రైల్వే లైన్‌కు భూ సేకరణ వేగవంతం
నెల్లూరు(పొగతోట):
నడికుడి–శ్రీకాళహస్తి్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబం«ధించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆర్‌డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 146 కిలోమీటర్ల రైల్వే లైన్‌కు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. రాపూరు మండలంలో భూసేకరణలో జాప్యం జరుగుతుందని రెవెన్యూ అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు డివిజన్‌లో భూ సేకరణకు సంబంధించి పట్టా భూముల ప్రాథమిక ప్రకటన, ప్రభుత్వ భూముల అలినేషన్ ప్రతిపాదనలు వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి ఆర్‌డీఓలు వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, ఎంవీ రమణ, నరసింహన్ పాల్గొన్నారు.
రైతు బజార్ల ఏర్పాటుకు భూములు గుర్తించండి
జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మార్కెట్ యార్డులు, రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ భూములు గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఏ. మహమ్మద్‌ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసి మాట్లాడారు. వెంకటగిరి గురుకుల పాఠశాల, కోవూరు ప్రాంతాల్లో రైతు బజారు ఏర్పాటుకు స్థలం సేకరించాలని అధికారులను ఆదేశించారు.