puttamraju kandirga
-
పుట్టంరాజు కండ్రిగలో సచిన్
-
పీఆర్ కండ్రిగకు నేడు సచిన్ రాక
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ముత్యాలరాజు అన్ని శాఖల అధికారులతో సమావేశం గూడూరు: రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం ఆయన దత్తత గ్రామమైన గూడూరు రూరల్ పరిధిలోని పుట్టమరాజువారి కండ్రిగకు రానున్నారు. ఈ మేరకు ఆ గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ముత్యాలరాజు ఇతర అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ చెన్నై విమానాశ్రయం నుంచి సచిన్ ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఉదయం 11.30 గంటలకు గూడూరు-తిరుపతి రహదారి పక్కనే చెమిర్తి రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా గ్రామంలో నూతనంగా ఏర్పాటైన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం రెండేళ్ల క్రితం తాను కలుసుకున్న గోపాలయ్య, విజయమ్మల కుటుంబ సభ్యులతో వారి ఇంటి వద్దకే వెళ్లి మాట్లాడుతారన్నారు. పక్కనే ఉన్న పాఠశాల్లోని విద్యార్థులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తారని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఉన్న సభా స్థలికి చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ 12.55 గంటలకు పూర్తి చేసుకుని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఆయన వెంట జేసీ ఇంతియాజ్, ఆర్డీఓ వెంకటసుబ్బయ్య, తహసీల్దార్ సత్యవతి తదితరులున్నారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన గూడూరు రూరల్ పరిధిలోని పుట్టమరాజువారికండ్రిగలో సచిన్ టెండూల్కర్ బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో ఽభద్రతా ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాస్‌తోపాటు ఏఆర్ డీఎస్పీ చెంచురెడ్డి, ఎస్బీ డీఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈ పర్యటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బారికేడ్స్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. నలుగురు డీఎస్పీలు, 9 మంది సీఐలతోపాటు పలువురు ఎస్సైలు, పోలీస్ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తూ పఠిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై బాబి ఉన్నారు. -
సచిన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): సచిన్ టెండుల్కర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేసీ ఏ.మహమ్మద్ ఇంతియాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 16న సచిన్ గూడూరు మండలం పుట్టంరాజువారీకండ్రిగ గ్రామంలో పర్యటిస్తారన్నారు. 2014 నవంబర్ 16వ తేదీన సచిన్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు రూ.6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఎంపీ లాండ్స్ నుంచి రూ.2.80 కోట్లు, రూ.3.20 కోట్ల జిల్లా నిధులు కేటాయించామన్నారు. అండర్ డ్రైనేజ్, మంచినీటి సరఫరా, విద్యుత్, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, క్రీడామైదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండో విడతలో గోల్లపల్లి, నెర్నూరు గ్రామాలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు గ్రామంలో జాబ్‌మేళా నిర్వహించినట్లు చెప్పారు. గృహ నిర్మాణాల్లో కొద్దిగా జాప్యం జరిగిందన్నారు. సచిన్ ఉదయం 11.30 గంటలకు గ్రామానికి చేరుకుంటారన్నారు. కమ్యూనిటీ హాల్ ప్రారంభించి స్వచ్ఛభారత్‌పై అధికారులతో చర్చిస్తారన్నారు. అనంతరం స్థానికులను వారి వారి ఇళ్ల వద్ద మాట్లాడతారన్నారు. క్రీడామైదానంలో బహిరంగ సభలో సచిన్ ప్రసంగిస్తారన్నారు. -
రేపు నెల్లూరు జిల్లాకు సచిన్
-
రేపు నెల్లూరు జిల్లాకు సచిన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ బుధవారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. గూడూరు మండలంలో తాను దత్తత తీసుకున్న పుట్టమరాజు వారి కండ్రిగ గ్రామంలో పర్యటించనున్నారు. సచిన్ 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టమరాజు వారి కండ్రిగకు చేరుకుంటారు. అనంతరం గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై ప్రజలు, అధికారులతో చర్చించనున్నారు. కాగా తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ఇదిలా ఉండగా సచిన్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులు గత వారం రోజులుగా గ్రామంలో పర్యవేక్షిస్తున్నారు. -
పోటీతత్వంతో ముందుకెళ్లాలి
జేసీ ఇంతియాజ్ గూడూరు: నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో ముందుకెళ్లాలని జేసీ ఇంతియాజ్ అన్నారు. గూడూరు రూరల్ పరిధిలోని సచిన్ దత్తత గ్రామమైన పుట్టంరాజువాని కండ్రిగలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా జరిగింది. కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా, ఏం చేస్తున్నా పోటీ అనేది తప్పడం లేదన్నారు. ఉద్యోగం సాధించడానికి పోటీ తప్పదనుకుంటే అది సాధించాక కూడా విధి నిర్వహణలో కూడా ఆ పోటీ తప్పడం లేదన్నారు. సచిన్ దత్తత గ్రామంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని, గ్రామాభివృద్దే కాకుండా ఆ గ్రామంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ జీవనోపాధి కల్పించడం కూడా చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు కృష్ణపట్నం పోర్టు, హిందూస్థాన్, గమీషా, మీనాక్షి, సింహపురి, శ్రీసిటి లాంటి 38 కంపెనీలకు చెందిన ప్రతినిధులచే ఈ జాబ్ మేళా నిర్వహించి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇన్చార్జి ఆర్డీఓ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జిల్లాలోని నలు మూలల నుంచి సుమారు 1500 మందికి పైగా నిరుద్యోగ యువతీయువకులు ఈ జాబ్ మేళాకు వచ్చారని తెలిపారు. డీఆర్డీ ఏపీడీ లావణ్యవేణి, సర్పంచ్ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బొమ్మిరెడ్డి పద్మ, ఎంపీటీసీ పెంచలరావు, తహసీల్దార్ భవానీ, హౌసింగ్ డీఈ నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.