అర్జీలను సకాలంలో పరిష్కరించండి | peoples grievances to be redressed quickly | Sakshi
Sakshi News home page

అర్జీలను సకాలంలో పరిష్కరించండి

Oct 11 2016 2:08 AM | Updated on Oct 20 2018 6:19 PM

అర్జీలను సకాలంలో పరిష్కరించండి - Sakshi

అర్జీలను సకాలంలో పరిష్కరించండి

నెల్లూరు(పొగతోట): ప్రజలు సమర్పించిన వినతులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ అధికారులను ఆదేశించారు.

 
నెల్లూరు(పొగతోట): ప్రజలు సమర్పించిన వినతులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌ హాల్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించిన వినతుల వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చాలని సూచించారు. జేసీ – 2 రాజ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డయల్‌ యువర్‌ కలెక్టర్‌
డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 12 మంది ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ముత్యాలరాజు సెలవులో ఉండటంతో జేసీ ఇంతియాజ్‌ డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ సమస్యలు, పింఛన్లు, తదితరాలపై ఫిర్యాదులు అందాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement