ఆదిలాబాద్ కల్చరల్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేకే వెనుకబాటు కనిపిస్తోందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. బుధవారం గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ జగన్మోహన్, సీనియర్ ఐఏఎస్ మనోహర్‌ప్రసాద్ ప్రారంభించారు. పట్టణంలోని పలు వీధుల గుండా పలు పాఠశాలల విద్యార్థుల ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, మరుగుదొడ్ల నిర్మాణం లేక బహిర ంగ మల,మూత్ర విసర్జనలు చేస్తున్నారని, దీంతో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడి ఆస్పత్రులకు తిరగలేక ఉన్న డబ్బునంతా కోల్పోతున్నారని తెలిపారు.
కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయని, తద్వారా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. నిర్మల్ అబియాన్ సంస్థ ద్వారా ఒక్కో ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10,900లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ ఐఏఎస్ మనోహర్‌ప్రసాద్ మాట్లాడుతూ, మరుగుదొడ్ల నిర్మాణం మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనమని అన్నారు. పాఠశాలల్లో కచ్చితంగా మరుగుదొడ్లు ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.సుధాకర్‌రావు, డీఈవో సత్యనారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సిరాజ్‌ద్దీన్, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ జాదవ్ గణేశ్, ఎంపీడీవో జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరి బాధ్యత
ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యత అధికారులదే కాకుండా అందరిదీ అని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మరుగుదొడ్లు లేకే వెనుకబాటు
Published Thu, Nov 20 2014 2:50 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement