అందరూ ఒకే సబ్జెక్టు ఫెయిలా..? | one subject fail in more members | Sakshi
Sakshi News home page

అందరూ ఒకే సబ్జెక్టు ఫెయిలా..?

Published Wed, Aug 24 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

one subject fail in more members

ఎస్కేయూ: మూడు కళాశాలల్లోని విద్యార్థులందరూ ఎమ్మెస్సీ మేథమేటిక్స్‌ గ్రాఫ్‌ థియరీ సబ్జెక్టు ఎలా ఫెయిల్‌ అవుతారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశ్నించారు. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఈ) ఎం.ఎ.ఆనంద్‌ చాంబర్‌ ఎదుట బైఠాయించారు. అన్ని సబ్జెక్టుల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై ఆ ఒక్క సబ్జెక్టులో ఎందుకు ఫెయిల్‌ అయ్యారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలు పునఃపరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నేత ఓ కొండన్న, ఎస్కేయూ నాయకులు ముస్తఫా, అశోక్, పవన్‌కుమార్, నరేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement