భూ సేకరణను వేగవంతం చేయండి | Land acquisition for Nellore airport | Sakshi
Sakshi News home page

భూ సేకరణను వేగవంతం చేయండి

Published Sun, Aug 28 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

భూ సేకరణను వేగవంతం చేయండి

భూ సేకరణను వేగవంతం చేయండి

  • జేసీ ఇంతియాజ్‌
  • నెల్లూరు(పొగతోట):
    విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో వివిధ శాఖల అ«ధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. దగదర్తి వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. భూ సేకరణ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించిన తరువాత వాటిని సేకరించాలన్నారు. సీజేఎఫ్‌ఎస్, పట్టా, ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు కేటగిరిల వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. సేకరించిన భూములకు నిర్దేశించిన నష్టపరిహారం సక్రమంగా మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో బోగాపురం ఎయిర్‌పోర్టు ఎండీ వెంకటేశ్వరరావు, కావలి ఆర్‌డీఓ నరసింహన్, కలెక్టరేట్‌ తహసీల్దార్‌ శేషగిరిరావు, దుత్తలూరు తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement