ఆర్ అండ్‌ఆర్ పనులు పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట):
రిహ్యాబిటేషన్ అండ్ రెమ్యూనరేషన్ (ఆర్‌అండ్‌ఆర్)కు సంబంధించిన పనులు త్వరగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
నెల్లూరు(పొగతోట):
రిహ్యాబిటేషన్ అండ్ రెమ్యూనరేషన్ (ఆర్‌అండ్‌ఆర్)కు సంబంధించిన పనులు త్వరగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. పునరావాసకేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. నక్కలమిట్ట వద్ద శ్మశానం, ఆర్కేట్‌పాళెంలో సీసీరోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కృష్ణపట్నం–ఆర్కేట్‌పాళెం వరకు గ్రావెల్, రివిట్‌మెంట్ పనులు పూర్తి చేయాలన్నారు. ముసునూరువారిపాళెం–కొత్తపాళెం బీసీ కాలనీ వరకు, ఏపీజెన్‌కో–ముసునూరుపాళెం వరకు నిర్దేశించిన రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం మంజూరు చేయాలన్నారు. నేలటూరుపాళెం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ధనలక్ష్మీపురం, మాదరాజుగూడూరుల వద్ద అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. కండలేరు వద్ద దేవాలయం పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లి వద్ద టుబాకో బ్యారెన్ ఏర్పాటుకు పర్యావరణ సమస్యలు లేకుండా జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేయాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్ పనులు త్వరగా పూర్తి చేసేలా రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో నెల్లూరు, ఆత్మకూరు ఆర్‌డీఓలు వెంకటేశ్వర్లు, ఎంవీ రమణ, ప్లానింగ్ అధికారి వెంకయ్య, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రవీంద్రారెడ్డి, ముత్తుకూరు, కలువాయి, చేజర్ల తహసీల్దార్లు చెన్నయ్య, వెంకటేశ్వరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.