grievances
-
సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలు ఫిర్యాదులను తగిన విధంగా పరిష్కరించడం లేదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అ న్నారు. ఐటీ నిబంధనలను సవరించే ముసాయిదా నోటిఫికేషన్‌పై భాగస్వాములతో మంత్రి చర్చ నిర్వహించారు. సవరించిన నిబంధనల కింద ప్రభు త్వం గ్రీవెన్స్ ప్యానెల్‌ను ప్రతిపాదించడం గమనార్హం. ‘‘గ్రీవెన్స్ ఆఫీసర్, జవాబుదారీకి చోటు కలి్పంచాం. 2021 ఫిబ్రవరికి ముందు ఇది లేదు. సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్‌లు గ్రీవెన్స్ ఆఫీసర్లను ని యమిస్తున్నాయి. కానీ, నిజమైన ఫిర్యాదుల పరిష్కారం ఉండడం లేదు. దీన్ని పరిష్కరించాల్సి ఉంది’’అని మంత్రి చెప్పారు. భారత చట్టాల పరిధిలో నిబంధనల ఉల్లంఘనపై వచ్చే ఫిర్యా దులకు సామాజిక మాధ్యమ వేదికలు సరిగ్గా స్పందించాలని సూచించారు. అలాగే, వివక్ష చూపించకూడదని, మాట్లాడే స్వేచ్ఛ, గోప్యత, పౌరుల హక్కులకు వ్యతిరేకంగా పనిచేయరాదని సూచించారు. ప్రభుత్వం ఇటీవలే గ్రీవెన్స్ అప్పీలేట్ బాడీని ప్రతిపాదించడం తెలిసిందే. యూజర్లు సోషల్ మీడియా సంస్థల గ్రీవెన్స్ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ అప్పీల్ చేసుకోవచ్చు. -
సోషల్ మీడియాకు కేంద్రం కళ్లెం!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలకు సంబంధించి యూజర్లు చేసే ఫిర్యాదులను ఇకపై ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. నిబంధనల మేరకు వాటికి పరిష్కారం చూపాల్సిందే. యూజర్ల హక్కులను గౌరవించాల్సిందే. ఇందుకు వీలుగా..సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల గ్రీవెన్స్ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాలపై యూజర్లు అప్పీల్‌కు వెళ్లేందుకు గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తమ ముందుకు వచ్చిన అప్పీల్స్‌ను 30 రోజుల్లోపు అప్పిలేట్ కమిటీ పరిష్కరించాల్సి ఉంటుంది.కమిటీ నిర్ణయాలను సోషల్ మీడియా సంస్థలు అమలు చేయాలని సవరించిన ఇన్ఫర్మేషట్ టెక్నాలజీ ముసాయిదా నిబంధనలు, 2021 నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. నిబంధనలను ఉల్లంఘించారంటూ సోషల్ మీడియా వేదికలు కొందరు సెలబ్రిటీలు, ఇతరుల ఖాతాలను బ్లాక్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ తాజా చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువే గ్రీవెన్స్ కమిటీలను ఏర్పాటు చేయవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ తెలిపింది. ప్రతిపాదిత నిబంధనల కింద సోషల్ మీడియా గ్రీవెన్స్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయంపై బాధిత వ్యక్తి 30 రోజుల్లోపు అప్పీలేట్ కమిటీ ముందు సవాల్ చేయవచ్చు.ఈ ముసాయిదా నిబంధనలపై జూన్ 22 వరకు అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అనంతరం వీటిని అమల్లోకి తీసుకురానుంది. సోషల్ మీడియా సంస్థలకు 2021 మే 26 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రావడం తెలిసిందే. దీని కింద 50 లక్షలు అంతకుమించి యూజర్లు ఉన్న సంస్థలు తమ ప్లాట్ఫామ్లో ఏదైనా ఒక సందేశం మొదట ఎక్కడ ఆరంభమైందో గుర్తించాల్సి ఉంటుంది. అలాగే, ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, నిబంధనల అమలును చూసేందుకు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించాలని నాటి నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
గురుకుల నియామకాల్లో ‘ఔట్సోర్సింగ్’ అవినీతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నియామక సమయంలో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో అత్యధికంగా ఉద్యోగులు గురుకుల పాఠశాలల్లోనే నియామకమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో దాదాపు 8 వేల మంది ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యారు. కాంట్రాక్టు సిబ్బందికి సొసైటీలే నేరుగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోగా.. వంట సిబ్బంది, వాచ్మెన్, జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లోని పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే భర్తీ చేశారు. ఫిర్యాదులతో కదిలిన సొసైటీలు ఈ నియామకాల క్రమంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఇటీవల గురుకుల సొసైటీలకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై స్పందించిన సొసైటీ యంత్రాంగం ఒకట్రెండు చోట్ల క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగు చూశాయి. ప్రతి కేటగిరీలో 2 నెలల నుంచి 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు తేలింది. దీంతో కంగుతిన్న యంత్రాంగం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొత్త గురుకుల పాఠశాలల్లో నియమించిన ప్రతి ఉద్యోగి నుంచి సమాచారం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. రూ.లక్ష వరకు వసూలు గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ క్రమంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు పెద్దమొత్తంలో వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వేర్వేరు జిల్లాలకు చెందిన దాదాపు 12 మంది ఉద్యోగులు ఇలా సొసైటీ కార్యదర్శులకు లేఖలు సమర్పించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు వారు అందులో పేర్కొన్నారు. కొంత మంది కిందిస్థాయి (వాచ్మెన్) ఉద్యోగుల దగ్గర 3 నెలల వేతనం, మరికొందరి దగ్గర 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదులపై సొసైటీ అధికారులు ప్రాథమికంగా విచారణ చేపట్టగా పై అంశాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాల తంతు బయటపడే అవకాశముంది. -
చెల్లి వెంటే.. అన్న
- సోదరితో యువకుడి అసభ్యప్రవర్తన - మనస్తాపంతో బావిలో దూకిన చెల్లెలు - ఆమెను రక్షించే క్రమంలో అన్న దుర్మరణం బంట్వారం(వికారాబాద్): చెల్లెలితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు.. మనోవేదనకు గురైన ఆమె బావిలో దూకింది. సోదరిని రక్షించేందుకు అన్న సైతం బావిలో దూకాడు. అతడికి ఈత వచ్చినా.. సమాంతరంగా ఉన్న బావిలో సరైన పట్టు దొరకకపోవడం.. భయాందోళనకు గురైన చెల్లెలు అతడిని గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీట మునిగి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం తొర్మామిడికి చెందిన అగ్గనూరు కిష్టయ్య, పార్వతమ్మ దంపతులకు కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు అనిత(17) తాండూరులోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు సంగమేశ్ (20) ఐటీఐ పూర్తి చేసి చిన్నాచితకా పను లు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. అయితే, శుక్రవారం అనిత కాలేజీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆమె బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు దిలీప్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మనోవేదనకు గురైన ఆమె సమీపంలో ఉన్న బావిలో దూకేసింది. చెల్లిని కాపాడబోయిన అన్న.. అనితతో దిలీప్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలుసుకున్న ఆమె అన్న సంగమేశ్ చెల్లెలు వద్దకు రాగా అంతలోనే అనిత అక్కడే ఉన్న ఓ వ్యవసాయ బావిలో దూకేసింది. తన కళ్ల ముందే చెల్లెలు బావిలో దూకడంతో సంగమేశ్ నిర్ఘాంతపోయాడు. చెల్లిని కాపాడేందుకు అతడు కూడా బావిలో దూకాడు. సంగమేశ్‌కు ఈత వచ్చినప్పటికీ బావి సమాంతరంగా ఉండటంతో అతడికి పట్టు దొరకలేదు. తీవ్ర భయాందోళనకు గురైన అనిత బావిలో అన్నను గట్టిగా పట్టుకుంది. దీంతో అన్నాచెల్లెలు బావిలో నీటమునిగి మృత్యువాత పడ్డారు. ధారూరు సీఐ ఉపేందర్ ఘటనా స్థలానికి చేరుకుని అదేరోజు రాత్రి అనిత, సంగమేశ్ల మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. శనివారం స్థానిక యువకుడు అతికష్టం మీద అనిత, సంగమేశ్ మృతదేహాలను బయటకు తీశాడు. మృతుల కుటుంబీ కుల ఫిర్యాదు మేరకు దిలీప్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. ఆదుకుంటావనుకున్నం కొడుకా.. అన్నాచెల్లెలు అనిత, సంగమేశ్ మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కిష్టయ్య, పార్వతమ్మ దంపతులు రోదనలు మిన్నంటాయి. చేతికి అందివచ్చిన కొడుకు మృత్యువాత పడటంతో గుండెలు బాదుకుంటూ రోదించారు. ఆదుకుంటావనుకున్నం కొడుకా.. ఆ దేవుడు ఎంత పనిచేశాడు.. నిన్ను మా నుంచి దూరం చేశాడని విలపించారు. కుమార్తె అనితను తలచుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఉన్నత చదువు చదివి ఉద్యోగం చేస్తావనుకున్నాం తల్లీ.. ఎంత పనిచేశావమ్మా.. అంటూ ఆమె మృతదేహంపై పడి రోదించిన తీరు అందరినీ కదిలించింది. -
