
బాలలపై లైంగిక దాడులకు నిరసనగా ర్యాలీ
హైదరాబాద్: బాలలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఈ ఉదయం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అంశంపై అందరికీ అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో యూ క్యూబ్ అనే సంస్థ ప్రారంభించారు. ఆ సంస్థ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాలలే అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం.
యూ క్యూబ్ ఇప్పటికే స్కూళ్లు, బస్ స్టాప్లు, స్లమ్స్‌లో వర్క్‌షాప్స్‌ను నిర్వహించారు. లైంగిక వేధింపులపై మాట్లాడేందుకు బాధితులు ముందుకు రావట్లేదని, వారి సమస్యలపై వారు పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
**