పరిశ్రమలకు సకాలంలో అనుమతులు
నెల్లూరు(పొగతోట): పరిశ్రమలకు అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పరిశ్రమల ప్రోత్సాహక కమిటీని ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. 48 పరిశ్రమల అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించారు. 19 పరిశ్రమలకు రాయితీల విషయమై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ పరిశ్రమల అనుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.
ఈ నెల 22న నాయుడుపేట, 29న ఆత్మకూరులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ముత్తుకూరులో యూఎంపీపీ పవర్‌ప్రాజెక్ట్ నిర్మాణంలో గృహాలు కోల్పోయిన ముగ్గురు నిర్వాసితులు దువ్వూరు సుబ్బరత్నమ్మకు రూ.2,50,793, వెంకటేశ్వర్లు, సంపత్‌కుమార్‌కు ఒక్కొక్కరికి రూ43,050 వంతున చెక్కులు అందజేశారు. ఈ సమావేశంలో డీఈసీ జనరల్ మేనేజర్ వైఎల్ ప్రదీప్‌కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఒమ్మిన సుబ్రహ్మణ్యం, కాలుష్య నియంత్రణాధికారి ప్రమోద్‌కుమార్, పరిశ్రమల ఏడీ సురేష్, ఎల్డీఎం వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.