JC Imthiaz
-
కడుపులో కత్తెర పై విచారణ
నెల్లూరు(బారకాసు): రోగి చలపతి కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేసిన ఘటనపై గురువారం జేసీ ఇంతియాజ్ అహ్మద్ నేతృత్వంలోని కమిటీ జీజీహెచ్‌లో విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన వైద్యుల నిర్లక్ష్యం ఘటనపై మానవ హక్కుల కమి షన్ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. హెచ్చార్సీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కమిటీ చైర్మన్‌గా జేసీ, సభ్యులుగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ సీవీ రమాదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణరాజును నియమించిన విషయం తెలిసిందే. గురువారం జీజీహెచ్‌లో జరిగిన విచారణకు చలపతికి రెండు స్లారు ఆపరేషన్ చేసిన వైద్యులు, నర్సులు మొత్తం 8 మంది హాజరయ్యారు. వీరిలో జనరల్ సర్జన్ హెచ్ఓడీ డాక్టర్ పద్మశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పద్మజారాణి, డాక్టర్ శ్రీలక్ష్మి, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ సాయిసందీప్, మత్తు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ ప్రియాంక, స్టాఫ్ నర్సులు పార్వతి, అనిత ఉన్నారు. మూడు గంటలపాటు విచారణ ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యులు, నర్సులను మూడు గంటల పాటు కమిటీ విచారించింది. ఒక్కొక్కరిని పిలిచి ఆపరేషన్ జరిగిన సమయంలో ఏం జరిగింది? ఆ సమయంలో చేసిన పని ఏమిటని పూర్తిస్థాయిలో విచారించారు. ఈ మేరకు వైద్యులు, నర్సుల వాగ్మూలాన్ని లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. పేషెంట్‌కు సంబంధించిన కేస్‌షీట్‌ను కూడా జేసీ తీసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ఇంతియాజ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు తాము పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. దీనిపై మరింత లోతుగా సమగ్రంగా విచారణ జరిపి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం జేసీ ఇంతియాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చలపతిని పరామర్శించారు. ఆయన భార్య జానకమ్మతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కళారాణి, ఇన్చార్జి ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ ఉన్నారు. బాధ్యులపై చర్యలెప్పుడో? ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఇంత వరకు కనీసం ప్రాథమిక చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు లేవు. బాధ్యులకు మెమోలు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగి ఇన్ని రోజులైతే చివరికి విషయం బయటకు పొక్కడం, మానవ హక్కుల కమిషన్ స్పందించడంతో గురువారం అధికారులు విచారణ చేపట్టిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే విచారణ నివేదికలను ఉన్నతాధికారులు పరిశీలించేదెప్పుడు..బాధ్యులపై చర్యలు తీసుకునేదెప్పుడు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
దత్తత గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు మండలంలోని మహిమలూరు, ఏఎస్‌పేట మండలంలోని చిరమన గ్రామాలను కేంద్ర రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డీఆర్డీఏ డైరెక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి, గ్లోబెల్ ఆస్పత్రి నిర్వాహకులు రవీంద్రనాయుడులు దత్తత తీసుకున్నారని, వారి సహకారంతో గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలనిఽ జేసీ ఇంతియాజ్ అహ్మద్ కోరారు. గురువారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో కావాల్సిన మౌలిక వసతులను గుర్తించి జాబితాను ఉన్నతాధికారులకు అందచేయాలన్నారు. మహిమలూరు గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం, శ్మశానవాటిక అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రాథమిక పాఠశాల, దళిత కాలనీలోని మరో పాఠశాలకు ప్రహరీగోడల నిర్మాణం, నూతన పశువైద్యశాల భవనం, రైతులు ధాన్యం దాచుకునేందుకు గోదాముల నిర్మాణం తదితర పనులకు రూ.2.48 కోట్లు అంచనాలు తయారుచేశారని, వాటిని ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మహిమలూరులో జరిగిన పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ ఎం.వెంకటరమణ, ముఖ్య ప్రణాళికాధికారి వెంకయ్య, ఆర్డబ్ల్యూఽఎస్ ఈఈ ఆర్వీ రామిరెడ్డి, డీఈ సీహెచ్ శ్రీనివాసరావు, ఏపీడీ మృదుల, పంచాయతీరాజ్ డీఈ, ఏఈలు, గ్రామ నాయకులు చిట్టమూరు రవీంద్రారెడ్డి, నిజమాల నరసింహులు, ఉప మండలాధ్యక్షుడు తోట కృష్ణయ్య, సర్పంచ్ రఘురామిరెడ్డి తదితరులున్నారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా
జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అల్లూరు : మండలంలోని సింగపేట గిరిజన కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలసి గిరిజనుల ఇండ్లను పరిశీలించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గిరిజనులు విద్యావంతులు కావాలన్నారు. ఈ ప్రాంత గిరిజనులు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నందున తహసీల్దార్, ఎంపీడీవో వారం రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారని, ఆ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇండ్ల మరమ్మతులు, లెవలింగ్, అంతర్గత రోడ్లు, సోలార్ సెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ కాలనీల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డ్వామా పీడీ హరిత, ఐటీడీఏ పీవో కమలకుమారి, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, హౌసింగ్ డీఈ వెంకటస్వామి, తహసీల్దార్ పూర్ణచంద్రరావు, ఎంపీడీవో కనకదుర్గాభవాని, హౌసింగ్ ఏఈ వెంకటయ్య, స్థానిక టీడీపీ నాయకులు బండి అమర్‌రెడ్డి, రమణయ్య, బండి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలు పెంపొందించాలి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): జిల్లాలో నగదు రహిత లావాదేవీలను పెంపొందించేలా బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ బ్యాంక్ కరస్పాండెంట్లకు సూచించారు. గురువారం స్థానిక గోల్డన్ జూబ్లీహాల్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంక్ కరస్పాండెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 35 లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. వాటిలో 4.50 లక్షల జనధన్ ఖాతాలు ఉన్నాయన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు వలన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రెడిట్, డెబిట్, రూపే, జనధన్ కార్డులను ప్రజలు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాపారులు రూ.50 వేలకు మించి లావాదేవీలు చేయవచ్చునని తెలిపారు. జిల్లాలోని 1890 చౌకదుకాణాల్లో నగదు రహిత పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంక్ ఖాతాలు లేని పింఛన్‌దారులు, ఉపాధి కూలీలను గుర్తించాలన్నారు. వారందరికీ డిసెంబర్ 1వ తేదీలోపు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జేసీ వ్యవసాయం, కార్మిక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి స్వైపింగ్ మిషన్ల ఏర్పాటుపై సమీక్షించారు. సమావేశంలో ఏపీజీబీ ఆర్ఎం బీవీ శివయ్య, సీనియర్ మేనేజర్ ఎంఎస్ రామ్ పాల్గొన్నారు. -
స్వైపింగ్ మిషన్లతో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్
రేషన్ డీలర్లు కరెంట్ అకౌంట్లు ప్రారంభించాలి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు జేసీ ఆదేశం నెల్లూరు(పొగతోట): కూరగాయల మార్కెట్లు, పచారిషాపులు, షాపింగ్‌మాల్స్, పెట్రోలు బంకులు, మెడికల్ షాపులు తదితర వాటిల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఏ. మహమ్మద్‌ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, వ్యాపారులు, చౌకదుకాణాల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులుపడకుండా బ్యాంకు అకౌంట్లు, జనధన్ అకౌంట్లు ఉన్నా వారందరికి రూపే కార్డులు పంపిణి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బ్యాంకు సేవలకు ఇబ్బందులు పడకుండా చౌకదుకాణాల డీలర్లను బ్యాంకింగ్ కరాస్పాండెంట్లుగా నియమించడం జరిగిందన్నారు. డీలర్లందరు బ్యాంకు కరెంట్ అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో 430 ఏటీఎంలు ఉన్నాయన్నారు. వాటిలో 200ఏటీఎంలను కొత్త రూ.2000లు, రూ,500ల నోట్లు తీసుకునేలా సిద్దం చేశామన్నారు. కూరగాయల మార్కెట్లలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మిని ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి చౌకదుకాణాల్లో నగదు లేకుండా రేషన్ పంపిణి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 418 బ్యాంకులు ఉన్నాయన్నారు. ప్రతి నిత్యం రూ.220 కోట్లు అ ప్రస్తుతం రూ.80 కోట్లు అందుబాటులో ఉంటున్నాయన్నారు. పరిశ్రమలకు అనుకులమైన భూములను గుర్తించండి. పరిశ్రమలకు అనుకులంగా ఉండే భూములను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఏ.మహమ్మద్‌ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలికసదుపాయాలు ఉండే భూములను గుర్తించాలని సూచించారు. -
నగదు రహిత లావాదేవీలు
మినీ సంచార ఏటీఎంను ప్రారంభించిన జేసీ నెల్లూరు రూరల్ : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో ఎస్బీఐ మినీ సంచార ఏటీఎంను ఆదివారం ఆయన ప్రారంభించారు. జేసీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను పెంచడానికి పేటీఎం, మొబైల్ కరెన్సీ, క్యాష్ ట్రాన్స్ఫర్ తదితర లావాదేవీలను పెంచడానికి సంబంధిత సర్వీసు ప్రొవైడర్లతో మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారులకు చిల్లర సమస్య లేకుండా సంచార ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 70 పెట్రోలు బంకుల్లో పేటీఎంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన పట్టణాల్లో పేటీఎం, సంచార ఏటీఎం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రూ.26 కోట్లు రూ.100, రూ.50, రూ.10 నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రధాన ఆలయాల్లోని హుండీల్లోని చిల్లరను బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రజలు చిల్లర కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఎస్బీఐ జనరల్ జనరల్ మేనేజర్ నారాయణమయ్య మాట్లాడుతూ జిల్లాలో 10 సంచార ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏటీఎంల్లో అన్ని బ్యాంకు ఏటీఎం కార్డులను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రకాష్‌రావు, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉపేంద్రకుమార్, ఏఎంసీ ఛైర్మన్ మునుకూరు రవికుమార్‌రెడ్డి, వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు. -
సచిన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): సచిన్ టెండుల్కర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేసీ ఏ.మహమ్మద్ ఇంతియాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 16న సచిన్ గూడూరు మండలం పుట్టంరాజువారీకండ్రిగ గ్రామంలో పర్యటిస్తారన్నారు. 2014 నవంబర్ 16వ తేదీన సచిన్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు రూ.6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఎంపీ లాండ్స్ నుంచి రూ.2.80 కోట్లు, రూ.3.20 కోట్ల జిల్లా నిధులు కేటాయించామన్నారు. అండర్ డ్రైనేజ్, మంచినీటి సరఫరా, విద్యుత్, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, క్రీడామైదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండో విడతలో గోల్లపల్లి, నెర్నూరు గ్రామాలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు గ్రామంలో జాబ్‌మేళా నిర్వహించినట్లు చెప్పారు. గృహ నిర్మాణాల్లో కొద్దిగా జాప్యం జరిగిందన్నారు. సచిన్ ఉదయం 11.30 గంటలకు గ్రామానికి చేరుకుంటారన్నారు. కమ్యూనిటీ హాల్ ప్రారంభించి స్వచ్ఛభారత్‌పై అధికారులతో చర్చిస్తారన్నారు. అనంతరం స్థానికులను వారి వారి ఇళ్ల వద్ద మాట్లాడతారన్నారు. క్రీడామైదానంలో బహిరంగ సభలో సచిన్ ప్రసంగిస్తారన్నారు. -
రేపు నెల్లూరు జిల్లాకు సచిన్
-
రేపు నెల్లూరు జిల్లాకు సచిన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ బుధవారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. గూడూరు మండలంలో తాను దత్తత తీసుకున్న పుట్టమరాజు వారి కండ్రిగ గ్రామంలో పర్యటించనున్నారు. సచిన్ 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టమరాజు వారి కండ్రిగకు చేరుకుంటారు. అనంతరం గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై ప్రజలు, అధికారులతో చర్చించనున్నారు. కాగా తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ఇదిలా ఉండగా సచిన్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులు గత వారం రోజులుగా గ్రామంలో పర్యవేక్షిస్తున్నారు. -
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. నిరుద్యోగ యువతను గుర్తించి వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. పరిశ్రమల్లో ఉన్న ఖాళీలను గుర్తించాలన్నారు. ఆ ఖాళీల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్ఆర్) నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. ఉజ్వలపై ప్రచారం నిర్వహించండి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంపై ప్రజలకు అవగాహన కలిగేలా గ్యాస్ ఏజెన్సీల ద్వారా చర్యలు తీసుకోవాలని జేసి ఇంతియాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 20 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మీ–సేవా కేంద్రాల్లో పాత నోట్లతో బిల్లుల చెల్లింపు మీ–సేవ కేంద్రాల్లో ఈ నెల 14వ తేది అర్ధరాత్రి వరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో బిల్లులు చెల్లించవచ్చునని జేసీ ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో మీ–సేవా కేంద్రాలకు ఉత్తర్వులు ఇచ్చామని పేర్కొన్నారు. విద్యుత్, ఇంటి, కుళాయి పన్నులను పాత నోట్లతో చెల్లించవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
పోటీతత్వంతో ముందుకెళ్లాలి
జేసీ ఇంతియాజ్ గూడూరు: నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో ముందుకెళ్లాలని జేసీ ఇంతియాజ్ అన్నారు. గూడూరు రూరల్ పరిధిలోని సచిన్ దత్తత గ్రామమైన పుట్టంరాజువాని కండ్రిగలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా జరిగింది. కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా, ఏం చేస్తున్నా పోటీ అనేది తప్పడం లేదన్నారు. ఉద్యోగం సాధించడానికి పోటీ తప్పదనుకుంటే అది సాధించాక కూడా విధి నిర్వహణలో కూడా ఆ పోటీ తప్పడం లేదన్నారు. సచిన్ దత్తత గ్రామంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని, గ్రామాభివృద్దే కాకుండా ఆ గ్రామంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ జీవనోపాధి కల్పించడం కూడా చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు కృష్ణపట్నం పోర్టు, హిందూస్థాన్, గమీషా, మీనాక్షి, సింహపురి, శ్రీసిటి లాంటి 38 కంపెనీలకు చెందిన ప్రతినిధులచే ఈ జాబ్ మేళా నిర్వహించి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇన్చార్జి ఆర్డీఓ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జిల్లాలోని నలు మూలల నుంచి సుమారు 1500 మందికి పైగా నిరుద్యోగ యువతీయువకులు ఈ జాబ్ మేళాకు వచ్చారని తెలిపారు. డీఆర్డీ ఏపీడీ లావణ్యవేణి, సర్పంచ్ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బొమ్మిరెడ్డి పద్మ, ఎంపీటీసీ పెంచలరావు, తహసీల్దార్ భవానీ, హౌసింగ్ డీఈ నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
జేసీ ఇంతియాజ్ వరికుంటపాడు : ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా సాగుచేస్తే క్రిమినల్ కేసులు పెడతామని జేసీ ఇంతియాజ్ హెచ్చరించారు. వరికుంటపాడు తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం భూసమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి మెట్ట మండలాల్లో కొంతమంది అక్రమార్కులు పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి సాగుచేసుకుంటున్నారన్న ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ బైండోవర్ చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఉదయగిరి ప్రాంతం నుంచి భూసమస్యలపై జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు ఎక్కువ అర్జీలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీల వెల్లువ స్థానిక తహసీల్దారు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు భూసమస్యలపై అర్జీలు వెల్లువలా వచ్చాయి. భూ ఆక్రమణలకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా బాధితులు ఇచ్చారు. తూర్పురొంపిదొడ్ల, డక్కునూరు, టి.కొండారెడ్డిపల్లి, వేంపాడు, తూర్పుబోయమడుగుల, మహ్మదాపురం, పెద్దిరెడ్డిపల్లి, జి.కొండారెడ్డిపల్లి, కాంచెరువు తదితర గ్రామ పంచాయతీల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని జేసీకి అర్జీలిచ్చారు. కార్యక్రమంలో కావలి ఆర్డీవో లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఓపీ రిజిష్టరు చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం
జేసీ ఇంతియాజ్ ఆహ్మద్ ఓజిలి : అర్జీదారులు వినతలకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆహ్మద్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామపంచాయతీలు నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు హాజరయ్యారు. గ్రీవెన్స్‌సెల్‌కు 220 వినతులు అందాయలని తహసీల్దార్ చెంచుకృష్ణమ్మ తెలిపారు. గుర్రంకొండ గ్రామంలో పొలాల్లోకి వెళ్లే దారి, డొంకను నాయుడుపేటకు చెందిన ఓ కోపల్లి హనుమంతునాయుడు ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేశారు. మేత పోరంబోకు భూమి రెండెకరాలు ఆక్రమించి పంటలు సాగు చే స్తూ దళితులను దారులో పోనీకుండా అడ్డుకుంటూ తమపై కేసులు పెడుతున్నాడని విన్నవించారు. దళితులపై కేసులు పెట్టిన వ్యక్తిని రెవెన్యూ అధికారులు ఎందుకు వెనకేసుకుని వస్తున్నారని జేసీ ప్రశ్నించారు. దళితులను భూములలోకి వెళ్లకుండా డొండను ఆక్రమించిన వ్యక్తిపై కేసులు పెట్టాలని తహశీల్దార్ చెంచుకృష్ణమ్మ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో ఆయన సమావేశం నిర్వహించారు. వెంటనే అర్జీలకు పరిష్కారం చూపి ప్రతి అర్జీను కంప్యూటర్లో పొందుపరచాలన్నారు. ఆర్డీఓ శీనానాయక్, ఎంపీడీఓ పీవీ నారాయణ, ఇరిగేషన్ డీఈ కోటేశ్వర్రావు, హోసింగ్ ఏఈ సత్యనారాయణ, వీఆర్వోలు, ఐసీడీఎస్ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
31లోపు సర్వే పూర్తి చేయండి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే)ను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రజలందరూ 31వ తేదీలోపు తమ పేర్లను సర్వేలో నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ పల్స్ సర్వేలో పేర్లు నమోదు చేయించుకున్నందు వలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమగ్రంగా పొందవచ్చునని తెలిపారు. 31వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోని వారి కోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 1, 2 తేదీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్లలో వారు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. పేర్లు నమోదు కాని వారు కేంద్రాలకు వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు అందజేయాలని తెలిపారు. అంతకుముందు ప్రజా సాధికార సర్వే, భూ సమస్యలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై సీసీఎల్ఏ అనిల్‌చంద్రపునేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
వేగవంతంగా స్మార్ట్ పల్స్ సర్వే
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వేను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నెలాఖరులోపు సర్వేను పూర్తి చేయాలని సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 2.6 లక్షల మందికి సంబంధించిన సర్వేను పూర్తి చేయాల్సి ఉందని, సర్వేపై నిత్యం సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారన్నారు. సర్వేను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వేలో ఈకేవైసీ సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం సర్వే పూర్తయిందని, పట్టణ ప్రాంతాల్లో వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. సర్వే పూర్తయ్యేంత వరకే సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను రిలీవ్ చేశామని, సంబంధిత శాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని సిబ్బందిని ఒత్తిడి పెట్టవద్దని తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలు ఆన్లైన్లో.. పోలింగ్ కేంద్రాల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గోల్డెన్ జూబ్లీ హాల్లో తహశీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారి, కేంద్రంలో సిబ్బంది ఉండే తీరు, పోలింగ్ ప్రక్రియ, తదితర వివరాలను మ్యాప్‌ల ద్వారా ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. ఫొటోలతో ఓటర్ల జాబితాలను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేయాలన్నారు. జాబితాలను సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచురించాలని తెలిపారు. అనంతరం పోలింగ్ కేంద్రాల మ్యాప్‌ల అప్లోడింగ్పై శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ ప్రాజెక్ట్ మేనేజర్ చిరంజీవి, వివిధ మండలాల తహశీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
పునరావాస పనులను వేగవంతం చేయాలి
నెల్లూరు రూరల్: పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా వివిధ పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో నిర్వాసితులైన వారికి పునరావాస పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పునరావాస ప్యాకేజీ పథకం(ఆర్ఆర్) పనులపై జేసీ ప్రత్యేక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. నెల్లూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట మండలాల పరిధిలో పరిశ్రమల నిర్వాసితులకు పునరావాసంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని తహశీల్దార్లకు సూచించారు. ముత్తుకూరు మండలం నేలటూరు ఎస్సీ కాలనీ ప్రజలకు ఇళ్ల స్థలాలను నెల్లూరు రూరల్ మండల పరిధిలోని వావిలేటిపాడు వద్ద కేటాయించినట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం జేసీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నెల్లూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు తహశీల్దార్లు వాకా శ్రీనివాసులురెడ్డి, రామలింగేశ్వరరావు, చెన్నయ్య, పరిశ్రమల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ సర్వే నెలాఖరులోపు పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వే(ప్రజా సాధికార సర్వే) ఈ నెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. సర్వేలో ప్రజల ఫింగర్ ఫ్రింట్స్ సేకరించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సర్వే సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల వివరాలు సర్వేలో నమోదు చేయాలన్నారు. చంద్రన్న బీమా పథకం పక్కగా అమలు చేయాలన్నారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో 46 మండలాలు ఉన్నాయని, 32 మండలాల్లో వంద శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో విక్రమ సింహపురి వైస్ చాన్స్‌లర్ వీరయ్య, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఆర్డీఓలు పాల్గొన్నారు. అధికారులతో జేసీ సమావేశం ప్రజా సాధికార సర్వే పై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ తన చాంబర్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 24వ తేదీలోపు సర్వే వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఓ పీబీకే మూర్తి, గూడూరు సబ్ కలెక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
అర్జీలను సకాలంలో పరిష్కరించండి
నెల్లూరు(పొగతోట): ప్రజలు సమర్పించిన వినతులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. డయల్ యువర్ కలెక్టర్‌కు వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించిన వినతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. జేసీ – 2 రాజ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డయల్ యువర్ కలెక్టర్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 12 మంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ముత్యాలరాజు సెలవులో ఉండటంతో జేసీ ఇంతియాజ్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ సమస్యలు, పింఛన్లు, తదితరాలపై ఫిర్యాదులు అందాయి. -
పన్నుల విధానంపై అవగాహన అవసరం
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(వేదాయపాళెం): వస్తు సేవలు, వాణిజ్యపరమైన పన్నుల విధానంపై ఆయా శాఖల అధికారులకు అవగాహన అవసరమని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. నగరంలోని గోల్డెన్ జూబ్లీ హాల్లో శుక్రవారం కమర్షియల్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017 ఏప్రిల్ చట్టంలోని ప్రధాన అంశాల గురించి వివరించారు. రాజ్యాంగ సవరణ 122 యాక్ట్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆడిట్, పన్నులు, పలు విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని వివరించారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు. కమర్షియల్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగజ్యోతి, సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమలకు అనువైన భూములు గుర్తించండి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు ఉన్న భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం భూములు కేటాయిస్తామని తెలిపారు. కోర్టులో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించి క్లియరెన్స్ తీసుకోవడంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలకు విద్యుత్, భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలకు సంబంధించి సబ్సిడీ మంజూరు చేయడంలో బ్యాంక్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిశ్రమల జీఎం ప్రదీప్‌కుమార్, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం, ఎఫ్‌సీఐ మేనేజర్ గఫూర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వనజాక్షి తదితర అధికారులు పాల్గొన్నారు. -
పునరావాస పనులను త్వరగా పూర్తిచేయాలి
నెల్లూరు(పొగతోట): మన్సూర్‌నగర్, రామిరెడ్డినగర్, తదితర ప్రాంతాల్లో కాలువల్లో నివసించే వారికి పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. వైఎస్సార్‌నగర్‌లో నివాసం ఉంటున్న ప్రజలతో జేసీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కాలువలపై నివసించే వారు భారీవర్షాలు పడితే ముంపునకు గురవుతారని తెలిపారు. ముంపునకు గురికాకుండా వారికి పునరావాసం కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వైఎస్సారనగర్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. హౌసింగ్, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో నిర్దేశిచిన పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారం భూసేకరణ
ఇన్చార్జి కలెక్టర్ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి దగదర్తి మండలంలో భూసేకరణ వేగవంతం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడారు. సీజేఎఫ్ఎస్, పట్టా, అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించి కేటగిరీ వారిగా పెండింగ్ లేకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కోర్టులో కేసులను పరిష్కరించి భూసేకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 150 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి రూ.17 కోట్ల నష్టపరిహారం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కావలి ఆర్డీఓ నరసింహన్, దగదర్తి తహసీల్దార్ వై. మధుసూదన్‌రావు పాల్గొన్నారు. సమాచారాన్ని అందజేయండి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివిద శాఖలకు సంబంధించిన 235 ఇండికేటర్ల సమాచారాన్ని వెంటనే అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇన్చార్జి కలెక్టర్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 37 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 235 ఇండికేటర్లు ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఓ పీబీకే మూర్తి పాల్గొన్నారు. -
రేబిస్ రహిత జిల్లాగా మారుద్దాం
–జేసీ ఇంతియాజ్ నెల్లూరు(అర్బన్): నెల్లూరును రేబీస్ వ్యాధి(పిచ్చి) రహిత జిల్లాగా మారుద్దామని జేసీ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక వీఆర్సీ నుంచి రెడ్‌క్రాస్ కార్యాలయం వరకు బుధవారం సాయంత్రం అవగాహనా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని జేసీ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహనా పెంచాలన్నారు. కుక్క కరిస్తే వెంటనే సబ్బుతో ఎక్కువ సేపు గాయాన్ని కడగాలన్నారు. కొళాయి నీరును ధారగా వదిలేసి కడగాలని కోరారు. 24 గంటల్లోపు డాక్టర్‌ను సంప్రదించి తగు వైద్యం పొందాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకష్ణారెడ్డి మాట్లాడుతూ రేబీస్ వ్యాధిపై ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఏవీ సుబ్రహ్మణ్యం, జూనియర్ రెడ్‌క్రాస్ నాయకులు ఎన్.ప్రభాకర్, పీఎంపీ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొన్నారు. -
రైల్వే లైన్‌కు భూ సేకరణ వేగవంతం
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): నడికుడి–శ్రీకాళహస్తి్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబం«ధించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 146 కిలోమీటర్ల రైల్వే లైన్‌కు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. రాపూరు మండలంలో భూసేకరణలో జాప్యం జరుగుతుందని రెవెన్యూ అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు డివిజన్లో భూ సేకరణకు సంబంధించి పట్టా భూముల ప్రాథమిక ప్రకటన, ప్రభుత్వ భూముల అలినేషన్ ప్రతిపాదనలు వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, ఎంవీ రమణ, నరసింహన్ పాల్గొన్నారు. రైతు బజార్ల ఏర్పాటుకు భూములు గుర్తించండి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మార్కెట్ యార్డులు, రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ భూములు గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఏ. మహమ్మద్‌ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసి మాట్లాడారు. వెంకటగిరి గురుకుల పాఠశాల, కోవూరు ప్రాంతాల్లో రైతు బజారు ఏర్పాటుకు స్థలం సేకరించాలని అధికారులను ఆదేశించారు. -
పరిశ్రమలకు సకాలంలో అనుమతులు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): పరిశ్రమలకు అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పరిశ్రమల ప్రోత్సాహక కమిటీని ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్లో పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. 48 పరిశ్రమల అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించారు. 19 పరిశ్రమలకు రాయితీల విషయమై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ పరిశ్రమల అనుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. ఈ నెల 22న నాయుడుపేట, 29న ఆత్మకూరులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ముత్తుకూరులో యూఎంపీపీ పవర్‌ప్రాజెక్ట్ నిర్మాణంలో గృహాలు కోల్పోయిన ముగ్గురు నిర్వాసితులు దువ్వూరు సుబ్బరత్నమ్మకు రూ.2,50,793, వెంకటేశ్వర్లు, సంపత్‌కుమార్‌కు ఒక్కొక్కరికి రూ43,050 వంతున చెక్కులు అందజేశారు. ఈ సమావేశంలో డీఈసీ జనరల్ మేనేజర్ వైఎల్ ప్రదీప్‌కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఒమ్మిన సుబ్రహ్మణ్యం, కాలుష్య నియంత్రణాధికారి ప్రమోద్‌కుమార్, పరిశ్రమల ఏడీ సురేష్, ఎల్డీఎం వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములు పరిరక్షించాలి
నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వ భూములు పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్ ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు. గురువారం ప్రకాశం జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శిక్షణ కేంద్రంలో ట్రైనీ ఐఏఎస్‌లకు ప్రభుత్వ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా గ్రామ స్థాయి నుంచి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంకింగ్ చేయడం ద్వారా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవచ్చునని వివరించారు. ప్రభుత్వ భూములను అక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. -
భూరికార్డుల పునఃపరిశీలన
జేసీ ఇంతియాజ్ అహ్మద్ నెల్లూరు(పొగతోట): భూరికార్డులను పునఃపరిశీలించాలని జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో బుధవారం ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. గతంలో ఆనక్షరీ 1, 2, 3, 4, 5 ప్రొఫార్మాలో భూరికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు. పరిశీలించిన రికార్డులను సీసీఎల్ఏకు పంపించడం జరిగిందన్నారు. పంపించిన రికార్డులను పునఃపరిశీలించమని సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసిందన్నారు. భూములకు సంబంధించిన రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. వారం రోజుల్లో భూ రికార్డు ల పరిశీలన పూర్తి చేసి సీసీఎల్ఏకు నివేదిక అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతక ముందు 22(ఏ) రికార్డుల పరిశీలనకు సంబం«ధించి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో మార్కండేయులు, గూడూరు, నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, ఎంవీ రమణ, నరసింహన్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ అండ్‌ఆర్ పనులు పూర్తి చేయండి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): రిహ్యాబిటేషన్ అండ్ రెమ్యూనరేషన్ (ఆర్అండ్ఆర్)కు సంబంధించిన పనులు త్వరగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. పునరావాసకేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. నక్కలమిట్ట వద్ద శ్మశానం, ఆర్కేట్పాళెంలో సీసీరోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కృష్ణపట్నం–ఆర్కేట్పాళెం వరకు గ్రావెల్, రివిట్మెంట్ పనులు పూర్తి చేయాలన్నారు. ముసునూరువారిపాళెం–కొత్తపాళెం బీసీ కాలనీ వరకు, ఏపీజెన్కో–ముసునూరుపాళెం వరకు నిర్దేశించిన రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం మంజూరు చేయాలన్నారు. నేలటూరుపాళెం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ధనలక్ష్మీపురం, మాదరాజుగూడూరుల వద్ద అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. కండలేరు వద్ద దేవాలయం పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లి వద్ద టుబాకో బ్యారెన్ ఏర్పాటుకు పర్యావరణ సమస్యలు లేకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలన్నారు. ఆర్అండ్ఆర్ పనులు త్వరగా పూర్తి చేసేలా రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, ఎంవీ రమణ, ప్లానింగ్ అధికారి వెంకయ్య, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రవీంద్రారెడ్డి, ముత్తుకూరు, కలువాయి, చేజర్ల తహసీల్దార్లు చెన్నయ్య, వెంకటేశ్వరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారమే నష్టపరిహారం
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట) : దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భూములిచ్చిన రైతులకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు నష్టపరిహారం మంజూరుచేయాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులు, దామవరం, కెకెగుంట రైతులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. నష్టపరిహారం మంజూరులో సమస్యలుంటే రైతులు కావలి ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. విమానాశ్రయానికి సంబంధించి భూ సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. వివాదాలల్లో ఉన్న భూములను సేకరించవద్దని తెలిపారు. ఈ సమావేశంలో కావలి ఆర్డీఓ నరసింహన్, దగదర్తి తహసీల్దార్ వై.మధుసుదన్‌రావు, ఏపీఐఐసీ ప్రతినిధి రహమాన్ పాల్గొన్నారు. -
భూ సేకరణను వేగవంతం చేయండి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో వివిధ శాఖల అ«ధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. దగదర్తి వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. భూ సేకరణ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించిన తరువాత వాటిని సేకరించాలన్నారు. సీజేఎఫ్ఎస్, పట్టా, ప్రభుత్వ, అసైన్డ్ భూములు కేటగిరిల వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. సేకరించిన భూములకు నిర్దేశించిన నష్టపరిహారం సక్రమంగా మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో బోగాపురం ఎయిర్‌పోర్టు ఎండీ వెంకటేశ్వరరావు, కావలి ఆర్డీఓ నరసింహన్, కలెక్టరేట్ తహసీల్దార్ శేషగిరిరావు, దుత్తలూరు తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
స్మార్ట్ పల్స్ సర్వే 60 శాతం పూర్తి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే) ఇప్పటి వరకు జిల్లాలో 60 శాతం పూర్తయిందని జేసీ ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్లో స్మార్ట్ పల్స్ సర్వేపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్నారన్నారు. 1976 మంది ఎన్యూమరేటర్ల ద్వారా ఇప్పటి వరకు 16.59 లక్షల జనాభాకు సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. సర్వేపై ఆటోల ద్వారా ప్రచారం కల్పించి ఈ నెలఖారుకు వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సర్వే వలన ప్రజలకు ఎటువంటి నష్టం జరగదన్నారు. -
స్టేడియం అభివృద్ధి పనుల వేగవంతం
సెప్టెంబరు నెలాఖరులోగా డీఎస్ఏకు అప్పగించాలి జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ నెల్లూరు(బృందావనం): ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జేసీ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశించారు. సెప్టెంబరులోగా పనులను పూర్తి చేసి జిల్లా క్రీడాప్రాధికార సంస్థకు అప్పగించాలని సూచించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రూ.2.98కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ ప్రసాద్‌ను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఇండోర్‌స్టేడియాన్ని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ సూచనల మేరకు తీర్చిదిద్దుతున్నట్లు ఈఈ వివరించారు. గతంలో బ్యాడ్మింటన్ కోసం ఐదు కోర్టులు ఉండగా, ప్రస్తుతం 9 కోర్టులను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రెండు కోర్టులు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు, ఏడు కోర్టులు క్రీడాకారులకు వినియోగించనున్నట్లు వివరించారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ డైరెక్టర్ రవీంద్రబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య ఉన్నారు. -
రైస్ మిల్లర్లకు వేబిల్లుల నిలిపివేత
నిర్ధేశించిన సమయంలో సీఎంఆర్ ఇవ్వాలి ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ నెల్లూరు(పొగతోట): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరా చేయకుండా కాకమ్మ కబుర్లు చెబితే సహించేది లేదని జేసీ ఇంతియాజ్ అహ్మద్ రైస్ మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో సీఎస్డీటీలు, డీటీలు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. సీఎంఆర్ సరఫరా చేయడానికి సమయం కావాలని ఈ సందర్భంగా మిల్లర్లు జేసీని కోరారు. ధాన్యం బస్తాలు మిల్లుల్లో నిల్వ ఉంచితే కోతులు గందరగోళం చేస్తున్నాయని మిల్లర్లు చెప్పడంతో కుంటిసాకులు చెప్పడం మానుకుని సీఎంఆర్ సరఫరా చేయాలని జేసీ సూచించారు. సీఎంఆర్ పూర్తి స్థాయిలో సరఫరా చేసేంత వరకు రైస్ మిల్లులకు వేబిల్లులు కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 10 నాటికి 90 శాతం, 15న నాటికి 100 శాతం సీఎంఆర్ సరఫరా చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్లు వారికి కేటాయించిన రైస్ మిల్లుల్లో నిత్యం పర్యవేక్షిస్తూ ధాన్యం ఆడించి సీఎంఆర్ గోదాములకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీఎంఆర్ సరఫరా చేయని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్ఓ టి.ధర్మారెడ్డి, డీఎం కొండయ్య సీఎస్డీటీలు, డీటీలు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. -
సాధికార సర్వే 40 శాతం పూర్తి
జేసీ ఇంతియాజ్ అహ్మద్ మనుబోలు: జిల్లాలో సాధికార సర్వే ఇప్పటి వరకు 40 శాతమే పూర్తయిందని జేసీ ఇంతయాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం మనుబోలు దళితవాడలో జరుతున్న స్మార్ట్ పల్స్ సర్వేను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జూలై 12 నుంచి జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మొదట్లో చాలా ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం అన్ని సర్ధుకున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్స్ సర్వేలో 2,198 మంది ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 28 వేల కుటుంబాలను సర్వే చేసినట్లు తెలిపారు. ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా సర్వేకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. రోజుకు 30 కుటుంబాలను సర్వే చేస్తున్న పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, వీఆర్వో నాగార్జునరెడ్డిలను అభినందించారు. చెట్ల పంపకంతోనే కాలుష్య నివారణ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని జేసీ ఇంతయాజ్ అహ్మద్ అన్నారు. కుడితిపల్లిలో వనం–మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ మొక్కలు నాటాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ హేమలత, ఆర్ఐ కవిత ఉన్నారు. -
అవయవదానంతో పునర్జన్మ
నెల్లూరు(అర్బన్): అవయవదానంతో పునర్జన్మను పొందవచ్చని జేసీ 2 రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పుర స్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, సెట్నల్ ఆధ్వర్యంలో నగరంలోని రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు జేసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదాల బారిన పడి బ్రెయిన్‌డెడ్ అయిన వారు అవయవదానంతో 8 మందికి పునర్జన్మను ఇవ్వొచ్చని తెలిపారు. అవయవదానాన్ని ప్రోత్సహించాలని కోరారు. అనంతరం అవయవ దానం చేసిన నారాయణమ్మ, సుభాషిణి కుటుంబసభ్యులకు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ ఏవీ సుబ్రహ్మణ్యం, డాక్టర్ చక్రవర్తి, సెట్నెల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు. -
సేవకు ప్రతి రూపం నర్సింగ్
జేసీ ఇంతియాజ్ అహ్మద్ నెల్లూరు(అర్బన్): సేవలకు ప్రతిరూపమే నర్సింగ్ వృత్తి అని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో గురువారం మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ స్త్రీల టైనింగ్ కోర్సుల ఎంపికకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ కోర్సులో చేరేందుకు ప్రభుత్వ, మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి 51 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా 26 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన వారు తమ చదువులు పూర్తి చేసుకుని భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వరసుందరం, ఏఓ సాయిరాం, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
సీఎమ్మార్ ఇవ్వకపోతే చర్యలు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను నిర్దేశించిన సమయంలోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో సీఎస్డీటీలు, రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. వచ్చే నెల పదో తేదీలోపు 75 శాతం సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని సూచించారు. రైస్ మిల్లర్లకు 2.15 లక్షల టన్నుల సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని వివరించారు. ఇప్పటి వరకు 86 వేల టన్నుల సీఎమ్మార్‌ను సరఫరా చేశారన్నారు. బాయిల్డ్ రైస్‌ను ఎఫ్సీఐకు సరఫరా చేయాలని పేర్కొన్నారు. రెడ్, బ్లూ రెండు రకాల గన్నీ బ్యాగుల్లో సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని పేర్కొన్నారు. అనంతరం రైస్‌మిల్లర్లు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సీఎమ్మార్‌ను పూర్తిస్థాయిలో సరఫరా చేయాల్సిందేనని జేసీ స్పష్టం చేశారు. డీఎస్ఓ ధర్మారెడ్డి, డీఎం కొండయ్య, ఏఎస్ఓలు, సీఎస్డీటీలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు సుబ్రహ్మణ్యంరెడ్డి, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా స్యాతంత్య్ర వేడుకలు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట) : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ పతాకావిష్కరణ, కవాతు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మైదానంలో వీఐపీలు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబం«ధించిన నివేదికలను శాఖల వారీగా సీపీఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోదులు, న్యాయశాఖ అధికారులకు ఆహ్వానించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం కస్తూర్బా కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలో తిక్కన, పొట్టిశ్రీరాములు మహానుభావుల చరిత్రలతో కుడిన ప్రదర్శనలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యావసర వైద్యశిబిరాలు అందుబాటులో ఉంచాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను అకట్టుకునే విధంగా సిద్ధం చేయాలని తెలిపారు. అధికారులు, ఉద్యోగులందరు హాజరుకాలన్నారు. వివిధ శాఖల రుణాల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి, ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి, సీపీఓ పీబీకే మూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, ఐటిడీఏ పీఓ కమలకుమారి, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జేసీ ఏ.మహమ్మద్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల అ«ధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. వివిధ శాఖలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మగౌరవం స్టాల్ ఏర్పాటు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. శకటాలకు సంబంధించి డీఆర్డీఏ పీడీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. వార్డులకు సంబంధించిన వివరాలు ఈనెల 10 లోపు కలెక్టరేట్‌కు అందజేయాలన్నారు. ఒక్కో శాఖ నుంచి అంకితభావంతో పని చేసిన ఇద్దరి పేర్లను మాత్రమే పంపించాలన్నారు. సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, ఇన్చార్జ్ డీఆర్వో మార్కండేయులు పాల్గొన్నారు. -
జేసీ బదిలీకి రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ బదిలీకి రంగం సిద్ధమైంది. జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న ఒక నాయకుడు చెప్పిన పని చేయలేదనే ఆగ్రహంతో ఆయన్ను సాగనంపడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. త్వరలోనే ఆయన మీద బదిలీ వేటు పడొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఇంతియాజ్ నెల్లూరులో వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో 2014లో ఐఏఎస్ హోదా లభించింది. ఇక్కడే క్షేత్ర స్థాయి శిక్షణ పొందిన ఆయన గత ఏడాది జనవరి 15వ తేదీ జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఏడాదిన్నరగా వివాదాలకు దూరంగా పని చేస్తున్న ఆయన మీద తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడొకరు నెల్లూరులో విలువైన భూముల వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా తాను చెప్పినట్లు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. తాను చెబుతున్న పని చేయకపోవడంతో ఆ నాయకుడు జేసీ మీద అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన్ను జిల్లా నుంచి సాగనంపి తమకు అనుకూలమైన వారిని నియమించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయనీ త్వరలోనే జేసీ బదిలీ ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.