
నగదు రహిత లావాదేవీలపై అవగాహన ర్యాలీ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎస్కేయూ విద్యా విభాగం, కళాశాల జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డీనేటర్ రమణ, ప్రోగ్రాం ఆఫీసర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తమ ప్రాంతాల్లోని ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.
దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇంటింటి సర్వేను నిర్వహించాలన్నారు. బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డులు, రూపే కార్డుల వినియోగంపై వారికి వివరించాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ వరలక్ష్మీ, ధనుంజయ, ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు.