బంద్‌ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి.  జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement