ఎస్కేయూలోని వసతి గృహంలో గురువారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
అనంతపురం సెంట్రల్/ఎస్కేయూ : ఎస్కేయూలోని వసతి గృహంలో గురువారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గంగ, మహానంది వసతి గృహంలోని విద్యార్థులు మెస్ హాలులో భోజనం చేశారు. అయితే తిన్న అరగంటకే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి.
మొత్తం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా హుటాహుటిన 108లో, యూనివర్సిటీ వాహనాలు, పోలీసు వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుండడంతో మరిన్ని వాహనాలను హాస్టళ్ల వద్ద సిద్ధం చేసి ఉంచారు. కాగా ఈ ఘటనపై విద్యార్థులు హాస్టల్ ఆవరణంలో ధర్నా చేపట్టారు.