అవయవదానంతో పునర్జన్మ
నెల్లూరు(అర్బన్): అవయవదానంతో పునర్జన్మను పొందవచ్చని జేసీ 2 రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పుర స్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, సెట్నల్ ఆధ్వర్యంలో నగరంలోని రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు జేసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదాల బారిన పడి బ్రెయిన్‌డెడ్ అయిన వారు అవయవదానంతో 8 మందికి పునర్జన్మను ఇవ్వొచ్చని తెలిపారు. అవయవదానాన్ని ప్రోత్సహించాలని కోరారు. అనంతరం అవయవ దానం చేసిన నారాయణమ్మ, సుభాషిణి కుటుంబసభ్యులకు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ ఏవీ సుబ్రహ్మణ్యం, డాక్టర్ చక్రవర్తి, సెట్నెల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.