- జేసీ ఇంతియాజ్
నిబంధనల ప్రకారమే నష్టపరిహారం
Published Thu, Sep 1 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
నెల్లూరు(పొగతోట) : దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భూములిచ్చిన రైతులకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు నష్టపరిహారం మంజూరుచేయాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో రెవెన్యూ అధికారులు, దామవరం, కెకెగుంట రైతులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. నష్టపరిహారం మంజూరులో సమస్యలుంటే రైతులు కావలి ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. విమానాశ్రయానికి సంబంధించి భూ సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. వివాదాలల్లో ఉన్న భూములను సేకరించవద్దని తెలిపారు. ఈ సమావేశంలో కావలి ఆర్డీఓ నరసింహన్, దగదర్తి తహసీల్దార్ వై.మధుసుదన్‌రావు, ఏపీఐఐసీ ప్రతినిధి రహమాన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement