పల్స్ సర్వే నెలాఖరులోపు పూర్తి చేయండి
పల్స్ సర్వే నెలాఖరులోపు పూర్తి చేయండి
Published Sat, Oct 15 2016 1:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(పొగతోట):
స్మార్ట్ పల్స్ సర్వే(ప్రజా సాధికార సర్వే) ఈ నెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. సర్వేలో ప్రజల ఫింగర్ ఫ్రింట్స్ సేకరించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సర్వే సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల వివరాలు సర్వేలో నమోదు చేయాలన్నారు. చంద్రన్న బీమా పథకం పక్కగా అమలు చేయాలన్నారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో 46 మండలాలు ఉన్నాయని, 32 మండలాల్లో వంద శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో విక్రమ సింహపురి వైస్ చాన్స్‌లర్ వీరయ్య, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఆర్‌డీఓలు పాల్గొన్నారు.
అధికారులతో జేసీ సమావేశం
ప్రజా సాధికార సర్వే పై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ తన చాంబర్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 24వ తేదీలోపు సర్వే వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఓ పీబీకే మూర్తి, గూడూరు సబ్ కలెక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement