రేబిస్ రహిత జిల్లాగా మారుద్దాం
-
–జేసీ ఇంతియాజ్
నెల్లూరు(అర్బన్):
నెల్లూరును రేబీస్ వ్యాధి(పిచ్చి) రహిత జిల్లాగా మారుద్దామని జేసీ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక వీఆర్సీ నుంచి రెడ్‌క్రాస్ కార్యాలయం వరకు బుధవారం సాయంత్రం అవగాహనా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని జేసీ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహనా పెంచాలన్నారు. కుక్క కరిస్తే వెంటనే సబ్బుతో ఎక్కువ సేపు గాయాన్ని కడగాలన్నారు. కొళాయి నీరును ధారగా వదిలేసి కడగాలని కోరారు. 24 గంటల్లోపు డాక్టర్‌ను సంప్రదించి తగు వైద్యం పొందాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకష్ణారెడ్డి మాట్లాడుతూ రేబీస్ వ్యాధిపై ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఏవీ సుబ్రహ్మణ్యం, జూనియర్ రెడ్‌క్రాస్ నాయకులు ఎన్.ప్రభాకర్, పీఎంపీ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొన్నారు.