దత్తత గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
దత్తత గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
Published Thu, Dec 1 2016 11:40 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు మండలంలోని మహిమలూరు, ఏఎస్‌పేట మండలంలోని చిరమన గ్రామాలను కేంద్ర రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డీఆర్‌డీఏ డైరెక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి, గ్లోబెల్ ఆస్పత్రి నిర్వాహకులు రవీంద్రనాయుడులు దత్తత తీసుకున్నారని, వారి సహకారంతో గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలనిఽ జేసీ ఇంతియాజ్ అహ్మద్ కోరారు. గురువారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో కావాల్సిన మౌలిక వసతులను గుర్తించి జాబితాను ఉన్నతాధికారులకు అందచేయాలన్నారు. మహిమలూరు గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం, శ్మశానవాటిక అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రాథమిక పాఠశాల, దళిత కాలనీలోని మరో పాఠశాలకు ప్రహరీగోడల నిర్మాణం, నూతన పశువైద్యశాల భవనం, రైతులు ధాన్యం దాచుకునేందుకు గోదాముల నిర్మాణం తదితర పనులకు రూ.2.48 కోట్లు అంచనాలు తయారుచేశారని, వాటిని ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మహిమలూరులో జరిగిన పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌డీఓ ఎం.వెంకటరమణ, ముఖ్య ప్రణాళికాధికారి వెంకయ్య, ఆర్‌డబ్ల్యూఽఎస్ ఈఈ ఆర్‌వీ రామిరెడ్డి, డీఈ సీహెచ్ శ్రీనివాసరావు, ఏపీడీ మృదుల, పంచాయతీరాజ్ డీఈ, ఏఈలు, గ్రామ నాయకులు చిట్టమూరు రవీంద్రారెడ్డి, నిజమాల నరసింహులు, ఉప మండలాధ్యక్షుడు తోట కృష్ణయ్య, సర్పంచ్ రఘురామిరెడ్డి తదితరులున్నారు.
Advertisement