ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీపీఐ నగర కార్యదర్శి రసూల్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం అన్నారు.
– బంద్‌ను జయప్రదం చేయండి
– నగరంలో వామపక్ష పార్టీల విస్త్రత ప్రచారం
కర్నూలు సిటీ:
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీపీఐ నగర కార్యదర్శి రసూల్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం అన్నారు. హోదా విషయంలో మాట తప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్ష పార్టీలు మంగళవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం నగరంలో వామపక్ష పార్టీలో స్కూటర్ ర్యాలీ, ఆటోల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ ఇచ్చిన హామీలను రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం ప్రజలను మోసగించడమేనన్నారు. ఏపీలోని దుస్థితిని చూసి పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదన్నారు. విభజనతో కాంగ్రెస్‌కు పట్టిన గతే తెలుగుదేశం, బిజేపీలకు పడుతుందన్నారు. హోదా సంజీవని కాదన్న సీఎం చంద్రబాబు నాయుడు అసమర్థ నాయకత్వం వల్లే కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ నేపథ్యంలో చేపడుతున్న నగర బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.
వైఎస్‌ఆర్‌సీపీ బంద్‌కు సహకరించండి
కర్నూలు(రాజ్‌విహార్):
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం చేపట్టనున్న బంద్‌కు మద్దతివ్వాలని వైఎస్‌ఆర్ ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి.కుమార్ కోరారు. సోమవారం ఆయనతో పాటు నాయకులు నాగన్న, ప్రభుదాస్ తదితరులు రీజినల్ మేనేజర్, డీసీటీఎం, కర్నూలు 1, 2 డిపో మేనేజర్ల కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందజేశారు.