ఎస్కేయూ : ఎస్కేయూ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కోరాడ మహదేవశాస్త్రి (95) బుధవారం అనంతపురం నగరంలోని ద్వారకానగర్‌లో ఉన్న తన నివాసంలో మృతి చెందారు. ఈయన 1968 నుంచి 1982 వరకు ఎస్కేయూ క్యాంపస్ పీజీ కళాశాలలో తెలుగు ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. మొదటి తెలుగు విభాగాధిపతిగా, తొలి ప్రిన్సిపల్‌గా పని చేశారు.