మూడు రోజుల్లో ‘సర్వే’ పూర్తిచేయాలి | Smart pulse survey to be completed in three days | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో ‘సర్వే’ పూర్తిచేయాలి

Published Thu, Nov 24 2016 1:22 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM

మూడు రోజుల్లో ‘సర్వే’ పూర్తిచేయాలి - Sakshi

మూడు రోజుల్లో ‘సర్వే’ పూర్తిచేయాలి

  • 300మంది రెవెన్యూ సిబ్బందితో స్పెషల్‌ టీం ఏర్పాటు
  • పల్స్‌సర్వేపై కలెక్టర్‌ అసహనం
  • నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ప్రజాసాధికారిక సర్వే పై కలెక్టర్‌ మత్యాలరాజు అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో సర్వేను పూర్తిచేయాలని, అధనంగా 46మండలాల నుంచి 300 మంది స్పెషల్‌ టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం పల్స్‌సర్వే అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్‌కలెక్టర్‌ ఇంతియాజ్, ఆత్మకూరు ఆర్డీఓ వెంకటేశ్వరరావు, కమిషనర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముత్యాలరాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు 4లక్షల మందికి సర్వే చేపట్టడం జరిగిందని, మరో 3లక్షలు మంది సర్వేలో నమోదు చేయాల్సి ఉందన్నారు. అందుకుగాను స్పెషల్‌ టీంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిషనర్‌ వెంకటేశ్వర్లును ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పల్స్‌సర్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement