- జేఎన్టీయూ వీసీ సర్కార్
అనంతపురం సప్తగిరి సర్కిల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కృషి చేయాలని జేఎన్టీయూ వీసీ ఎంఎంఎం సర్కార్ సూచించారు. స్థానిక జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్వాలిటీ ఎడ్యూకేషన్ డెవలప్‌మెంట్‌పై ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ అందించాలన్నారు. దీనికి అన్ని కళాశాలల యాజమాన్యాలు సహకరించాలన్నారు. అనుబంధ కళాశాలల అధ్యక్షుడు శాంతరాముడు, రెక్టార్ సుబ్బారావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ ప్రశాంతి, అనుబంధ కళాశాలల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.