రేపు నెల్లూరు జిల్లాకు సచిన్ | Sachin to vist Puttamraju Kandriga | Sakshi
Sakshi News home page

రేపు నెల్లూరు జిల్లాకు సచిన్

Published Tue, Nov 15 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

రేపు నెల్లూరు జిల్లాకు సచిన్

రేపు నెల్లూరు జిల్లాకు సచిన్

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ బుధవారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. గూడూరు మండలంలో తాను దత్తత తీసుకున్న పుట్టమరాజు వారి కండ్రిగ గ్రామంలో పర్యటించనున్నారు. సచిన్ 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టమరాజు వారి కండ్రిగకు చేరుకుంటారు. అనంతరం గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు.

గ్రామ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై ప్రజలు, అధికారులతో చర్చించనున్నారు. కాగా తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ఇదిలా ఉండగా సచిన్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులు గత వారం రోజులుగా గ్రామంలో పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement