ఎస్కేయూ: ఎస్కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన తుంగభద్ర హాస్టల్‌లో సోమవారం రాత్రి వడ్డించిన ఆహారం నాసిరకంగా ఉందని విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఉడకని అన్నం ఎలా తినాలని అధికారులను ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా హాస్టల్ ముందు ౖ»ñ ఠాయించి ధర్నా చేపట్టారు.
ప్రతి రోజు ఇదే తరహాలో నాసిరకంగా భోజనం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. మంగళవారం నుంచి నిరవధిక ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
నాసిరక ఆహారంపై ఆందోళన
Published Tue, Aug 16 2016 12:26 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
Advertisement
Advertisement