Nellore Airport
-
22న నెల్లూరుకు రాష్ట్రపతి రాక
-
భూ సేకరణను వేగవంతం చేయండి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో వివిధ శాఖల అ«ధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. దగదర్తి వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. భూ సేకరణ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించిన తరువాత వాటిని సేకరించాలన్నారు. సీజేఎఫ్ఎస్, పట్టా, ప్రభుత్వ, అసైన్డ్ భూములు కేటగిరిల వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. సేకరించిన భూములకు నిర్దేశించిన నష్టపరిహారం సక్రమంగా మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో బోగాపురం ఎయిర్‌పోర్టు ఎండీ వెంకటేశ్వరరావు, కావలి ఆర్డీఓ నరసింహన్, కలెక్టరేట్ తహసీల్దార్ శేషగిరిరావు, దుత్తలూరు తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
విమానాశ్రయ రైతుల భూముల జాబితా ప్రకటించండి
– ఆర్డీఓకు కలెక్టర్ ఆదేశం కావలి : దగదర్తి మండలంలోని కేకేగుంట, దామవరం ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి సేకరించిన భూముల జాబితాలు ప్రకటించాలని కావలి ఆర్డీఓ లక్ష్మీనరసింహంను కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశింఆరు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో శనివారం విమానాశ్రయ భూముల విషయలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టా భూములకు చెందిన రైతుల పేర్లతో జాబితాలను ప్రకటించడమే కాక ఆ భూములకు సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎంత విలువలు ఉన్నాయో సేకరించాలని అధికారులకు సూచించారు. ఇంత వరకు ప్రభుత్వ భూములకు చెందిన లబ్ధిదారులకు పరిహారం చెల్లించడం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పట్టా భూములకు చెందిన రైతులకు పరిహారం చెల్లింపులో జేసీ ఆధ్వర్యంలో పరిశీలన కమిటీ నియమించామని కలెక్టర్ చెప్పారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో విమానాశ్రయం కోసం భూమి పూజ సీఎం చంద్రబాబు చేతులు మీదుగా చేయిస్తామన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఆర్టీఓ లక్ష్మీనరసింహంతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.