అర్జీలకు సత్వర పరిష్కారం
జేసీ ఇంతియాజ్ ఆహ్మద్ ఓజిలి : అర్జీదారులు వినతలకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆహ్మద్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామపంచాయతీలు నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు హాజరయ్యారు. గ్రీవెన్స్‌సెల్‌కు 220 వినతులు అందాయలని తహసీల్దార్ చెంచుకృష్ణమ్మ తెలిపారు. గుర్రంకొండ గ్రామంలో పొలాల్లోకి వెళ్లే దారి, డొంకను నాయుడుపేటకు చెందిన ఓ కోపల్లి హనుమంతునాయుడు ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేశారు. మేత పోరంబోకు భూమి రెండెకరాలు ఆక్రమించి పంటలు సాగు చే స్తూ దళితులను దారులో పోనీకుండా అడ్డుకుంటూ తమపై కేసులు పెడుతున్నాడని విన్నవించారు. దళితులపై కేసులు పెట్టిన వ్యక్తిని రెవెన్యూ అధికారులు ఎందుకు వెనకేసుకుని వస్తున్నారని జేసీ ప్రశ్నించారు. దళితులను భూములలోకి వెళ్లకుండా డొండను ఆక్రమించిన వ్యక్తిపై కేసులు పెట్టాలని తహశీల్దార్ చెంచుకృష్ణమ్మ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో ఆయన సమావేశం నిర్వహించారు. వెంటనే అర్జీలకు పరిష్కారం చూపి ప్రతి అర్జీను కంప్యూటర్లో పొందుపరచాలన్నారు. ఆర్డీఓ శీనానాయక్, ఎంపీడీఓ పీవీ నారాయణ, ఇరిగేషన్ డీఈ కోటేశ్వర్రావు, హోసింగ్ ఏఈ సత్యనారాయణ, వీఆర్వోలు, ఐసీడీఎస్ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అర్జీలను సకాలంలో పరిష్కరించండి
నెల్లూరు(పొగతోట): ప్రజలు సమర్పించిన వినతులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. డయల్ యువర్ కలెక్టర్‌కు వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించిన వినతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. జేసీ – 2 రాజ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డయల్ యువర్ కలెక్టర్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 12 మంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ముత్యాలరాజు సెలవులో ఉండటంతో జేసీ ఇంతియాజ్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ సమస్యలు, పింఛన్లు, తదితరాలపై ఫిర్యాదులు అందాయి. -
కొడుకు.. మాట వినడం లేదని..
♦ రైలుకిందపడేందుకు యత్నించిన తండ్రి ♦ గమనించి వారించిన ‘సాక్షి’ విలేకరి వికారాబాద్ రూరల్: రెక్కలుముక్కలు చేసుకొని పెంచుకున్న కొడుకులు మాట వినడం లేదని మనోవేదనకు గురైన ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. రైలు కిందపడేందుకు పట్టాలపైకి వెళ్లగా ‘సాక్షి’ విలేకరి వారించడంతో తన ప్రయత్నం విరమించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లికి చెందని అర్జున్(38) దంపతులు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో ఉంటూ తమ ఇద్దరు కుమారులను ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటున్నారు. బాలురిద్దరు హాస్టల్లో ఉంటున్నారు. చిన్న కుమారుడు అనంత్ 6వ తరగతి చదువుతూ చెడుమార్గం పట్టాడు. పాఠశాలకు వెళ్లకుండా డుమ్మా కొట్టడంతో తండ్రి అర్జున్ వారించినా ఫలితం లేకుండా పోయింది. అనంత్ విషయంలో జనం అర్జున్‌కు ఫిర్యాదు చే స్తూ ఆయనను మందలించసాగారు. అర్జున్ కుమారుడి బాగు కోరి హితవు పలికితే.. ‘మీరు నన్ను ఏమైనా అంటే చనిపోతాను..’ అంటూ అతడు తల్లిదండ్రులను బెదిరించసాగాడు. ఏం చేయాలో దిక్కుతోచక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు అర్జున్. సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడేందుకు రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో స్థానిక ‘సాక్షి’ విలేకరి వార్తల సేకరణ కోసం అటుగా వెళ్లడంతో అర్జున్ పట్టాలపై ఏడుస్తూ కనిపించాడు. దగ్గరకు వెళ్లి ఆరా తీయగా భోరున పిలిపించి అనంతరం జరిగిన విషయం చెప్పాడు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని విలేకరి ఆయనకు ధైర్యం చెప్పాడు. తాము రెక్కలుముక్కలు చేసుకొని కొడుకులను చదివిస్తున్నామని, కొడుకు మాట వినడం లేదని, పలువురు అతడిపై తనకు ఫిర్యాదు చేయడంతో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని తన బాధ వెల్లగక్కాడు. అనంతరం అర్జున్ను తన భార్యవద్దకు తీసుకెళ్లగా ఇద్దరు కన్నీటిపర్యంతమయ్యారు. కాస్త ఆలస్యమైతే తన భర్త దక్కేవాడు కాదని అర్జున్ భార్య తెలిపింది. -
మనోవేదన భరించలేక బలవన్మరణం
తొట్టంబేడు : ‘నాయునా.. మీ తండ్రి చనిపోరుునప్పటినుంచి నాకు పసుపు కుంకువులు లేవని దిగులుపట్టుకుంది. నావల్ల కావడం లేదు. ప్రసన్న ఆడపిల్ల కావడం వల్ల నీ చెల్లెల్ని కూడా నాతో పాటు తీసుకెళుతున్నా. మేవుు చనిపోతున్నాం. నా గురించి దిగులు పడవద్దు. నా వురణానంతరం నీవు బాగా చదివి ప్రయోజకుడివై నీతివుంతుడిగా బతుకు’ అంటూ ఓ తల్లి రాసిన సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తనకు తోడూ నీడగా ఉంటాడని ప్రతిజ్ఞ చేసిన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోరుుంది. కువూర్తెను తోడుగా తీసుకెళ్లాలని ఆత్మహత్యకు ఒప్పిం చింది. తల్లి, కూతురు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన శనివారం శ్రీకాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్ఐ రావుకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నారుు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన గొల్లపూడి శ్రీనివాసులు, లక్ష్మి దంపతులు రెండేళ్ల క్రితం శ్రీకాళహస్తి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. లక్ష్మి తండ్రి సుబ్బారావు పనిచేస్తున్న ఓ సత్రంలోనే ఆ కుటుంబం నివసిస్తుండేది. వీరికి బాలాజీ(16), జ్ఞాన ప్రసన్న(14) సంతానం. ఈ నెల 5న శ్రీనివాసులు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. అప్పటి నుంచి లక్ష్మికి భర్త తోడు లేడనే దిగులుపట్టుకుంది. భర్త తోడు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయుని, సవూజంలో చిన్నచూపు చూస్తారని, కువూర్తె పెళ్లి, జీవితం ఎలా సాగుతాయోననే వేదన కలిగింది. ఇటీవలే భర్త అంత్యక్రియులు కూడా చేసిన లక్ష్మి సంప్రదాయుం ప్రకారం ఇంట్లో ఓ రాత్రి నిద్రపోవాలని భావించింది. ఈ నేపథ్యంలో తండ్రి సుబ్బారావు పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన ఇంటికి కువూర్తెను తీసుకుని శుక్రవారం వెళ్లిం ది. అదేరోజు అర్ధరాత్రి కువూర్తెను ఆత్మహత్యకు ఒప్పించి సూసైడ్ నోట్ రాసింది. ఎల్ఐసీ, సిండికేట్ బ్యాంకులలో ఆమె పేరుతో రావాల్సిన నగదు కువూరుడికి చెందాలని వురో రెండు లేఖలు రాసి పెట్టింది. తల్లి, కూతురు ఇంటి పైకప్పుకున్న కమ్మీలకు ఉరేసుకుని మృతి చెందారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, శనివారం అంటే తనకు చాలా ఇష్టవుని, శనివారం రోజే అంత్యక్రియులు జరిపించాలని సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. అంతేకాకుండా అంత్యక్రియలకు వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు సహకరించాలని కోరింది. కువూరుడి బాగోగులు బంధువులు చూసుకోవాలని, వారికి రుణపడి ఉంటానని పేర్కొంది. శనివారం తెల్లవారుజావుున స్థానికులు తల్లి, కూతురు ఉరేసుకుని మృతిచెంది ఉండటాన్ని చూసి టూటౌన్ పోలీసులకు సవూచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రావుకృష్ణ బృందం చుట్టు పక్కల విచారించి సుసైడ్నోట్లతోపాటు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టువూర్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియూ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞాన ప్రసన్న పట్టణంలోని ఓ ఇంగ్లిష్ మీడియుం స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతుండేది. బాలాజీ పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియుర్ చదువుతున్నాడు. తల్లీకూతురు ఆత్మహత్య శనివారం శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనం రేపింది.