సాధికార సర్వే 40 శాతం పూర్తి
మనుబోలు:
జిల్లాలో సాధికార సర్వే ఇప్పటి వరకు 40 శాతమే పూర్తయిందని జేసీ ఇంతయాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం మనుబోలు దళితవాడలో జరుతున్న స్మార్ట్ పల్స్ సర్వేను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జూలై 12 నుంచి జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మొదట్లో చాలా ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం అన్ని సర్ధుకున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్స్ సర్వేలో 2,198 మంది ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 28 వేల కుటుంబాలను సర్వే చేసినట్లు తెలిపారు. ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా సర్వేకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. రోజుకు 30 కుటుంబాలను సర్వే చేస్తున్న పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, వీఆర్వో నాగార్జునరెడ్డిలను అభినందించారు.
చెట్ల పంపకంతోనే కాలుష్య నివారణ
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని జేసీ ఇంతయాజ్ అహ్మద్ అన్నారు. కుడితిపల్లిలో వనం–మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ మొక్కలు నాటాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ హేమలత, ఆర్‌ఐ కవిత ఉన్నారు.