31లోపు సర్వే పూర్తి చేయండి | Smart pulse survey to be completed by 31st | Sakshi
Sakshi News home page

31లోపు సర్వే పూర్తి చేయండి

Published Wed, Oct 26 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

31లోపు సర్వే పూర్తి చేయండి

31లోపు సర్వే పూర్తి చేయండి

  • జేసీ ఇంతియాజ్‌
  •  
    నెల్లూరు(పొగతోట):
    ప్రజా సాధికార సర్వే (స్మార్ట్‌ పల్స్‌ సర్వే)ను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసేలా  చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రజలందరూ 31వ తేదీలోపు తమ పేర్లను సర్వేలో నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్‌ పల్స్‌ సర్వేలో పేర్లు నమోదు చేయించుకున్నందు వలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమగ్రంగా పొందవచ్చునని తెలిపారు. 31వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోని వారి కోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్‌ 1, 2 తేదీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్లలో వారు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. పేర్లు నమోదు కాని వారు కేంద్రాలకు వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు అందజేయాలని తెలిపారు. అంతకుముందు ప్రజా సాధికార సర్వే, భూ సమస్యలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై సీసీఎల్‌ఏ అనిల్‌చంద్రపునేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement