సచిన్‌ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి | Full arrangements for Sachin tour | Sakshi
Sakshi News home page

సచిన్‌ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Published Wed, Nov 16 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

సచిన్‌ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

సచిన్‌ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

  • జేసీ ఇంతియాజ్‌
  • నెల్లూరు(పొగతోట):
    సచిన్‌ టెండుల్కర్‌ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేసీ ఏ.మహమ్మద్‌ ఇంతియాజ్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 16న సచిన్‌ గూడూరు మండలం పుట్టంరాజువారీకండ్రిగ గ్రామంలో పర్యటిస్తారన్నారు. 2014 నవంబర్‌ 16వ తేదీన సచిన్‌   గ్రామాన్ని దత్తత తీసుకున్నారన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు రూ.6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఎంపీ లాండ్స్‌ నుంచి రూ.2.80 కోట్లు, రూ.3.20 కోట్ల జిల్లా నిధులు కేటాయించామన్నారు. అండర్‌ డ్రైనేజ్, మంచినీటి సరఫరా, విద్యుత్, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, క్రీడామైదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండో విడతలో గోల్లపల్లి, నెర్నూరు గ్రామాలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు గ్రామంలో జాబ్‌మేళా నిర్వహించినట్లు చెప్పారు. గృహ నిర్మాణాల్లో కొద్దిగా జాప్యం జరిగిందన్నారు. సచిన్‌ ఉదయం 11.30 గంటలకు  గ్రామానికి చేరుకుంటారన్నారు. కమ్యూనిటీ హాల్‌ ప్రారంభించి స్వచ్ఛభారత్‌పై అధికారులతో చర్చిస్తారన్నారు. అనంతరం స్థానికులను వారి వారి ఇళ్ల వద్ద మాట్లాడతారన్నారు. క్రీడామైదానంలో బహిరంగ సభలో సచిన్‌ ప్రసంగిస్తారన్నారు.  
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement