స్మార్ట్ పల్స్ సర్వే 60 శాతం పూర్తి
నెల్లూరు(పొగతోట):
ప్రజా సాధికార సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే) ఇప్పటి వరకు జిల్లాలో 60 శాతం పూర్తయిందని జేసీ ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో స్మార్ట్ పల్స్ సర్వేపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్నారన్నారు. 1976 మంది ఎన్యూమరేటర్ల ద్వారా ఇప్పటి వరకు 16.59 లక్షల జనాభాకు సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. సర్వేపై ఆటోల ద్వారా ప్రచారం కల్పించి ఈ నెలఖారుకు వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సర్వే వలన ప్రజలకు ఎటువంటి నష్టం జరగదన్నారు.