పునరావాస పనులను త్వరగా పూర్తిచేయాలి
నెల్లూరు(పొగతోట): మన్సూర్‌నగర్, రామిరెడ్డినగర్, తదితర ప్రాంతాల్లో కాలువల్లో నివసించే వారికి పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. వైఎస్సార్‌నగర్‌లో నివాసం ఉంటున్న ప్రజలతో జేసీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కాలువలపై నివసించే వారు భారీవర్షాలు పడితే ముంపునకు గురవుతారని తెలిపారు. ముంపునకు గురికాకుండా వారికి పునరావాసం కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వైఎస్సారనగర్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. హౌసింగ్, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో నిర్దేశిచిన పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.