మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా
-
జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్
అల్లూరు : మండలంలోని సింగపేట గిరిజన కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలసి గిరిజనుల ఇండ్లను పరిశీలించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గిరిజనులు విద్యావంతులు కావాలన్నారు. ఈ ప్రాంత గిరిజనులు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నందున తహసీల్దార్, ఎంపీడీవో వారం రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారని, ఆ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇండ్ల మరమ్మతులు, లెవలింగ్, అంతర్గత రోడ్లు, సోలార్ సెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ కాలనీల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డ్వామా పీడీ హరిత, ఐటీడీఏ పీవో కమలకుమారి, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, హౌసింగ్ డీఈ వెంకటస్వామి, తహసీల్దార్ పూర్ణచంద్రరావు, ఎంపీడీవో కనకదుర్గాభవాని, హౌసింగ్ ఏఈ వెంకటయ్య, స్థానిక టీడీపీ నాయకులు బండి అమర్‌రెడ్డి, రమణయ్య, బండి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.