సాక్షి, పెద్దవూర : ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత ఓటమి పాలైన అభ్యర్థులు, పార్టీలు వెంటనే విమర్శించేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు. ఏ గుర్తుకు వేసినా గెలుపొందిన, మెజారిటీ వచ్చిన పార్టీ అభ్యర్థులకు పడేటట్లు టాంపరింగ్ చేశారని ఆరోపణలు చేస్తుంటారు. అయితే విమర్శలకు తావు ఇవ్వకుండా ఎన్నికల సంఘం మాక్ పోల్ (మాదిరి ఎన్నిక) నిర్వహించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. మాక్ పోల్ ఎలా ఉంటుందో ముందుగా పోలింగ్ ఏజెంట్లకు బాగా తెలియాలి. లేకపోతే వచ్చిన ఫలితాలను ఒప్పుకోవాల్సి ఉంటుంది.
- ఓటింగ్ ప్రారంభానికి గంట ముందు పోలింగ్ స్టేషన్‌లో ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఈవీఎం, వీవీప్యాట్, సీయూలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవాలి. వాటిలో ఎలాంటి ఓట్లు నమోదు కాలేదని నిర్ధారణ చేసుకోవాలి. మిషన్ క్లియర్ చేసి కౌంట్ సున్నా ఉంది లేనిది తెలుసుకోవాలి.
- యంత్రంలో పాత సమాచారం ఏది లేదని, ఈవీఎం బాగుందని సంతృప్తి చెందాక మాక్ పోలింగ్ చేపడతారు.
- ఏజెంట్లు గంట ముందు పోలింగ్ కేంద్రంలో లేకున్నా 15 నిమిషాలు వేసిచూసి అధికారులు మాక్ పోలింగ్ చేపడతారు.
- పోలింగ్ ఏజెంట్లు పోటీలో ఉన్న ఒక్కొక్క అభ్యర్థికి ఒక క్రమం లేకుండా ఓట్లు వేయడం ద్వారా మాక్‌పోల్ నిర్వహిస్తారు. మాదిరి పోలింగ్‌లో కనీసం 50 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థికి అలా ఓట్లు వేస్తారు.
- పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ నుంచి ఫలితాన్ని తీసుకుని పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వీవీ ప్యాట్ పేపర్ స్లిప్పులను లెక్కించి ప్రతి అభ్యర్థికి ఫలితాలు సరిపోయినట్లు ధ్రువీకరించాలి.
- అధికారిక పోలింగ్ ప్రారంభం కావడానికి ముందే ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ నుంచి మాక్ పోల్ సమాచారాన్ని తొలగించింది లేనిది ఏజెంట్లు దగ్గరుండి ధ్రువీకరించుకోవాలి. అధికారులు ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకుంటారు.
- అసలైన సమయంలో ఈవీఎం పనిచేయకపోతే మొత్తం కంట్రోల్ యూనిట్, బీయూ, వీవీ ప్యాట్‌లను మార్చాలి. ఇటువంటి సందర్భంలో గుర్తులతో సహా నోటాకు కూడా ఒక్కో ఓటు వేసి మాక్ పోల్ నిర్వహిస్తారు. ఓట్లు సరిగ్గా పడింది లేనిది మళ్లీ దృవీకరించుకోవాలి.
- పోలింగ్ సమయంలో కేవలం వీవీ ప్యాట్ సరిగ్గా పనిచేయకపోతే దానిని ఒక్క దానినే మార్చుతారు. ఈవీఎం అలాగే ఉంటుంది.
- ఏజెంట్లు మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్‌లో డిస్ ప్లే అయిన సమయం, తేదీని పరీక్షించి రాసుకోవాలి. తేదీ, సమయాన్ని కూడా రాసుకుని రెండింటి మధ్య తేడాను చూడాలి.
- మాక్ పోల్ ఫలితాన్ని కూడా ప్రిసైడింగ్ అధికారి సంబంధించిన ఫారంలో నమోదు చేసి ఏజెంట్ల సంతకాలు తీసుకుని పత్రాలను సీల్ వేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment