Awareness Rally
-
‘వాహనదారులారా.. కళ్లు తెరవండి.. విలువైన ప్రాణాలు పణంగా పెట్టకండి’
ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షలమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇక గాయపడ్డ వారి సంఖ్య అయిదు కోట్లమంది కంటే ఎక్కువే. అంటే ప్రతి మూడు నిమిషాలకొకరు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ఇక ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో భారతదేశమే ముందుంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నెత్తురోడుతున్న దేశం మనది. దేశీయ రహదారుల పొడవు 47లక్షల కిలోమీటర్లయితే 27 శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలు నేషనల్ హైవేల మీదనే జరుగుతున్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. జాగ్రత్తలు మరిచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కొందరు. వీరి వల్ల అమాయకులు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ట్రాఫిక్ పట్ల చైతన్యం పెంపొందించేందుకు కొంపల్లి శ్రీ చైతన్య K5 పాఠశాల విద్యార్థులు నడుం బిగించారు. తమ వంతు బాధ్యతగా కొంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం, హెల్మెట్ ధరించకపోవటం,సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దంతో హారన్లు మోగించుకుంటూ నడపటం, ఫుట్ పాత్‌లపైకి దూసుకురావడం.. రాంగ్ రూట్లలోకి రావడం, పరిమితికి మించి వేగంగా వాహనం నడపడం, మద్యం తాగి రోడ్డెక్కడం.. ఇలా ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు విద్యార్థులు. వాహనం జాగ్రత్తగా నడపడంతో పాటు అంబులెన్స్‌లకు దారివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య ఏజీఎం జీవీఆర్ రావు, కె5 ప్రిన్సిపళ్లు నేతాజీ, సౌజన్య, ఇతర ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు రోదసీ రంగంలో నాసా పరిశోధనలకు సంబంధించి వివిధ కిట్స్‌ను విద్యార్థులకు అందించారు. -
కదిరిలో దిశ చట్టం అవగాహనా ర్యాలీ
-
జనాభా పెరిగితే ప్రమాదమే..
వనపర్తి అర్బన్: జనాభా పెరుగుదలతో రానున్న రోజుల్లో అనర్థాలు ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని తరుణి ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2022 వరకు మన దేశం జనాభాలో మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంటుందని, 2050వరకు 150కోట్లకు చేరుకుంటుందని వివరించారు. జనాభాకు అనుగుణంగా వనరులను సృష్టించుకోలేనిమని చెప్పారు. జనాభా పెరుగుదలకు నిరక్షరాస్యతే కారణమన్నారు. మూఢనమ్మకాలను తరిమికొట్టాలి జనాభాకు అనుగుణంగా వనరులు పెరగడం లేదని ఇంచార్జ్ జేసీ చంద్రయ్య ఆందోళన వ్యక్తంచేశారు. సమాజంలో మహిళలను ఏ రంగంలో తీసిపోరని, మూఢనమ్మకాలతోనే ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నా మగపిల్లల కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. అందుకోసం గ్రామాల్లో ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు పీహెచ్సీ వైద్యులు, నర్సులకు నగదు పురస్కారాలు అందజేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఏ.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి.కృష్ణ, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఫైన్ వేసినా మారడం లేదు
సాక్షి, నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ సూచించారు. హెల్మెట్లు ధరించని వారికి ఫైన్ (జరిమానా) వేస్తున్నామని, అయినా వారిలో మార్పులు రావటం లేదన్నారు. అందుకే హెల్మెట్లు ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ వాడకంపై ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ మైదానంలో సీపీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. సీపీ స్వయం గా బైక్‌ను నడిపారు. కంఠేశ్వర్ కమాన్, ధర్నాచౌక్, రైల్వేస్టేషన్, బస్టాండ్, దేవిరోడ్డు చౌరస్తా, గాంధీచౌక్, నెహ్రూ పార్కు పెద్దబజార్, న్యాల్కల్ చౌరస్తా, పూలాంగ్‌చౌరస్తా, ఎల్లమ్మగుట్టచౌరస్తా, రైల్వేకమాన్, కంఠేశ్వర్ బైపాస్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం సీపీ మాట్లాడుతూ తల భాగం ఎంతో సున్నితమైందని, రోడ్డు ప్రమాదాలలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించక పోవటంతోనే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతి చెందుతున్నారని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్‌ను ధరించాలన్నారు. అదనపు ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ నాగేశ్వర్రావు, ట్రాఫిక్ ఎస్సైలు పాల్గొన్నారు. సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీపీ పోలీస్ కమిషనర్ కార్తికేయ గురువారం మధ్యహ్నం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎస్సైలతో మాట్లాడారు. ఆదివారం శ్రీరామ నవమి పండుగ నేపథ్యలో నిర్వహించే ర్యాలీలకు బందోబస్తు చర్యలపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రామాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏడు ప్రధాన అంశాలపై కరపత్రాల విడుదల రహదారి భద్రత, ఆత్మహత్యల నివారణ వంటి ఏడు ప్రధాన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పోలీస్‌శాఖ ఏడు కరపత్రాలను విడుదల చేసింది. సీపీ కార్తికేయ గురువారం కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కళాబృందాలకు ఆయా కరపత్రాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో కళాబృందాలు పర్యటిస్తాయన్నారు. ప్రజలలో చైత్యనం వచ్చినప్పుడే ఆ ప్రాంతంలో నేరాలు తగ్గుతాయని, అందుకోసం పోలీస్‌శాఖ తరపున ఏడు అంశాలపై కరపత్రాలు రూపొందించిందని చెప్పారు. ఎస్బీ సీఐ–2 రాజశేఖర్, పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సాయాగౌడ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఏఎస్సై కుటుంబానికి ఆర్థిక సాయం గుండె నొప్పితో మృతి చెందిన ఏఎస్సై కుటుంబానికి సీపీ కార్తికేయ గురువారం ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. మాక్లూర్ పోలీస్‌స్టేష¯న్కు చెందిన ఏఎస్సై పోచయ్య జనవరి 11న గుండె నొప్పితో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబానికి పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మొత్తం ఒకరోజు వేతనాన్ని డెత్ ఫండ్ (ఆర్థిక సాయం) రూపంలో రూ.1,29,300 చెక్కును సీపీ పోచయ్య భార్య రుక్మాబాయికు అందజేశారు. ఎస్బీ సీఐ వెంకన్న, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి ఎస్ఎస్ జై కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వినియోగిస్తే చర్యలు తప్పవు
► మున్సిపల్ అధికారులు హెచ్చరిక ► జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్మల్‌రూరల్ : నిషేధిత ప్లాస్టిక్, పాలిథిన్ సంచులను వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ డీఈ సంతోష్ హె చ్చరించారు. జిల్లాకేంద్రంలో బుధవారం ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం–ప్రకృతిని కాపాడుదాం అంటూ మున్సిపల్ సిబ్బంది బ్యాండ్ చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీగా సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి, మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న నిషేధిత ప్లాస్టిక్, పాలిథిన్ సంచులు, వస్తువులను వాడొద్దన్నారు. ఆంక్షలను పట్టించుకోకుండా 40 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న పాలిథిన్ కవర్లను వినియోగించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ సంచులను కాకుండా జనపనార, గుడ్డతో చేసిన చేతిసంచులను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఆర్ఓ మోహన్, సానిటరీ ఇన్ స్పెక్టర్ మురారి, బల్దియాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలపై అవగాహన ర్యాలీ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎస్కేయూ విద్యా విభాగం, కళాశాల జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డీనేటర్ రమణ, ప్రోగ్రాం ఆఫీసర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తమ ప్రాంతాల్లోని ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇంటింటి సర్వేను నిర్వహించాలన్నారు. బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డులు, రూపే కార్డుల వినియోగంపై వారికి వివరించాలన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ వరలక్ష్మీ, ధనుంజయ, ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
రేబిస్ రహిత జిల్లాగా మారుద్దాం
–జేసీ ఇంతియాజ్ నెల్లూరు(అర్బన్): నెల్లూరును రేబీస్ వ్యాధి(పిచ్చి) రహిత జిల్లాగా మారుద్దామని జేసీ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక వీఆర్సీ నుంచి రెడ్‌క్రాస్ కార్యాలయం వరకు బుధవారం సాయంత్రం అవగాహనా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని జేసీ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహనా పెంచాలన్నారు. కుక్క కరిస్తే వెంటనే సబ్బుతో ఎక్కువ సేపు గాయాన్ని కడగాలన్నారు. కొళాయి నీరును ధారగా వదిలేసి కడగాలని కోరారు. 24 గంటల్లోపు డాక్టర్‌ను సంప్రదించి తగు వైద్యం పొందాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకష్ణారెడ్డి మాట్లాడుతూ రేబీస్ వ్యాధిపై ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఏవీ సుబ్రహ్మణ్యం, జూనియర్ రెడ్‌క్రాస్ నాయకులు ఎన్.ప్రభాకర్, పీఎంపీ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొన్నారు. -
దోమలపై దండయాత్ర
– సమష్టిగా విజయవంతం చేయాలి – అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్ : ‘డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శనివారం మెగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొంటారు. సమష్టిగా విజయవంతం చేయాలి.’ అని జేసీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య, ఆరోగ్య, మునిసిపల్, విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. దోమల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచే ందుకు ‘దోమలపై దండయాత్ర– పరిసరాల పరిశుభ్రత’పై శనివారం ఉదయం 10 గంటలకు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీలో పాల్గొనే విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకునేలా చూడాలన్నారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఈఓ అంజయ్య, ఆర్ఐఓ వెంకటేశ్వర్లు, కమిషనర్ చల్లాఓబుళేసు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి శనివారం డ్రైడే : ఇకపై ప్రతి శనివారం ప్రజలు కచ్చితంగా డ్రైడే పాటించేలా అవగాహన పెంచాలని అధికారులను జేసీ ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత పాటించేలా చూడాలన్నారు. దోమల నివారణకు డమ్ములు, తొట్లు, కూలర్లులో నీరు రెండు రోజులకోసారి తొలగించేలా, దొమ తెరలు వాడేలా అవగాహన కల్పించాలన్నారు. -
నీటిపై అవగాహన ర్యాలీ
బాసర (ఆదిలాబాద్ జిల్లా) : 'వరల్డ్ వాటర్ డే' సందర్భంగా మంగళవారం బాసర గ్రామంలో నీటిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ 'వాక్ ఫర్ వాటర్'లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు. -
హెచ్ఐవీపై అవగాహన ర్యాలీ
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం హెచ్ఐవీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పీఏసీఎస్ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్‌రాజు జెండా ఊపి ప్రారంభించారు. -
వాయు కాలుష్యంపై నేడు అవగాహన ర్యాలీ
గుర్గావ్: దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న గాలి కాలుష్యంపై అవగాహన పెంచడానికి నగరానికి చెందిన నగర్రో ఐటీ కంపెనీ, రాహగిరీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఆదివారం ‘యాంటీ ఎయిర్ పొల్యూషన్ రైడ్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్ సిటీలోని నగర్రో కార్యాలయం నుంచి ప్రారంభమై ఉద్యోగ్ విహార్ మీదుగా రాహగిరీ జోన్‌కు చేరుతుంది. ప్రస్తుత డాటా ప్రకారం గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి, ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భారతీయులంతా ఈ సమస్యపై పోరాడాల్సిన అవసరముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రవాణాకు సైకిల్‌ను ఉపయోగించడం మంచి పద్ధతని అభిప్రాయపడుతున్నారు. గుర్గావ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని హైవేలు, రోడ్డు మార్గాల్లో సైక్లింగ్ ప్రమాదకరమైనప్పటికీ దీనిని ఉపయోగించాల్సిన అవసరముందని విశ్లేషకులు అంటున్నారు. వాయు కాలుష్యం వల్ల ప్రతి ఏడాది ఇండియాలో 6 లక్షల మంది చనిపోతున్నారు. మెట్రో నగరాల్లో కాలుష్యం పెరగడానికి 70 శాతం మోటారు వాహనాలు కారణమవుతున్నాయి. తాజాగా ఢిల్లీని ప్రపంచంలోనే కాలుష్య ప్రాంతంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానించింది. దీనికి గుర్గావ్ కూడా చాలా దగ్గరగా ఉంది. మరో సర్వేలో ప్రతి రోజూ ఢిల్లీలో 20 మంది చనిపోతున్నట్లు తేలింది. దాదాపు ఆరు మిలియన్ల మంది ఆస్థమా బారిన పడినట్లు అంచనా వేసింది. వాయు కాలుష్యం విషయంలో ఢిల్లీ కంటే గుర్గావ్ కొద్దిగా మేలు. అంతేకాకుండా ఆర్థిక, సామాజిక, నివాసాల విషయంలో ఢిల్లీకి సమానంగా నగరంగా అభివృద్ధిని సాధించింది. వారాంతాల్లో సైక్లింగ్ చేయడం వల్ల దీనిపై అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నారు. -
మరుగుదొడ్లు లేకే వెనుకబాటు
ఆదిలాబాద్ కల్చరల్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేకే వెనుకబాటు కనిపిస్తోందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. బుధవారం గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ జగన్మోహన్, సీనియర్ ఐఏఎస్ మనోహర్‌ప్రసాద్ ప్రారంభించారు. పట్టణంలోని పలు వీధుల గుండా పలు పాఠశాలల విద్యార్థుల ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, మరుగుదొడ్ల నిర్మాణం లేక బహిర ంగ మల,మూత్ర విసర్జనలు చేస్తున్నారని, దీంతో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడి ఆస్పత్రులకు తిరగలేక ఉన్న డబ్బునంతా కోల్పోతున్నారని తెలిపారు. కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయని, తద్వారా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. నిర్మల్ అబియాన్ సంస్థ ద్వారా ఒక్కో ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10,900లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ ఐఏఎస్ మనోహర్‌ప్రసాద్ మాట్లాడుతూ, మరుగుదొడ్ల నిర్మాణం మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనమని అన్నారు. పాఠశాలల్లో కచ్చితంగా మరుగుదొడ్లు ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.సుధాకర్‌రావు, డీఈవో సత్యనారాయణరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సిరాజ్ద్దీన్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ జాదవ్ గణేశ్, ఎంపీడీవో జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరి బాధ్యత ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యత అధికారులదే కాకుండా అందరిదీ అని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
బాలలపై లైంగిక దాడులపై అవగాహన ర్యాలీ
-
బాలలపై లైంగిక దాడులకు నిరసనగా ర్యాలీ
హైదరాబాద్: బాలలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఈ ఉదయం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అంశంపై అందరికీ అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో యూ క్యూబ్ అనే సంస్థ ప్రారంభించారు. ఆ సంస్థ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాలలే అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. యూ క్యూబ్ ఇప్పటికే స్కూళ్లు, బస్ స్టాప్‌లు, స్లమ్స్‌లో వర్క్‌షాప్స్‌ను నిర్వహించారు. లైంగిక వేధింపులపై మాట్లాడేందుకు బాధితులు ముందుకు రావట్లేదని, వారి సమస్యలపై వారు పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. **