mock poling
-
Big Question: ఒట్టు.. ఉంది లోగుట్టు.. . ఈవీఎం డేటా డిలీట్..!?
-
Elections 2024: మొదలైన మాక్ పోలింగ్
హైదరాబాద్, గుంటూరు/సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఈ మాక్ పోలింగ్ ను నిర్వహించారు. పోలింగ్‌పై బూత్ ఏజెంట్స్‌కి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎంలో ఓటు, వీవీప్యాట్‌లో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్ పరిశీలించుకుంటున్నారు.ఉదయం 7 గం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. -
ఛాలెంజ్ ఓటు, టెండర్డ్ ఓటు గురించి తెలుసుకోండి!
సాక్షి, కరీంనగర్: ఈ నెల 30న(శనివారం) జరిగే హజూరాబాద్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేయించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజు ఉదయం ఓటింగ్ ప్రక్రియ మొదలుకాక ముందు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల్లోపు మాక్ పోలింగ్ పూర్తవుతుంది. తర్వాత సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కోవిడ్ కారణంగా ఈసారి రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసేది. ఈ నేపథ్యంలో మాక్ పోలింగ్ ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం. చదవండి: ఓటరు ఎటువైపు?.. కీలకంగా చివరి 24 గంటలు ► ముందుగా పోలింగ్ జరిగే తేదీన సిబ్బంది ఉదయం 5.30 కల్లా రెడీగా ఉంటారు. పోలింగ్ ఏజెంట్లు కూడా హాజరవుతారు. ►పోలింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి ఫాం–10ని సిబ్బంది తీసుకుంటారు. వాటిపై ఏజెంట్ల సంతకాలు తీసుకొని, అడ్మిషన్ పాసులు ఇస్తారు. ఒక్కో అభ్యర్థి తరఫున ఒక్కరు మాత్రమే పోలింగ్ కేంద్రంలో ఉంటారు. ►పోలింగ్ ఏజెంట్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదు. నిబంధనల ప్రకారం పోలింగ్ సమయంలో ఫొటోలు తీయకూడదు. ►పోలింగ్ ఏజెంట్ల పేరు ఆ ఓటరు లిస్టులో నమోదై ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. తర్వాత పోలింగ్ యంత్రాన్ని సిద్ధం చేసుకొని, ఉదయం 7గంటల్లోపు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ►మాక్ పోలింగ్ అనేది ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. ఒకవేళ వారు లేకపోతే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల సమక్షంలో కనీసం 50 ఓట్లకు తగ్గకుండా నిర్వహిస్తారు. ►మాక్ పోలింగ్ నిర్వహించేటప్పుడు ముందుగా కంట్రోల్ యూనిట్‌లోని క్లియర్ బటన్ని ప్రెస్ చేయాలి. అక్కడ డిస్ప్లే సెక్షన్ “0’ని చూపిస్తుంది. అలాగే వీవీ ప్యాట్లోని డ్రాప్ బాక్స్ కూడా క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. ఏజెంట్లకు కూడా చూపించాలి. అనంతరం పోలింగ్ ఏజెంట్లను పిలిచి, వాళ్లకు ఇష్టమైన గుర్తును నొక్కమని చెప్పి, ఇలా సుమారుగా 50 ఓట్లకు పైగా వేయిస్తారు. చదవండి: అసలీ పోలింగ్ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు వేయడమెలా? ►ఈ క్రమంలో ఆ ఏజెంట్ పేరు, వేసిన గుర్తు, ఎన్ని ఓట్లు వేశాడు? అనే విషయాన్ని ఒక పేపరు మీద రాసుకోవాలి. ఏజెంట్లు అందరూ ఓటింగ్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ నొక్కాలి. ఒకసారి క్లోజ్ బటన్ నొక్కాక బ్యాలెట్ యూనిట్లో ఏ గుర్తుకు ఓటు వేసినా మనకు ఇన్వ్యాలిడ్ అని చూపిస్తుంది. అనంతరం టోటల్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఎన్ని ఓట్లు నమోదయ్యాయో చూపిస్తుంది. తర్వాత రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే అభ్యర్థి వారీగా ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో చూపిస్తుంది. అనంతరం వీవీ ప్యాట్లోని స్లిప్పులను ప్రింట్ తీసి, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లకు చూపిస్తారు. ►ఏజెంట్లు వేసిన ఓట్లు, వీవీ ప్యాట్లోని స్లిప్పుల్లో వచ్చిన ఫలితం లెక్క సరిపోయిందో లేదో సరిచూసుకుంటారు. తర్వాత కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీంతో అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్లీ “0’ నుంచి మొదలవుతుంది. ►అనంతరం స్లిప్పుల వెనకాల మాక్‌పోల్ అనే ముద్ర వేసి, ఒక కవర్లో వేసి, సీల్ చేస్తారు. ప్రిసైడింగ్ అధికారి సంతకం చేశాక అక్కడ ఉన్న ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత వాటిని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచి, పింక్ కలర్ ట్యాగ్‌తో సీల్ చేస్తారు. ఆ ట్యాగ్ మీద కూడా పీఓ (ప్రిసైడింగ్ అధికారి) సంతకంతోపాటు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ►ప్లాస్టిక్ బాక్స్ మీద నియోజకవర్గం పేరు, నంబర్, పోలింగ్ స్టేషన్ పేరు, నంబర్ స్పష్టంగా రాయాలి. తర్వాత పీఓ అనుబంధం–14 ఫాంను నింపాలి. ఈ మాక్ పోల్ అయిపోయాక కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్లకు పటిష్ఠంగా సీలు వేయాలి. ఈ విధంగా మాక్ పోలింగ్‌ను ఉందయం 6 గం. నుంచి 7గంటల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ ఓటు ఓటు వేయడానికి వెళ్లిన వ్యక్తిని అతను నిజమైన ఓటరు కాదని బూత్‌లో ఉన్న ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఎన్నికల అధికారి అక్కడికక్కడే నిలిపివేస్తారు. ఆ సమయంలో ఛాలెంజ్ ఓటు అనుమతిస్తుంది. ప్రిసైడింగ్ అధికారి ఓటరుతోపాటు ఏజెంటు అభ్యంతరాలను విన్న తర్వాత అక్కడ క్యూలో ఉన్న ఓటర్లతో విచారణ చేపడతారు. అతను నిజమైన ఓటరు అని తేలితే ఓటు వేయడానికి అనుమతిస్తారు. కాదని తేలితే నిబంధనల ప్రకారం చర్యలుంటాయి. ఛాలెంజ్ ఓటరు వివరాలను అక్కడికక్కడే నమోదు చేస్తారు. టెస్టింగ్ ఓటు ఓటు వేశాక ఓటరు తన ఓటు వివరాలు సక్రమంగా రాకపోతే వెంటనే అధికారికి ఫిర్యాదు చేయాలి. ఈ విషయంలో అక్కడికక్కడే పోలింగ్‌ను నిలిపివేయడానికి అవకాశముంది. తన ఓటు తాను కోరుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి నమోదైనట్లుగా స్లిప్పులో వివరాలు వస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఏజెంట్ సమక్షంలో విచారణ చేపడతారు. ఓటరు చేసిన ఆరోపణ నిజమైతే పోలింగ్‌ను నిలిపివేస్తారు. తప్పని తేలితే అతనిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు. టెండర్డ్ ఓటు ఓటరు తాను ఓటు వేయడాని కంటే ముందుగానే మరో వ్యక్తి అతని ఓటు వేసిన నేపథ్యంలో బాధితుడి టెండర్డ్ పద్ధతిలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. వచ్చిన వ్యక్తి నిజమైన ఓటరు అని ఏజెంట్లతో విచారణ చేసినపుడు నిర్ధారణ అయితే అతడికి బ్యాలెట్ పత్రాన్ని అందజేసి, ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఆ విధంగా వేసిన ఓటును భద్రపరుస్తారు. అభ్యర్థుల మధ్య ఓట్లు సమానంగా వచ్చినపుడు టెండర్డ్ ఓటును పరిగణనలోకి తీసుకుంటారు. -
తప్పిదాలను పునరావృతం చేయొద్దు
సాక్షి, జడ్చర్ల టౌన్: పోలింగ్ విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు చిన్న చిన్న తప్పిదాలను పునరావృతం చేసుకుంటూ జవాబుదారీగా మారొద్దంటూ మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన జడ్చర్ల అసెంబ్లీ పీఓలు, ఏపీఓల ఎన్నికల శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన చిన్న తప్పిదాలే పెద్ద చర్చగా మారాయని గుర్తుచేశారు. మాక్‌పోలింగ్ అయ్యాక తప్పనిసరిగా ఈవీఎంలు, వీవీప్యాట్లు క్లియర్ చేసి పోలింగ్‌కు వెళ్లాలని, పోలింగ్ ముగిశాక తప్పనిసరిగా ఈవీఎం క్లోజ్ చేయాలన్నారు. అలా చేయకపోవడం వల్ల కౌంటింగ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఫలితంగా ఎన్నికల కమిషన్‌కు జవాబుదారీగా మారాల్సి వస్తుందన్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని విధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాక్‌పోలింగ్ చేసి ఈవీఎంలు క్లియర్ చేయలేదని, వారిలో కొందరు సమాచారం ఇచ్చినా మరికొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. తద్వారా సస్పెన్షన్‌కు గురి కావాల్సి వచ్చిందన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలింగ్ జరిగాక ఇచ్చిన పోలింగ్ శాతం తప్పుగా ఇవ్వద్దని, మీరిచ్చే నివేదికల ఆధారంగానే మీడియాకు సమాచారం అందిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోలింగ్ పర్సంటేజీల విషయంలో తప్పుగా ఇవ్వడం వల్ల పెద్ద రచ్చ అయిన విషయాన్ని గుర్తుచేసి అలాంటి పొరపాట్లు చేయవద్దన్నారు. ఈవీఎం, వీవీప్యాట్లతోపాటు 17ఏ, 17సీ వంటి మొతం 7 రికార్డుల్లోనూ పోలైన ఓట్ల సంఖ్య ఒకేలా ఉండాలన్నారు. పోలింగ్‌కు అవసరమైన 9 డాక్యుమెంట్లతో బుక్లెట్ చేశామని, దానిని చింపకుండా సక్రమంగా రాసి రిసెప్షన్ కౌంటర్లో సమర్పించాలన్నారు. పోలింగ్ ముందురోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు సకాలంలో చేరుకుని కేంద్రాలకు సమయానికి చేరుకుని ఎన్నికలకు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ ముగిశాక త్వరగా రిసెప్షన్ సెంటర్‌కు చేరుకుని ఈవీఎంలు, వీవీప్యాట్, బుక్లెట్, డిస్ప్లే యూనిట్‌ను సమర్పించి వెళ్లాలన్నారు. కేంద్రాల్లో ఏవైనా సమస్యలు వస్తే బుక్‌లెట్‌లో సూచించిన ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని, జడ్చర్ల అసెంబ్లీ పరిధిలోని ఊర్కొండ మండలంలో పనిచేసే సిబ్బంది మాత్రం మహబూబ్‌నగర్ కోడ్‌ను ఉపయోగించి ఫోన్ చేయాలన్నారు. సమయాన్ని వృథా చేయడం మనకు అలవాటని, అలా చేయకుండా ఎన్నికలు విజయవంతం చేద్దామన్నారు. గుర్తింపు కార్డులు తేవాల్సిందే ఓటరు స్లిప్‌లు తీసుకువచ్చిన ఓటర్లను ఓటు వేయడానికి అనుమతి ఇవ్వవద్దని, తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాల్సిందేనని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ముందుగానే తెలియజేయాలని, అంతకు ముందురోజు రాత్రి గ్రామాల్లో ప్రచారం చేయిస్తామన్నారు. శిక్షణలో సబ్ కలెక్టర్, ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, 300 మంది పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
మాక్ పోలింగ్‌తో అనుమానాల నివృత్తి
సాక్షి, పెద్దవూర : ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత ఓటమి పాలైన అభ్యర్థులు, పార్టీలు వెంటనే విమర్శించేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు. ఏ గుర్తుకు వేసినా గెలుపొందిన, మెజారిటీ వచ్చిన పార్టీ అభ్యర్థులకు పడేటట్లు టాంపరింగ్ చేశారని ఆరోపణలు చేస్తుంటారు. అయితే విమర్శలకు తావు ఇవ్వకుండా ఎన్నికల సంఘం మాక్ పోల్ (మాదిరి ఎన్నిక) నిర్వహించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. మాక్ పోల్ ఎలా ఉంటుందో ముందుగా పోలింగ్ ఏజెంట్లకు బాగా తెలియాలి. లేకపోతే వచ్చిన ఫలితాలను ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఓటింగ్ ప్రారంభానికి గంట ముందు పోలింగ్ స్టేషన్లో ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఈవీఎం, వీవీప్యాట్, సీయూలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవాలి. వాటిలో ఎలాంటి ఓట్లు నమోదు కాలేదని నిర్ధారణ చేసుకోవాలి. మిషన్ క్లియర్ చేసి కౌంట్ సున్నా ఉంది లేనిది తెలుసుకోవాలి. యంత్రంలో పాత సమాచారం ఏది లేదని, ఈవీఎం బాగుందని సంతృప్తి చెందాక మాక్ పోలింగ్ చేపడతారు. ఏజెంట్లు గంట ముందు పోలింగ్ కేంద్రంలో లేకున్నా 15 నిమిషాలు వేసిచూసి అధికారులు మాక్ పోలింగ్ చేపడతారు. పోలింగ్ ఏజెంట్లు పోటీలో ఉన్న ఒక్కొక్క అభ్యర్థికి ఒక క్రమం లేకుండా ఓట్లు వేయడం ద్వారా మాక్‌పోల్ నిర్వహిస్తారు. మాదిరి పోలింగ్‌లో కనీసం 50 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థికి అలా ఓట్లు వేస్తారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ నుంచి ఫలితాన్ని తీసుకుని పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వీవీ ప్యాట్ పేపర్ స్లిప్పులను లెక్కించి ప్రతి అభ్యర్థికి ఫలితాలు సరిపోయినట్లు ధ్రువీకరించాలి. అధికారిక పోలింగ్ ప్రారంభం కావడానికి ముందే ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ నుంచి మాక్ పోల్ సమాచారాన్ని తొలగించింది లేనిది ఏజెంట్లు దగ్గరుండి ధ్రువీకరించుకోవాలి. అధికారులు ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకుంటారు. అసలైన సమయంలో ఈవీఎం పనిచేయకపోతే మొత్తం కంట్రోల్ యూనిట్, బీయూ, వీవీ ప్యాట్లను మార్చాలి. ఇటువంటి సందర్భంలో గుర్తులతో సహా నోటాకు కూడా ఒక్కో ఓటు వేసి మాక్ పోల్ నిర్వహిస్తారు. ఓట్లు సరిగ్గా పడింది లేనిది మళ్లీ దృవీకరించుకోవాలి. పోలింగ్ సమయంలో కేవలం వీవీ ప్యాట్ సరిగ్గా పనిచేయకపోతే దానిని ఒక్క దానినే మార్చుతారు. ఈవీఎం అలాగే ఉంటుంది. ఏజెంట్లు మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో డిస్ ప్లే అయిన సమయం, తేదీని పరీక్షించి రాసుకోవాలి. తేదీ, సమయాన్ని కూడా రాసుకుని రెండింటి మధ్య తేడాను చూడాలి. మాక్ పోల్ ఫలితాన్ని కూడా ప్రిసైడింగ్ అధికారి సంబంధించిన ఫారంలో నమోదు చేసి ఏజెంట్ల సంతకాలు తీసుకుని పత్రాలను సీల్ వేస్తారు. -
సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
సాక్షి,బిచ్కుంద (నిజామాబాద్): పోలింగ్ నిర్వహణపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం బిచ్కుంద డిగ్రీ కళాశాలలో పోలింగ్ నిర్వహణ అధికారులకు అం దిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాక్ పోలింగ్, వీవీ ప్యా ట్లు, బ్యాలెట్ యూనిట్లు సీల్ చేయడం , పోలింగ్ సమయ పాలన తదితర అంశాలపై సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి చిన్న చిన్న పొరపాట్లతో పెద్ద సమస్యలు ఏర్పడతాయి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలు ప్రీసైడింగ్ అధికారులు పాటించాలని ఆదేశించారు. శిక్షణ తరగతులలో సూచించిన విధంగా వీవీ ప్యాడ్, ఈవీఎంలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో గత నెల రోజుల నుంచి మాక్ పోలింగ్‌తో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ బూత్‌లలో అన్ని యంత్రాలను సక్రమంగా బిగించాలని, మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. ఓటు వేయడానికి బూత్‌లలో వికలాంగులకు ర్యాంపులు, వీల్చేర్, వాహన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఆరు మండలాల అధికారులు పాల్గొన్నారు. తప్పులు దొర్లకుండా చూడాలి మద్నూర్(జుక్కల్): రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తప్పులు దొర్లకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ పత్రాల స్వీకరణ, స్ట్రాంగ్ రూంను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పారదర్శకత కోసమే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ల విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో 740 పోలింగ్ స్టేషన్లకు 740 బీఎల్వోలు, 74 సూపర్వైజర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ రవీంధర్, అధికారులు ఉన్నారు. -
మరోసారి టీఆర్ఎస్ మాక్ పోలింగ్
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ నేడు మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించనుంది. తెలంగాణ భవన్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే మాక్ పోలింగ్‌కు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎంఐఎం పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించింది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటో ప్రాధాన్యత ఓటు ద్వారానే ఐదో అభ్యర్థిని గెలుచుకుంటామని టీఆర్ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.