మనోవేదన భరించలేక బలవన్మరణం
తొట్టంబేడు : ‘నాయునా.. మీ తండ్రి చనిపోరుునప్పటినుంచి నాకు పసుపు కుంకువులు లేవని దిగులుపట్టుకుంది. నావల్ల కావడం లేదు. ప్రసన్న ఆడపిల్ల కావడం వల్ల నీ చెల్లెల్ని కూడా నాతో పాటు తీసుకెళుతున్నా. మేవుు చనిపోతున్నాం. నా గురించి దిగులు పడవద్దు. నా వురణానంతరం నీవు బాగా చదివి ప్రయోజకుడివై నీతివుంతుడిగా బతుకు’ అంటూ ఓ తల్లి రాసిన సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తనకు తోడూ నీడగా ఉంటాడని ప్రతిజ్ఞ చేసిన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోరుుంది. కువూర్తెను తోడుగా తీసుకెళ్లాలని ఆత్మహత్యకు ఒప్పిం చింది.
తల్లి, కూతురు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన శనివారం శ్రీకాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్‌ఐ రావుకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నారుు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన గొల్లపూడి శ్రీనివాసులు, లక్ష్మి దంపతులు రెండేళ్ల క్రితం శ్రీకాళహస్తి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. లక్ష్మి తండ్రి సుబ్బారావు పనిచేస్తున్న ఓ సత్రంలోనే ఆ కుటుంబం నివసిస్తుండేది.
వీరికి బాలాజీ(16), జ్ఞాన ప్రసన్న(14) సంతానం. ఈ నెల 5న శ్రీనివాసులు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. అప్పటి నుంచి లక్ష్మికి భర్త తోడు లేడనే దిగులుపట్టుకుంది. భర్త తోడు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయుని, సవూజంలో చిన్నచూపు చూస్తారని, కువూర్తె పెళ్లి, జీవితం ఎలా సాగుతాయోననే వేదన కలిగింది. ఇటీవలే భర్త అంత్యక్రియులు కూడా చేసిన లక్ష్మి సంప్రదాయుం ప్రకారం ఇంట్లో ఓ రాత్రి నిద్రపోవాలని భావించింది. ఈ నేపథ్యంలో తండ్రి సుబ్బారావు పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన ఇంటికి కువూర్తెను తీసుకుని శుక్రవారం వెళ్లిం ది. అదేరోజు అర్ధరాత్రి కువూర్తెను ఆత్మహత్యకు ఒప్పించి సూసైడ్ నోట్ రాసింది.
ఎల్‌ఐసీ, సిండికేట్ బ్యాంకులలో ఆమె పేరుతో రావాల్సిన నగదు కువూరుడికి చెందాలని వురో రెండు లేఖలు రాసి పెట్టింది. తల్లి, కూతురు ఇంటి పైకప్పుకున్న కమ్మీలకు ఉరేసుకుని మృతి చెందారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, శనివారం అంటే తనకు చాలా ఇష్టవుని, శనివారం రోజే అంత్యక్రియులు జరిపించాలని సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. అంతేకాకుండా అంత్యక్రియలకు వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు సహకరించాలని కోరింది. కువూరుడి బాగోగులు బంధువులు చూసుకోవాలని, వారికి రుణపడి ఉంటానని పేర్కొంది.
శనివారం తెల్లవారుజావుున స్థానికులు తల్లి, కూతురు ఉరేసుకుని మృతిచెంది ఉండటాన్ని చూసి టూటౌన్ పోలీసులకు సవూచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రావుకృష్ణ బృందం చుట్టు పక్కల విచారించి సుసైడ్‌నోట్‌లతోపాటు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టువూర్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియూ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞాన ప్రసన్న పట్టణంలోని ఓ ఇంగ్లిష్ మీడియుం స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతుండేది. బాలాజీ పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియుర్ చదువుతున్నాడు. తల్లీకూతురు ఆత్మహత్య శనివారం శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనం రేపింది.