విమానాశ్రయ రైతుల భూముల జాబితా ప్రకటించండి | Review meet on Nellore Airport lands | Sakshi
Sakshi News home page

విమానాశ్రయ రైతుల భూముల జాబితా ప్రకటించండి

Published Sun, Aug 21 2016 1:41 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

విమానాశ్రయ రైతుల భూముల జాబితా ప్రకటించండి - Sakshi

విమానాశ్రయ రైతుల భూముల జాబితా ప్రకటించండి

  • – ఆర్డీఓకు కలెక్టర్‌ ఆదేశం
  • కావలి : దగదర్తి మండలంలోని కేకేగుంట, దామవరం ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి సేకరించిన భూముల జాబితాలు ప్రకటించాలని కావలి ఆర్డీఓ లక్ష్మీనరసింహంను కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశింఆరు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో శనివారం విమానాశ్రయ భూముల విషయలో సమీక్ష నిర్వహించారు.  కలెక్టర్‌ రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టా భూములకు చెందిన రైతుల పేర్లతో జాబితాలను ప్రకటించడమే కాక ఆ భూములకు సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎంత విలువలు ఉన్నాయో సేకరించాలని అధికారులకు సూచించారు. ఇంత వరకు ప్రభుత్వ భూములకు చెందిన లబ్ధిదారులకు పరిహారం చెల్లించడం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పట్టా భూములకు చెందిన రైతులకు పరిహారం చెల్లింపులో జేసీ ఆధ్వర్యంలో పరిశీలన కమిటీ నియమించామని కలెక్టర్‌ చెప్పారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో విమానాశ్రయం కోసం భూమి పూజ సీఎం చంద్రబాబు చేతులు మీదుగా చేయిస్తామన్నారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్, ఆర్టీఓ లక్ష్మీనరసింహంతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement